Breaking News

బాలికపై అత్యాచారం… …

-స్పందించని పోలీసు అధికారులు. …

-రంగంలోకి దిగిన బాలిక సంరక్షణ అధికారిణులు

మానవతా విలువలు మంటగలిపి కూతురు సమానమైన ఒక బాలికపై భార్య పిల్లలు ఉన్న ఓ ప్రబుద్దుడు. 15 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి గర్భం చేసిన సంఘటన బుధవారం నాగిరెడ్డి పేట మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాదితులు, ఐసీడీఎస్‌ మండల పర్యవేక్షకురాలు శైలజ, జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్‌ ప్రోజేషన్‌ అధికారిని లావణ్య, షోషల్‌ వర్కర్‌ మమతలు తెలిపిన వివరాల ప్రకారం… నాగిరెడ్డిపెట గ్రామనికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో… గోపాల్‌పేట ఎస్సీ కాలనీలో అద్దే ఇంటిలో తన కూతురు (15)తో కలిసి ఉంటోంది. గత ఎనిమిది మాసాల క్రితం ఎల్లారెడ్డికి చెందిన కయ్యీమ్‌ వద్దకు కూలీకి తల్లితో కలిసి పనికి బాలిక వెళ్లింది. అతను హైదారాబాద్‌కు తీసుకువెళ్లి శంషాబాద్‌ సమీపంలోని తుక్కుగూడలోని మహంకాళి గ్రామలో అద్దేకు ఉంచినట్లు చెప్పారు. అనంతరం మాయ మాటలు చెప్పి బాలికను లోబర్చుకోవడంతో గర్భం దాల్యినట్లు చెప్పారు. అప్పుడు సైతం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా… పోలీసులు పట్టించుకోలేదని స్థానిక పేద్దలు పంచాయతీ పెట్టి వదిలిపేట్టరన్నారు. దీంతో పాటు స్థానికంగా ఉండే ఒక ఆర్‌ఎంపీ వైద్యుడు అబార్షన్‌ చేసినట్లు తెలిపారు. ఆధారం లేకపోవడంతో పేళ్లి చేసుకుంటానని తల్లి, కూతుర్లను నమ్మించి హైదారాబాద్‌ తీసుకువేళ్లడంతో మరో మారు గర్భం దాల్చిందన్నారు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన కయ్యీమ్‌ను తల్లికూతుర్లు నిలదీయడంతో గోడవ జరిగిందన్నారు. దీంతో స్థానికులు పోలీసులవచ్చి బాలికలను, తల్లిని విచారించినట్లు చెప్పారు. పేళ్లి చేసుకుంటామని చెబుతూ తల్లికూతుర్లను భయాందోళనకు గురిచేసి వారిని నమ్మించేందుకు పేళ్లి చేసుకుంటామని ప్రబుద్దుడి తండ్రి, బంధువులు హామీ పత్రం రాసి ఇచ్చారు. దానికి ఓప్పుకుంటున్నట్లు బాదితులైన తల్లి, కూతుర్లు సంతకాలు తీసుకున్నట్లు తెలిపారు. తెలిపిన సమాచారంతో… పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి బాలికను జిల్లా కేంద్రంలోని స్వాధార్‌ హోంకు తరలిస్తున్నట్లు తెలిపారు. కారకుడిపై చట్టపరంగా శిక్షపడేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *