Breaking News

Daily Archives: January 10, 2015

ఆటోడ్రైవర్లుకు యూనిఫాం తప్పనిసరి

  పార్కింగ్‌ బాధ్యత యాజమాన్యాలదే ఆక్రమణలను తొలగించాలి నిజామాబాద్‌ క్రైం, జనవరి 9: ప్రతి ఆటో డ్రైవర్‌ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ట్రాఫిక్‌ సీఐ శేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా ఆటో వాలాలు తమ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమ వెంటే ఉంచుకోవాలని పేర్కొన్నారు. అలాగే నగరంలో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ల వద్ద వాహానలు ...

Read More »

లోగుట్టు?

నిజామాబాద్‌, జనవరి 10,   నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌ పరిధిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు చివరకు ఏం తేల్చనున్నారు…….. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించి ఒక్కసారిగా ఎందుకు నిలిప వేశారు…115 భవనాలకు నోటీసులు ఇచ్చిన బల్దియా…ఓ వైద్యుడి బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేయడంతో ఈ తంతును ముగించేసిందా…..! నిజామాబాద్‌, జనవరి 9: నిజామాబాద్‌ నగరంలో ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ సాగుతోంది. కార్పొరేషన్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగింపు, కూల్చివేతల పరంపర యగ్నంలా సాగుతుందని భావించిన తరుణంలో ఆరంభశూరత్వంగా మిగలడం పట్ల ...

Read More »

‘నిజాం షుగర్స్‌’ను కాపాడుకుందాం

  …రైతుల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తా …బోధన్‌లో చెరుకు రైతుల సమావేశంలో ఎమ్మెల్యే షకీల్‌ బోధన్‌, జనవరి 9: ఐక్యతతో నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని కాపాడుకుందామని, రాజకీయాలకతీతంగా నిలిచి ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకువద్దామని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం బోధన్‌ శివారులోని అప్నా ఫంక్షన్‌హాల్‌లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన చెరుకు రైతుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యె మాట్లాడుతూ రైతుల సంక్షెమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాంషుగర్స్‌ ప్రైవేటీకరణ రద్దుకు నిర్ణయం ...

Read More »

తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అగ్రగామిగా నిలబెడతాం

బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆర్మూర్‌, జనవరి 09, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: భారతీయ జనతా పార్టీని దేశంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు చేయించి భారత దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీగా నిలబెడతామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారాం అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక రోడ్డు భవనాల అతిధి గృహంలో ఏర్పాటుచేసిన విలేకలరుల సమావేశంలో ఆయన మాట్టాడారు. గురువారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన విజయవంతం అయినట్లు ఆయన ...

Read More »

అభ్యంతరాలు లేకుంటేనే క్రమబద్దీకరణ

భూములపై జివో విడుదల కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 9; ప్రభుత్వ భూములకు ఎటువంటి అభ్యంతరాలు లేకుంటేనే, అది అర్హులైన వారికి మాత్రమే క్రమద్దీకరణ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జివో ఎంఎస్‌ 58 ప్రకారం 125 గజాలలోపు ప్రభుత్వ భూమిలో ఇళ్లు, నివాసం ఏర్పర్చుకున్న పేద ప్రజలకు క్రమబద్దీకరణ చేసుకోవడానికి నిర్ణేత దరఖాస్తు ద్వారా సంబంధీత అధికారిని సంప్రదించాలని సూచించారు. జీవో ఎంఎస్‌ 59 ప్రకారం ...

Read More »