Breaking News
న్యాయం చేయమంటే చితకబాదిన వైనం

పోలీసుల ఆరాచకం

న్యాయం చేయమంటే చితకబాదిన వైనం

ఒకటో టౌన్‌ పోలీసుల నిర్వాహకం

నిజామాబాద్‌ క్రైం, జనవరి 13;

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రేండ్లీ పోలీసు అంటు ప్రజలతో మమేకమైన పని చేయాలని సూచిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం అది ఎక్కడ కనిపించడం లేదు. ఇందుకు నిజామాబాద్‌ నగర ఒకటో టౌన్‌పోలీసులు నిర్వాహకమే ఉదహరణ. ఏకంగా అస్తి కోసం న్యాయం చేయమని అడిగిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదారు. ఇదేమి న్యాయం అని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని, నోటికి వచ్చిన తిట్లదండకం అందుకొని కొట్టారని బాధితులు మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వాపోయారు. బాధితులు చంద్రశేఖర్‌, సాంబశివరావుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌నగర్‌లోని ఉంటున్న కోట్టూరు చంద్రశేఖర్‌, సాంబశివరావులు అన్నదమ్ములు. వీరికి సంబంధించిన పాత భవంతి దేవిరోడ్డులో ఉంది. ఈ భవంతిని ఇమ్రాన్‌ మరి కొంత మంది కలిసి ప్రోక్లెయిన్‌తో కూల్చివేసే ప్రయత్నం చేసారు. విషయం తెలుసుకున్న వీరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. అప్పటికే అక్కడికి వచ్చిన నగర ఒకటో టౌన్‌ పోలీసులు అక్కడికి వచ్చి ఏలాంటి విచారణ చేయకుండానే చంద్రశేఖర్‌, సాంభశివరావులను జీపులో పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై వీరు ఎదురు తిరగడంతో అక్కడే ఉన్న ఎస్సై సురేష్‌, ఎస్‌హెచ్‌వో శ్రీనివాసులు విఫరితంగా చితకబాదారన్నారు. కొంత మంది రియల్‌ఎస్టెట్‌ వ్యాపారులకు మద్దతుగా ఒకటో టౌన్‌ పోలీసులు వ్యవహారించారని, నిజామాబాద్‌ ఆర్‌డివో అధినంలో ఉన్న ఆస్తి ఏలా కూల్చి వేస్తారని చంద్రశేఖర్‌, సాంబశివరావులు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి, జిలా& కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. వీరితో పాటు విలేకరుల సమావేశంలో రాజేశ్వర్‌, వారి కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *