Breaking News

తప్పు చేస్తే చర్యలు తప్పవు

 

కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు

నిజామాబాద్‌, జనవరి 13;

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో అధికారులు ఏలాంటి తప్పు చేసిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డిలోని 33 వార్డుల్లో పది మంది ఎమ్మార్వోలు ఇంచార్జిలుగా తీసుకొని ఒకోకరు 3 వార్డులలో వెంటనే సర్వే మొదలు పెట్టాలని, స్థానిక కిందా స్థాయి అధికారుల సహకారంతో సర్వే చేయాలని అన్నారు. అర్హులైన వారిని గుర్తించి సిఫారసు చేయాలని అన్నారు. అలాగే పెన్షన్‌, ఇళ్ల మంజూరికి ధరఖాస్తులను తీసుకొవాలని అన్నారు. ఎక్కడ కూడా లబ్దిదారులకు ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకొవాలని అన్నారు. అనంతరం కామారెడ్డిలోని మురికి వాడలను పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా వార్డుల వారిగా సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారించేలా చూడాలని, అవసరమైతే పనులకు సిఫారసు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు డిఆర్‌డిఎ పిడి వెంకటేశం, ఆర్‌డివో నగేష్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ సుష్మ, కమిషనర్‌ విక్రమ్‌సింహలు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *