Breaking News

డైరీ అధికారుల మోసం ఇది

 

-పట్టించుకోండి పెద్దసార్లూ…

-ఓ బాధితుడి ఆవేదన.. అక్రందన..

నిజామాబాద్‌, జనవరి 20:

కలెక్టర్‌ సారూ…..

నా పేరు యార్లగడ్డ బాబురావు. మాది మిర్జాపూర్‌ గ్రామం, కోటగిరి మండలం. నిజామాబాద్‌ జిల్లా డైరీ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌ ఉపాధి పేరుతో నన్ను మోసం చేసి రూ.5 లక్షలు నష్టం చేయడమే కాకుండా డైరీని ఏర్పాటు చేయించి మరో రూ.1.05 కోట్లు ఖర్చు చేయించి నష్టం చేయించిన అధికారులపై చర్య తీసుకోవాలని వేడుకుంటున్నాను. ఇది నా పరిస్థితి…

సుమారు 26 నెలల క్రింద ఎ.పి. డైరీ బి.యం.సి. మా ఇంటి వద్ద నెలకోల్పినారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో రోజుకు 300 లీటర్ల పాలు ఇస్తాను. నా వద్ద వంద ఆవులకు పైగా ఉన్నాయని ఇక్కడ బి.యం.సి. నెలకోల్పుటకు అనువైన ప్రదేశం అని, నన్ను భ్రమంలో దించి మేనేజర్‌ రమేష్‌ బి.యం.సి.యుని నెలాకోల్పారు. వేయి లీటర్ల పాలు సరఫరా చేయిస్తున్నానని, నా నుంచి కమిషన్‌ తీసుకున్నాడు. ఆలాగే నా వద్ద పాల ఉత్పత్తి పెంచుటకు అని ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు ద్వారా రూ.25 లక్షల లోను మంజూరు చేయిస్తానని నమ్మించారు.

ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పరచి వాటి ద్వారా వచ్చే కమీషన్‌ నీకు ఇస్తానని చెప్పాడు. నాచేత బి.యం.సి.యు.ని పెట్టించినాడు. దానికి 36 ఫీట్లు పోడవు, 18 ఫీట్లు వెడల్పు వైశాల్యం గల బిల్డింగు కావేలనని దాని 5వేల కిరాయి ఇస్తానని మా ఇంట్లో ఏర్పరచినారు. అదేవిధనే సెంటర్‌ను ఏర్పాటు చేసారు. మరోపక్క ఆయనకు సొంత అవసరాల నిమిత్తం నా దగ్గర రూ.4 లక్షల చేబదులు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ డబ్బును తిరిగి ఇవ్వలేదు. వీటిన్నింటికి గానూ నేను డాక్యుమెంటేషన్‌ పూర్తిచేసే సమయంలో ఈ డబ్బులకు ఒత్తిడి చేయటం వలన ఐ.సి.ఐసి.ఐ బ్యాంకు వారితో ఎటువంటి లోను ఇవ్వకూడదని, ఇస్తే నాకు ఎలాంటి సంబంధములేదని వారితో చెప్పి డాక్యుమెంటేషన్‌ చేసే సమయంలో చల్లగా జారుకున్నారు. ఈ సంద్బముగా నాకు ఎలాంటి లోన్‌ ఇవ్వలేదు. దాని వలన నెను రూ.13 లక్షలు పెట్టి కోన్న ఆవులు డబ్బులు కట్టలేకపోయాను. ఈ లోన్‌ రాకపోవడంతో పారితోషికం నెలకు 70 వేలు ఇవ్వడం వలన ఆర్థికంగా దెబ్బతిని వాటి పోషన బారంపెరిగి, వేరే వ్యాదుల వల్ల 96 ఆవులు చనిపోయినాయి. ఇలా నేను కోటి 20 లక్షలు నష్టపడ్డాను. మిగిలిన ఆవులు, షెడ్లు అమ్ముకున్నాను. అయినా బాకీలు తీరలేదు. వీటి డాక్యుమెంట్లు మొత్తం నావద్ద ఉన్నాయి. మీరు వెరిపై చేపిసై ఈ డాక్యుమెంట్స్‌ మీకు సమర్సించగలను. సెంటర్‌లో ఓపెన్‌ చేస్తానని నమ్మించి నన్ను పూర్తిగా నష్టపరిచినారు. సుమారు నా దగ్గర 130 ఆవులు ఉండేవి. ప్రస్తుతం నావద్ద 4 పశువులే మిగిలినవి. ఆప్పు భరించలేక మిగిలిన ఆవులు అమ్ముకోవడం జరిగినది. మాకు నెల 5 వేల కిరాయి ఇస్తానని నమ్మించి ఇప్పటికి ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. నాకు జరిగిన నష్టాన్ని విచారణ జరిపి పరిహారం ఇప్పించుటకు జి.యం.పై చర్యతీసుకోని, పరిహారం ఇప్పింగలరు. ఇదే తరహాలోనే యం.డి. రఫత్‌ అలీ ఉన్నపుడు సారంగపూర్‌ డైరి పడిపోతున్నదని, దానిని బుగుచేసుకోనుటకు 25 లక్షలు లోను తీసి ఇచ్చాం. మా యందు దయ ఉంచి ఈయన మీద చర్య తీసుకోని, పాల కేంద్రాలు ప్రారంభిస్తానని, 5 ఈ.యం.టి.లు.5 బ్యాటరీలు ఇచ్చినారు. అవి ఏమి ఉపయోగం లేక పడి ఉన్నాయి. బి.యం.సి.యు. మెయింటెనెన్స్‌ కిరాయి నెలకు రూ.5 వెల చోప్పున ఇప్పించగలరు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *