Breaking News

Daily Archives: January 23, 2015

బోర్లు నిషేదం

  -127 గ్రామల్లో వాల్టా అమలు -భూగర్భ జలాలు తగ్గడమే కారణం -ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ రోస్‌ నిజామాబాద్‌, జనవరి 22: మళ్లీ భూగర్బ నీళ్ల లొల్లి షూరూ అయింది. ఒకవైపు వర్షాలు లేక రైతులు విలవిలాడుతున్నారు. పంటలు వేయాలంటేనే జంకుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం బోర్లు వేసేవారిపై వాల్టాను ఉపయోగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రోనాల్ట్‌రాస్‌ ఉత్తర్వులను జారీ చేసారు. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వాల్టా చట్టం పరిధిలోకి జిల్లాలోని 127 గ్రామాలను ...

Read More »

తెవివి విద్యార్ధినులకు పోటిలు

  డిచ్‌పల్లి, జనవరి 23, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: జాతీయ బాలికల శిశువుల పరిరక్షణ దినం సందర్భంగా తెవివి ఉమెన్స్‌ సెల్‌ ఆధ్యర్యంలో విద్యార్ధినులకు వివిధ రకాల ఆటల పోటిలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన రిజిస్ట్రార్‌ లింబాద్రి సందర్శించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉమెన్స్‌ సెల్‌ డైరెక్టర్‌ నందినిని అభినందించారు. వీటిలో గెలుపొందిన వారికి 24న జరిగే కలలకు రూపానిద్దాం కార్యక్రమానికి హాజరవుతున్న విసి పార్థసారథిగారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ...

Read More »

దూద్‌గావ్‌ లో ఆహార భద్రత బియ్యం పంపిణీ చేసిన సర్పంచ్‌ జయ దుర్గేశ్‌

  డిచ్‌పల్లి, జనవరి 23, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: డిచ్‌పల్లి మండలం దూద్‌గావ్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పథకం ప్రతీ ఒక్కరికీ ఆరుకిలోల బియ్యంను సర్పంచ్‌ దుర్గేశ్‌ ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మాట్లాడుతూ ఎవరైనా అర్హులైఉండి ఆహార భద్రత కార్డు రాని వారుంటే వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, ఆహార భద్రత పథకం లబ్ది పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్‌ రవిగౌడ్‌, ఈడీసీ పెద్దలు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Read More »

తెయూలో నేడు కలలకు రూపమిద్దాం

డిచ్‌పల్లి, జనవరి 23, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులను ఆధునికి, పోటీ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేలా తయారు చేయడమే పెయింట్‌ యువర్‌ డ్రీమ్స్‌ కలలకు రూపమిద్దాం కార్యక్రమ లక్షమని తెయూ రిజిస్ట్రార్‌ లింబాద్రి తెలిపారు. శుక్రవారం రిజిస్ట్రార్‌ ఛాంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు కేవలం సంపాదకీయ విద్యకే పరిమితం కాకుండా వారిలో అదనపు నైపుణ్యాల పెంపునకు శిక్షణ ఇవ్వడమే కలలకు రూపమిద్దాం అంతిమ ఉద్దేశ్యమని వివరించారు. విద్యార్థులు మానసిక ధైర్యం, ఆత్మ విశ్వాసం, విజయ కాంక్ష ...

Read More »

కళ్యాణి లక్ష్మి పథకం ప్రారంభం

  -నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణి లక్మి పథకాన్ని శుక్రవారం నూతన అంబేద్కర్‌ భవనంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు మంజూరైన నగదు చెక్కులను అందజేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఎంతో హర్షనీయమణి ఆర్హులైనవారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, అర్బన్‌ ఎం.సి.ఎ బిగాల గుప్త, రూరల్‌ ఎం.ఎల్‌.ఎ బాజిరెడ్డి, నగర మేయర్‌ ఆకుల సుజాత, జుక్కల్‌ ఎం.ఎల్‌.ఏ హన్మంత్‌షిండే, పార్లమెంటు సెక్రెటరీ ...

Read More »

చెరువుల పునరుద్దరణకు మరింత వేగం

  -కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ నిజామాబాద్‌, జనవరి 23: జిల్లాలో చెరువుల పునరుద్దరణ పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు, అందుకు సంబంధించి అయా శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహారించి పని చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. శుక్రవారం తన చాంబరులో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3250 చెరువులు ఉండగా మొదటి దఫాలో 701 చెరువులను ఎంపిక చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మరో 25 చిన్న నీటి పారుదల చెరువుల పనురుద్దరణకు రూ.10.5 కోట్లను మంజూరి చేసామని, ...

Read More »

ఆధునిక వ్యవసాయ యంత్రీకరణ పథకం ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద శుక్రవారం అర్హులైన రైతులకు ఆధునిక వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు. ఇట్టి పథకాన్ని రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు ఈ పథకానికై మంజూరు చేయగా 200 కోట్లు తెలంగాణ రైతులకు కావాలని కోరన్నారు. దానిని సి.ఎం కేసీ.ఆర్‌ మంజూరు చేయడం హర్షనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, అర్బన్‌ ఎం.సి.ఎ బిగాల గుప్త, ...

Read More »

హిందూ శక్తి సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

  నిజామాబాద్‌ కల్చరల్‌, జనవరి 23: రేపు జరిగే హిందూ శక్తి సమ్మేళనాన్ని విజయవంతం చెయాలని ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. ఈ సమ్మేళనం నగరంలోని బస్టాండ్‌ ప్రక్కనగల హరిచరణ్‌ మార్వాడి పాఠశాల యందు జిల్లా సాధు దంపతుల ఆద్వర్యంలో జరుగుతుందన్నారు. హిందువులకు ఎటువంటి సమస్యలు ఎదురైన విశ్వహిందూ పరిషత్‌ ముందుంటుంది అన్నారు. అనంతరం గోవుల రక్షణకై నగరంలోని ముఖ్యమైన పలు ప్రాంతాలలో త్రాగునీరు కుండిలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ...

Read More »

టి.జి.ఓ డైరీ క్యాలండర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: తెలంగాణ గెజిటేడ్‌ అధికారుల డైరీ, క్యాలండర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని నూతన అంబేద్కర్‌ భవనంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా టి.జి.ఓ స్‌ జిల్లా అధ్యక్షుడు బాబురావునాయక్‌ మాట్లాడారు. ఆరోగ్య భద్రత కార్డులు, ఇండ్ల స్థలాలు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రప్పించాలని ఆయన కోరారు. ఖాళీలుగా ఉన్న 1లక్ష 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. పి.ఆర్‌.సి సనీస వేతనం రూ. 10 వేలవరకూ పెంచాలని ...

Read More »

బోర్లు నిషేదం… 127 గ్రామల్లో వాల్టా అమలు…భూగర్భ జలాలు తగ్గడమే కారణం… ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ రోస్‌

నిజామాబాద్‌, జనవరి 23: మళ్లీ భూగర్బ నీళ్ల లొల్లి షూరూ అయింది. ఒకవైపు వర్షాలు లేక రైతులు విలవిలాడుతున్నారు. పంటలు వేయాలంటేనే జంకుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం బోర్లు వేసేవారిపై వాల్టాను ఉపయోగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రోనాల్ట్‌రాస్‌ ఉత్తర్వులను జారీ చేసారు. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వాల్టా చట్టం పరిధిలోకి జిల్లాలోని 127 గ్రామాలను తీసుకువస్తూ, అక్కడ ఎవరు కూడా కొత్తగా బోర్లు వేయరాదని నిషేదం విధించారు. వాల్టా చట్టాన్ని అనుసరించి ఎనిమిది ప్రభుత్వ ...

Read More »