Breaking News

Daily Archives: January 25, 2015

ఇది భీంగల్‌ డిపో దుస్థితి

  -సిఎం సారూ… నాగోడు పట్టించుకోరూ. భీంగల్‌ ఆర్టిసీ డిపో దుస్థితి నేతల హామీల గల్లంతు భీంగల్‌, జనవరి 25: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: సి.ఎం. సారూ… నేనండీ భీంగల్‌ ఆర్టీసీ బసు డిపోనూ. ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు నేనోక అవకాశంగా మారాను. ప్రతి ఎన్నికల్లో నా పేరు చెప్పి ఈ ప్రాంతంలోని ఓట్లన్నింటిని దండుకుంటున్నారు. అ తర్వాత నాగోడు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది గత పదేళ్లుగా తంతుగా మారింది. అయితే మీ కారణంగా 60 ఏండ్ల సంది తెలంగాణ ...

Read More »

మనమంతా 24.69 లక్షలే

  -సమగ్ర సర్వే లెక్కలు ఇవి నిజామాబాద్‌ ప్రతినిధి, జనవరి 24: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలోని గణాంకాల లెక్క తెలింది. ఈ సర్వే వివరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో అతి తక్కువ జనాభా నిజామాబాద్‌ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. జిల్లాలో మొత్తం జనాభా 24 లక్షల 69 వేల 816గా నమోదు అయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం కుటుంబాల ...

Read More »

కలెక్టర్‌ కూతురుకు పోస్టల్‌ ఖాతా

-ప్రారంభించిన తపాల శాఖ నిజామాబాద్‌, జనవరి 24: ప్రధానమంత్రి నరేంద్రమోడి ‘బేటి బచావో, బేటి పడావో’ నినాదంతో చేపట్టిన సుకన్య సమృద్ది పథకం తపాల ఖాతాను జిల్లాలో మొట్ట మొదటి జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ కూతురు అతిరాయ్‌, ఐయిషా పేర్లతో ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా తపాల శాఖ సీనియర్‌ సూపరింటెండెంట్‌ అభిజిత్‌ బన్సాడే ఖాతాలను కలెక్టర్‌లకు శనివారం అందజేసారు. ఈ పథకం ద్వారా ఆడ పిల్లలకు ఎంతో ప్రయోజనకరం అని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. కాబట్టి ఆడ పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా ...

Read More »

జేసిగా రవిందర్‌రెడ్డి

నిజామాబాద్‌, జనవరి 24: నిజామాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఎ.రవిందర్‌రెడ్డి శనివారం కలెక్టర్‌ నుంచి బాధ్యతలను స్వీకరించారు. గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న పోస్టును ఇటీవలే ప్రభుత్వం భర్తీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జేసి రవిందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు డిఆర్‌వో తదితరులు పాల్గొన్నారు.

Read More »

మా సోమ్ము మాకు కావాలి… బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 24: ఎవరి ఆస్తులు అడగడం లేదు, ఎవరి హక్కులను హరించడం లేదు. మా సోమ్ము మాకు కావాలి అంటున్నాం, కాని ఈ ప్రభుత్వాలు బిసి విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు ఫీజు రియింబర్సిమెంట్‌ ఇవ్వకుండా కాలయాపన చేయడంపై ఇలా ఆవేదనలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ...

Read More »

భృతి కార్మికుల హక్కు… ఐఎఫ్‌టియు జాతీయ అధ్యక్షెడె డివి.కృష్ణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 24: బీడీ కార్మికుల కారణంగా ప్రభుత్వానికి లక్షల రూపాయాల అదాయం వస్తుందని, బీడీ కంపెనీలు కోట్ల రూపాయాలు దండుకుంటున్నాయని, కాని కార్మికుల మాత్రం జీవన భృతిని కల్పించేందుకు ప్రభుత్వాలు వెనకడుతున్నాయని ఐఎఫ్‌టియూ జాతీయ అధ్యక్షుడు డివి.కృష్ణ అన్నారు. శనివారం బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలని, పరిశ్రమను కాపాడాలని డిమాండ్‌ చేస్తు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. అంతకు ముందే నగరంలోని భారీర్యాలీని నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా ...

Read More »