Breaking News

Daily Archives: January 29, 2015

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక కిలో బియ్యం పంపిణీ చేసిన సర్పంచ్‌

  డిచ్‌పల్లి, జనవరి 29: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పథకాన్ని డిచ్‌పల్లి మండలం గాంధీనగర్‌ కాలనీలో సర్పంచ్‌ అంజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులెవరికైనా ఆహార భద్రత పథకం అందని యెడల గ్రామ పంచాయితీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్‌పిపి దాసరి ఇంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పధకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్ల ఎమ్‌పిటిసి సాయన్న, ఎమ్‌పిటిసి రవికుమార్‌, ...

Read More »

ఐక్య ఉద్మయాలే శరణ్యం

  -జె.బి.రాజు, దళిత సేన జాతీయ అధ్యక్షులు -నిజామాబాద్‌, జనవరి 29: ఎస్సీలు అంతర్గత కుమ్ములాటలతోనే ఉంటే దళితుల సమస్యలు మరింత జఠిలం అవుతాయని, విబేథాలను విడి కలిసి కట్టుగా ఐక్య ఉద్యమాల కోసం కలిసి రావాల్సిన అవసరం ఉందని దళిత సేన జాతీయ అధ్యక్షుడు జె.జి.రాజు అన్నారు. గురువారం హరితా హోటల్‌లో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ”దళితుల సమస్యలు, సవాళ్లు – ఐక్య ఉద్యమాలు” అనే ఆంశంపై సదసుస్స జరిగింది. సావెల్‌ గంగాధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య ...

Read More »

అంబేద్కర్‌ విగ్రహ ధ్వంసం దోషులను కఠినంగా శిక్షిించాలి

-దళిత సంఘాల ర్యాలీ నిజామాబాద్‌, జనవరి 29: మోర్తాడ్‌ మండలం ఏర్గట్ల గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షిించాలని, నందిపేట మండలం వెల్మల్‌లో జాతీయ జండాను ఎగరవేయకుండా దళిత సర్పంచ్‌ను అడ్డుకున్న గ్రామ కమిటీ వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జిల్లాలోని 13 దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌కు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. దళిత సంఘాల ప్రతినిధిగా గైని గంగారం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించారు. అంతకుముందు హోటల్‌ ...

Read More »

అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

  రెంజల్‌ (బోధన్‌), జనవరి 29: రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన మమ్మాయి రమేష్‌(38) అనే వ్యక్తి అవమానం భరించలేక తన పంట పొలంలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాట్టు ఎస్సై టాటా బాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మమ్మాయి రమేష్‌ దొంగతనం చేశాడనే ఆరోపణతో కేసు నమోదు చేయగా, ఆయన చేయలేదని మనస్తాపం చెంది ఇంటి పక్కన పంట పొలంలో ఉదయం 9:30 ప్రాంతంలో వేప చెట్టు కు ఉరి వేసుకొని మృతి చెందాడని, ...

Read More »

తెయూలో ఉర్దూ సిలబస్‌ మార్పునకు నిర్ణయం

  డిచ్‌పల్లి, జనవరి 28: తెలంగాణ యూనివర్సిటి ఉర్దూ విభాగం ఆద్వర్యంలో మంగళవారం సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉర్దూ విభాగ అదిపతి అక్తర్‌ సుల్తానా, భోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్‌ పర్సన్‌ మూసా ఇక్బాల్‌ ఖురేషీ పాల్గోన్నారు. సెమినార్‌లో త్వరలో ఉర్దూ ఫెస్టివల్‌ నిర్వహించుటకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా వివిద కళాశాలల నుండి వచ్చిన విభాగ అధిపతులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యమైనవి డిగ్రీ స్తాయి ఉర్దూ సిలబస్‌లో మార్పులు చేయడం, తెలంగాణ కవులకు, రచయితలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉర్దూ మీడియం ...

Read More »

తెయూ భూములను పరిశీలించిన ఇంచార్జి వీసీ పార్తసారది.

  డిచ్‌పల్లి, జనవరి 28: తెలంగాణ యూనివర్సిటికి చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయన్న వార్తల నేపద్యంలో ఇంచార్జీ వీసీ పార్తసారది బుధవారం రిజిస్ట్రార్‌ లింబాద్రితో కలసి భూములను పరిశీలించారు. యూనివర్సిటికి సంబందించిన ఒక అంగుళం భూమి కూడా ఆక్రమణదారుల పరం కానిచ్చే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కలెక్టర్‌, ఇతర రెవెన్యూ అధికారులతో మాట్లాడి తక్షణం అవసరమైతే రీ సర్వే చేయించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వెంటనే భుముల చుట్టూ కంచే గాని లేదా ప్రహారి నిర్మాణం గాని చేపడతామని ...

Read More »

పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: అర్మూర్‌ పట్టణంలోని 8,10వ వార్డులో బుధవారం 2 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మణ పనులకు అర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి సింగ్‌ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భ:గా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన అతికొద్ది రోజుల్లో జిల్లా ఎమ్‌పి కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్నన్‌ లింగాగౌడ్‌, స్థానిక ...

Read More »

తెలంగాణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: నూతన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర అద్వకేట్‌ జెఏసి పిలుపు మేరకు నేటి నుండి శనివారం వరకు కొర్టు విధులను బహిష్కరించనున్నట్లు ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణ పందిత్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక హై కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు చిలుక కిష్టయ్య, జనరల్‌ సెక్రెటరీ జక్కుల శ్రీధర్‌ కోనేరు, జాయింటు ...

Read More »

వేములపల్లి కిరణ్‌ కుమార్‌ స్మారక క్రీడా పోటీలను విజయవంతం చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌ కుమార్‌ వర్ధంతిని పుస్కరించుకొని ఈ నెల 31న పిడిఎస్‌యూ, పివైఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పివైల్‌ జిల్లా అధ్యక్షుడు బాలయ్య, పిడిఎస్‌యూ జిల్లా కార్యదర్శి నిమ్మల నిఖిల్‌ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిరణ కుమార్‌ విద్యార్థులు, యువతలో చైతన్య పరుస్తూ విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థులు సమాజంలో చెడు వ్యసనాలైన గుట్కా, సారా, పాన్‌మసాలా వ్యతిరేకంగా పోరాడరన్నారు. యువతను ఉద్యమం ...

Read More »