Breaking News

క్రీడాల్లో ఒడిన గెలిచిన పండగే… ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13:

క్రీడలు అంటేనే పండులాంటివి, అలాంటి క్రీడాల్లో ఒడిన గెలిచిన పండుగాలాగే గడపలాని, ఒటమి పాఠంలాగా, గెలుపును మరో గెలుపునకు పునాదిలా తీసుకోవాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పోలీసు పరేడ్‌ మైదానంలో ఎస్పీ జిల్లా పోలీసు శాఖ 48వ స్పోర్ట్స్‌ అండ్‌ గెమ&్స మీట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎస్పీ పతాకావిష్కరణ చేసి, పావురాన్ని ఎగరవేసి ప్రారంభం చేసారు. పోలీసు అంటేనే విధి నిర్వహణలో ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోనవాల్సి వస్తుందని, అలాంటి మనకు క్రీడాలు ఎంతో అవసరం అన్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపకారంగా ఉంటాయన్నారు. పోలీసు నుంచి నిజామాబాద్‌ జిల్లా నుంచి జాతీయ స్థాయిలో నావాతే శ్రీనివాస్‌ ట్రైద్లాన్‌లో ఎంతో గుర్తుంపు వచ్చిందన్నారు. ఈ స్పూర్తి ప్రతి ఒక్కరిలో నిండి ఉండాలన్నారు. జాతీయ స్థాయ వరకు వివిధ స్థాయిల్లో ప్రభుత్వం గుర్తింపు ఉంటుందని, అలాంటి వారికి రెండు ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయని ఎస్పీ గుర్తు చేసారు. ఈ క్రీడాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని అన్నారు. గెమ్స్‌ మీట్‌లో మాట్లాడుతూ ఇక్కడి నుంచి వెళ్లిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ పోటీలను మూడు రోజుల పాటు నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్లు, ఆర్ముడ్‌ రిజర్వు జట్ల మధ్య వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, కబడ్డీ, హైజంపు, లాంగ్‌ జంప్‌, షాట్‌ఫుట్‌, డిస్కస్‌ త్రో, జవలీన్‌, అథ్లెటిక్స్‌ పోలీసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి, డిఎస్పీ ఆనంద్‌క&ఉమార్‌,ఎఆర్‌ డిఎస్పీ వెంకటేశ్వర్లు, స్పెషల్‌ బ్రాంచి డిఎస్పీ ప్రసాద్‌రావు, స్పెషల్‌ బ్రాంచి సిఐ శ్రీనివాస్‌రెడ్డి, రిజర్వుడ్‌ సిఐ శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న ...

Comment on the article