Breaking News

Monthly Archives: March 2015

వలస బాటలో మూగజీవాలు

బాన్సువాడ, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావ పరిస్థితులు రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి ఏటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో జంతు పెంపకం దారులు సంతోషంతో ఉండేవారు. ఈయేడు వర్షాలు లేక కరువు ఛాయలు అలుముకోవడంతో జంతువుల పెంపకం దారులు వలస బాట పడుతున్నారు. ముఖ్యంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల పెంపకం దారులు జీవనాధారం కోసం జంతువులతోపాటు వలసపోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని జుక్కల్‌, నారాయణఖేడ్‌ ప్రాంతంలోని జీవాల పెంపకం దారులు నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌, ...

Read More »

తెవివి స్టేడియం కోసం స్థల పరిశీలన

డిచ్‌పల్లి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇందూరుకే తలమానికంగా త్వరలోనే క్రీడా కేంద్రంగా మారనుందని విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్స్‌లర్‌ పార్థసారధి, రిజిస్ట్రార్‌ లింబాద్రి కృషితో త్వరలోనే స్టేడియం మంజూరు కానుందని పేర్కొన్నారు. మంగళవారం స్థల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ప్రేమ్‌కుమార్‌, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బాబురాం, ఎఇఎం రాజేశ్వర్‌రావులు యూనివర్సిటీకి వచ్చి రిజిస్ట్రార్‌ను కలిశారు. ఉన్నతాధికారులతో కలిసి స్టేడియం నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ...

Read More »

తెరాస గ్రామ కమిటీల ఎన్నిక

రెంజల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా, రెంజల్‌ గ్రామాల తెరాస గ్రామ అధ్యక్ష, కార్యదర్శులను మంగళవారం మండల ఇన్‌చార్జి, తెరాస నవీపేట మండల అధ్యక్షులు నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెంజల్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా కర్ణం శంకర్‌, తూర్పు ప్రశాంత్‌, నీలా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం.డి. గఫార్‌, విశ్వనాథ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు తమ తమ గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి గ్రామాల అభివృద్దికి తమవంతు సహకారం ...

Read More »

1 వ డివిజన్‌లో మునిసిపల్‌ కమీషనర్‌ తనిఖీలు

నిజామాబాద్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ : మంగళవారం ఉదయం 6 గంటలకు 1వ డివిజన్‌లో మునిసిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వర్లు తన బృందంతో కలిసి విస్తృతంగా పర్యటించారు. అడుగడుగునా సమస్యలను కళ్ళారా చూశారు. మురికి కాల్వల అపరిశుభ్రతపై అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా అభివృద్దికి మాత్రం ఆమడ దూరంలో ఉన్న పరిస్తితులను చూసి అవాక్కయ్యారు. మారుతినగర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, గంగాస్థాన్‌లలో పర్యటించారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తద్వారా వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం త్వరలోనే ...

Read More »

మునిసిపల్‌ సమావేశాన్ని ‘మమ’ అనిపించేశారు – ఎటువంటి చర్చ లేకుండానే ఎజెండా అంశాలకు ఆమోదముద్ర

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన జరిగిన మునిసిపల్‌ సర్వసభ్య సమావేశాన్ని ఎప్పటిలాగానే మమ అనిపించేశారు. ఎజెండాపై ఎలాంటి చర్చ లేకుండానే నామమాత్రపు చర్చ జరిపి ఎజెండాకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. సమావేశంలోని ఎజెండాలో మొత్తం 66అంశాలను పొందుపరచగా కొన్నింటికి మాత్రమే పెండింగ్‌లో ఉంచి మిగతావాటికి ఆమోదముద్ర వేశారు. సమావేశంలో కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా గోదావరి జలాల నీటి విషయమై కొందరు సభ్యులు ఆగ్రహం ...

Read More »

36 సిసి కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ నిఘా – ట్రాఫిక్‌ సిఐ శేఖర్‌రెడ్డి – ఎన్‌ఐఎన్‌ ఇంటర్వ్యూలో వెల్లడి

నిజామాబాద్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని విద్యార్థులు, చిన్న చిన్న వాహనదారులు యు టర్న్‌ వద్ద దూరంగా వెళ్లి మలుపు ఎందుకు తిరగాలనే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్దంగా తప్పుదారిలో వెళ్లడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్‌ సిఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా మద్యంసేవించి వాహనాలు నడపవద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఒకవేళ తప్పనిసరి తాగాల్సి వస్తే వారి పక్కనున్న వారితో మరో వాహనంలో వెళ్లాలని సూచించారు. దీనివల్ల ప్రమాదాలను కొంత వరకైనా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. 18 సంవత్సరాల ...

Read More »

నిజామాబాద్‌ టు యమపురి వయా డిచ్‌పల్లి

నిజామాబాద్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో వెళ్లే ప్రయాణీకులు నగరంలోని మాధవనగర్‌ దాటగానే వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ గత రెండు సంవత్సరాలుగా నాసిరకమన రోడ్లు వేసినవి వేసినట్టుగానే ఉన్నాయి. దీనికి అక్కడి ప్రజలే ప్రత్యక్ష సాక్ష్యం. దీనివల్ల వాహనదారులు, ప్రయాణీకులు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులో లేదా ఇతర వాహనాల్లో అతివేగంతో వెళ్లడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు గత కాలంలో చోటు చేసుకున్నాయి. ఇలా ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతూ, ...

Read More »

ముగిసిన నామినేషన్ల పర్వం

ఆర్మూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండురోజులుగా జరుగుతున్న ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసినట్టు ఎన్నికల అధికారి జగదీశ్‌, సహాయ ఎన్నికల అధికారి వెంకటరావు షిండే తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం అధ్యక్ష పదవికి నర్సయ్య, కాందేశ్‌ శ్రీనివాస్‌, నరేందర్‌, జనరల్‌ సెక్రెటరీ పదవికి గంటా విప్లవ్‌ కిరాడ్‌, మద్దపల్లి మోహన్‌, కోశాదికారి పదవికి కొండి పవన్‌ కుమార్‌ నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. మొట్టమొదటి సారిగా ...

Read More »

ఛలో హైదరాబాద్‌ విజయవంతం చేయండి

ఆర్మూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మేదరి మహాసభ ఏప్రిల్‌ 19న నిర్వహిస్తున్నట్టు, సభను విజయవంతం చేయాలని జిల్లా మేదరి ఐక్య కార్యాచరణ కమిటీ ఆద్వర్యంలో మేదరి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర మేదరి రాజకీయ చైతన్య వేదిక కార్యవర్గ సబ్యుడు గంగాశంకర్‌ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మేదరి కులస్తులు వెనకబడిన తరగతులకు చెందిన వారని, ఇపుడు బిసి-ఎగా గతంలో పాలకవర్గాల పార్టీలు ఎస్సీలుగా మార్చుకోవాలని, బిసిలుగా మారడం సరైంది కాదని, ఇప్పటికైనా ...

Read More »

లబ్దిదారులు వెంటనే బ్యాంకు రుణాలు చెల్లించాలి – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌

నిజామాబాద్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజీవ్‌ గృహ కల్ప లబ్దిదారులు బ్యాంకు రుణాలు సెటిల్‌ చేసుకోవడానికి ముందుకు రావాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్‌లో బ్యాంకు అధికారులు, రాజీవ్‌ గృహకల్ప లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 8 సంవత్సరాల క్రితం సంబంధిత లబ్దిదారులకు రాజీవ్‌ గృహకల్పద్వారా నిర్మించిన గృహాలను స్వాధీనం చేయడం జరిగిందని, ఈ లబ్దిదారులు నెలకు రూ. 500 చొప్పున ...

Read More »

ఆధునిక పద్దతిలో గొర్రెల మేకల పెంపకం ద్వారా ప్రయోజనం – కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలు పెంపకం దారులకు నూతన విధానాలతో కూడిన పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌ మండలం మోపాల్‌ గ్రామంలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారన మందులు వేసి నట్టలు నివారణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం గొర్రెలు, మేకల పెంపకం దారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తుందని, ఈనెల ...

Read More »

దొంగను అదుపులోకి తీసుకున్న జిఆర్‌పి పోలీసులు

నిజామాబాద్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో బోధన్‌ నుంచి కామారెడ్డి వెళ్లే ప్యాసింజర్‌లో కరెంగ శ్రీను (20) అనే వ్యక్తికి సంబంధించిన బ్యాగు, 77 గ్రాముల బంగారాన్ని చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు సోమవారం దొంగను స్థానిక నిజామాబాద్‌ రైల్వే పోలీసుస్టేషన్‌లో జిఆర్‌పి ఎస్‌ఐ సాయినాథ్‌ వారి బృందంతో చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్దనుంచి 77 గ్రాముల బంగారం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం రిమాండ్‌ కుతరలించామన్నారు.

Read More »

ప్రైవేటు కోచింగ్‌సెంటర్లలో ప్రభుత్వ ఉపాధ్యాయులు

ఆర్మూర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధనార్జనే ధ్యేయంగా లాభార్జనే లక్ష్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే నిరుద్యోగుల ఆశలను ఆసరా చేసుకున్న కొంతమంది కార్పొరేట్‌ విద్యాసంస్థల యజమానులు కోచింగ్‌ సెంటర్ల పేరుతో నిరుద్యోగుల వద్దనుంచి వేలకు వేల ఫీజులు దండుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందించే జీతాలు తీసుకుంటూ అటు పాఠశాలల్లో,ఇటు కోచింగ్‌సెంటర్లలో విద్యను బోధిస్తూ ఉపాధ్యాయులు డబ్బులు దండుకుంటున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్య బోధన అని ప్రకటనలు చేసుకుంటూ నిరుద్యోగుల ఆశలను బలపరుస్తున్న ప్రైవేటు ...

Read More »

టిఎంయులో చేరిన ఎన్‌ఎంయు నాయకులు

ఆర్మూర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ను బలపరచడానికి ఎన్‌ఎంయు కార్యదర్శి పడిగెల గంగాధర్‌ సోమవారం పట్టణంలోని ఆర్టీసి డిపోలో టిఎంయులో 70 మంది అనుచరులతో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో టిఎంయును బలపరచడానికే చేరినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆర్టీసి ని విభజించకపోవడం, కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం, కార్మికులకు పిఆర్‌సి వేతనాలు పెంచకపోవడం లాంటి సమస్యలపై కార్మికులందరితో ...

Read More »

డ్రైవర్‌లు జర భద్రం

నిజామాబాద్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోల్లో అనుమతించవద్దని డ్రైవర్ల పక్కన ఏ ప్రయాణీకున్ని ఎక్కించుకోకూడదని జాతీయ రహదారిపై ఆటోలు నడపవద్దని, వాహనాలను రోడ్డుపై అడ్డంగా నిలపరాదని ప్రయాణీకుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేయకూడదని, డ్రైవర్‌ సీటు పక్కన అదనపు సీట్లు ఏర్పాటు చేయవద్దని, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ అతి వేగంగా వాహనాన్ని ప్రమాదకరంగా నడిపి ప్రయాణీకుల ప్రాణాలు తీయకూడదని, విద్యార్థుల బ్యాగులను, టిపిన్‌ బాక్సులను ఆటోల బయట వేలాడదీయవద్దని నిజామాబాద్‌ ఉప రవాణా కమీషనర్‌ ...

Read More »

24 వ డివిజన్‌లో మునిసిపల్‌ కమీషనర్‌ తనిఖీలు

నిజామాబాద్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ : సోమవారం ఉదయం 6 గంటలకు 24వ డివిజన్‌లో మునిసిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వర్లు తన బృందంతో కలిసి విస్తృతంగా పర్యటించారు. అడుగడుగునా సమస్యలను కళ్ళారా చూశారు. మురికి కాల్వల అపరిశుభ్రతపై అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా అభివృద్దికి మాత్రం ఆమడ దూరంలో ఉన్న పరిస్తితులను చూసి అవాక్కయ్యారు. బ్రహ్మపురి కాలనీలోని పరిస్థితులను, సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా స్థానికులు కమీషనర్‌ వద్దకు వచ్చి సమస్యలపై తమ మొర పెట్టుకున్నారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ ...

Read More »

పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభం

కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 31వ వార్డులో సోమవారం పలు అభివృద్ధి పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్‌జిఎఫ్‌ నిధులు రూ. 2 లక్షలతో సిసి డ్రైన్‌ పనులు చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రగతిపనులు చేపడుతున్నామని, విడతల వారిగా అన్ని వార్డుల్లో సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రజలు కౌన్సిలర్ల భాగస్వామ్యంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ మసూద్‌ అలీ, ...

Read More »

ప్రజావాణిలో ఆరు ఫిర్యాదులు

కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆరుఫిర్యాదులు అందినట్టు కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌ తెలిపారు. అటవీశాఖ అధికారులు తమకు కేటాయించిన అసైన్డ్‌ భూముల్లో వారి హద్దురాళ్లను పాతుతున్నారని రైతులు ఆర్డీవోకు విన్నవించారు. అటవీ శాఖాధికారులు సక్రమంగా సర్వే నిర్వహించి తమ భూముల్లో కాకుండా వారి భూముల్లో హద్దులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు. వీరితోపాటు పింఛన్లు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్టు ఆర్డీవో వివరించారు.

Read More »

చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలి

కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాయత్రీ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు బకాయి పడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని చెరకు ఉత్పత్తి దారుల సంఘం జిల్లా నాయకుడు, మాజీ జడ్పి ఛైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్‌ 1న సదాశివనగర్‌ మండలం మల్లన్నగుట్ట వద్ద చెరుకు రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదే సమావేశంలో చెరుకు రైతుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని చెప్పారు. చెరుకు రైతుల సమస్యలు ...

Read More »

హత్య కేసు మిస్టరీని చేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్టు, రిమాండ్‌

కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం పద్మాజివాడ ఎక్స్‌రోడ్డు వద్ద ఈనెల13న జరిగిన హత్యకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చేదించారు. కేసు వివరాలను కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు సోమవారం వెల్లడించారు. నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. సిఐ కథనం ప్రకారం… ఈనెల 13న సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృత దేహాన్ని కనుగొన్నామన్నారు. ఎవరో తలపై రాతితోబాది చంపి పడేసినట్టు తెలిపారు. అప్పుడు ఆ కేసును గుర్తు తెలియని వ్యక్తి మృతిగా ...

Read More »