Breaking News

Monthly Archives: April 2015

మాలల మహాగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో మే 10వ తేదీన నిర్వహించనున్న మాలల మహాగర్జనకు సంబంధించిన గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాల, మాల అనుబంధ సంఘాల సమాఖ్య జిల్లా కన్వీనర్‌ అంబం సంజీవ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి మాల, మాల అనుబంధ, ఉపకులాలకు సంబంధించిన వారు పోరాడారన్నారు. మంత్రి పదవులు ఇవ్వడంలోనూ, నామినేటెడ్‌ పదవుల కేటాయింపుల్లోనూ ప్రభుత్వం మాలలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మాలలను ...

Read More »

ఆటో డ్రైవర్ల నిరసన ప్రదర్శన

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్‌ ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం కామారెడ్డిలో ఆటోడ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు జిల్లా కోశాదికారి కట్ల భూమన్న మాట్లాడుతూ రోడ్డు ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం బిల్లును వ్యతిరేకించాలని కోరారు. దీని కారణంగా ఆటో, డిసిఎం, ట్రాలీ, లారీ, తదితర ట్రాన్స్‌పోర్టు రంగ వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి – మాజీ మునిసిపల్‌ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేసేందుకు వైశ్య సంఘం ప్రతినిధులు తనకు అవకాశం కల్పించాలని మాజీ మునిసిపల్‌ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రామాంజనేయస్వామి దేవాలయంలో గురువారం పట్టణంలోని ఆర్యవైశ్య ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తాను పోటీ చేస్తున్నానని, ఆర్యవైశ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా తనను గెలిపించాలని కోరారు. పట్టణంలోని 33 కాలనీల్లోని ఆర్యవైశ్య సంఘాల ...

Read More »

మహిళలకు మంత్రివర్గంలో చోటు కొరకు మరో ఉద్యమం – మాదిగ యువసేన జిల్లా కన్వీనర్‌ మైలారం బాలు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అసెంబ్లీలో తీర్మానం చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ అంశంపై మరింత ముందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి చట్టబద్దత కల్పించాలని ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా వర్గీకరణపై మాట్లాడకుండా ముందుకు వెళ్లకుండా మౌనం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాదిగలను మోసం చేయాలని చూస్తున్నాడని, అలా చేస్తే మాదిగల ఆగ్రహానికి కేసీఆర్‌ గురికాక తప్పదని మాదిగ యువసేన జిల్లా కన్వీనర్‌ మైలారం బాలు హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ వచ్చేనెల ...

Read More »

ప్రతినెల 15వ తేదీ కల్లా సరుకుల సరఫరా – ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే నెలకు సంబంధించి 5 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ షాపుల ద్వారా సరుకులు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 1వ తేదీ వరకు డీలర్ల నుంచి సరుకులు సరఫరాకు సంబంధించి డిడిలు పొంది 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా బియ్యం, చక్కర, తదితర ...

Read More »

హిందూ శ్మశాన వాటికల సంఘం అధ్యక్షునిగా రాంచంద్రారెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి హిందూ శ్మశానవాటికల సంఘం అద్యక్షునిగా ప్రముఖ న్యాయవాది రాంచంద్రారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు లాభిశెట్టి లక్ష్మయ్య గుప్త అనారోగ్యం కారణంగా అధ్యక్ష బాధ్యతలను రాంచంద్రారెడ్డికి అప్పగించారు. ఇప్పటినుంచి హిందూ శ్మశాన వాటికల సంఘం అభివృద్ది బాధ్యతలను రాంచంద్రారెడ్డి తీసుకుంటారని పేర్కొన్నారు. రాంచంద్రారెడ్డికి అన్ని వర్గాల ప్రజలు సహకరించి శ్మశాన వాటికల్లో సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు.

Read More »

మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో వైస్‌ఛాన్స్‌లర్లను నియమించాలని డిమాండ్‌ చేస్తూ కామరెడ్డిలో గురువారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భాను ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో వైస్‌ఛాన్స్‌లర్లను ఇంతవరకు నియమించలేదని, ఈ కారణంగా విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న తెరాస విసిలను నియమించకపోవడం గర్హణీయమన్నారు. వెంటనే విసిలను నియమించాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

పట్టణాభివృద్దికి మరింత కృషి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాభివృద్దికి మరింత కృషి చేస్తామని ఇందుకోసం పాలకవర్గమంతా కలిసి పనిచేస్తామని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. గురువారం పట్టణంలోని 22వ వార్డులో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులను ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్‌ మాజీద్‌, ఎడి గంగాదర్‌, ...

Read More »

ఆర్టీసి డిపో ఎదుట కార్మికుల ధర్నా

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం జారీచేసిన రోడ్డు సేప్టీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట కార్మికులు దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన రోడ్డు సేప్టీ బిల్లు కారణంగా డ్రైవర్లు, ద్విచక్ర, హెవీ వాహనదారులు, యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ...

Read More »

క్యాంపస్‌ సుందరీకరణకు బృందాన్ని పంపిన ఎంపీ కవిత

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌కు బ్యూటిఫికేషన్‌ చేయడానికి సర్వే కోసం ఎంపీ కల్వకుంట్ల ఒక బృందాన్ని గురువారం క్యాంపస్‌కు పంపారు. ఎంపీ కవిత పంపిన బృందానికి రవికాంత్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఆయనతో పాటు కరుణాకర్‌రెడ్డి, ఎస్‌ఎం వర్మలు ఈ బృందంలో ఉన్నారు. ఆర్కిటెక్చర్‌, ల్యాండ్‌ స్కేప్‌ డిజైనింగ్‌లో అపార అనుభవం ఉన్న ఈ బృంద సభ్యులు క్యాంపస్‌లోని ప్రతి కళాశాలను, ఇతర భవనాలను మొత్తం భూమిని పరిశీలించారు. అవసరమైన చోట చిత్రాలను తీసుకున్నారు. బ్లూ ...

Read More »

నేడు పెద్దమ్మతల్లి 9వ వార్షికోత్సవం

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ముదిరాజ్‌ కులస్తుల ఆధ్వర్యంలో మే1న 9వ వార్షికోత్సవాన్ని ముదిరాజ్‌ కుల దేవత పెద్దమ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కన్వీనర్లు చిన్న సాయిలు, గంగారాం, శ్యాంసుందర్‌లు తెలిపారు. అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలను మే 1 నుంచి 3 వరకు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 1న శుక్రవారం నాడు ఆలయంలో పందిరి వేసి అమ్మవారికి నిత్యపూజా నివేదన హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, 2న పుణ్యహవచనం, అమ్మవారికి పంచామృత ...

Read More »

క్యాంపస్‌లో వైపై జోన్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులతో చర్చలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరంతర ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు వైపై సౌకర్యం కల్పించడానికి ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టి సారించిన నేపథ్యంలో రిజిస్ట్రార్‌ లింబాద్రి బీఎస్‌ఎన్‌ఎల్‌ సీనియర్‌ అధికారులతో చర్చలు జరిపారు. గురువారం నాడు బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌ డివిజనల్‌ ఇంజినీర్లు కె. శ్రీనివాస్‌, మహ్మద్‌ అబ్దుల్‌ ఖాలేద్‌లు రిజిస్ట్రార్‌ చాంబర్‌లో వర్సిటీ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బైసర్‌ మహ్మద్‌ ఇతర ఆచార్యులతో చర్చలు జరిపారు. వర్సిటీలో ప్రస్తుతం ఎన్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి సంయుక్తంగా ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీకి త్వరలో మాస్టర్‌ ప్లాన్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ 570 ఎకరాలపై స్థలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు వర్సిటీ యంత్రాంగం పనులు మొదలుపెట్టింది. ప్రఖ్యాత జెఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విశ్వవిద్యాలయం నిపుణుల బృందం ఇటీవల క్యాంపస్‌లోని సువిశాల స్థలాన్ని మొత్తం పరిశీలించింది. ఈ బృందానికి ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ నాయకత్వం వహించారు. వర్సిటీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎక్కడ కళాశాలల నిర్మించాలి, గెస్ట్‌హౌస్‌, ఫాకల్టీ హౌసింగ్‌, హెల్త్‌ సెంటర్‌, హాస్టల్‌ ...

Read More »

పొంచిఉన్న మరో ‘భారీ’ భూకంపం

-నేపాల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ తీవ్రత న్యూఢిల్లీ: నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రపంచాన్ని కదిలించింది. ఇప్పుడు నేపాల్లో వచ్చిన భూకంపై తీవ్రత 7.9గా ఉంది. త్వరలో మరో భారీ భూకంపం వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018కి అటు ఇటుగా ఈ భారీ భూకంపం ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ భూకంపం కూడా సెంట్రల్ హిమాలయాల్లో ఉండవచ్చునని చెబుతున్నారు. తదుపరి ఆ భారీ భూకంపం హిమాలయాల్లోనే ఉండవచ్చునని, దాని ప్రభావం బాగా ఉంటుందని చెబుతున్నారు. నేపాల్లో వచ్చిన భూకంపం తీవ్రత 7.9గా ఉందని, తదుపరి ...

Read More »

వినియోగదారులపై అకాల వర్షాల ప్రభావం

  బాన్సువాడ, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్ళు చల్లగా వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. అకాల వర్షాల దెబ్బతో కూరగాయల పంటలక తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడులు తగ్గిపోయి మార్కెట్‌లో కొరత ఏర్పడింది. వినియోగదారులనుంచి కొనుగోలు పెరగడంతో సరిపడా మార్కెట్లో కూరగాయలు అందుబాటులో లేకుండాపోయాయి. ముఖ్యంగా స్తానికంగా సాగయ్యే ఆకుకూరలు, తీగజాతి కూరలు, ఉల్లిగడ్డలు అకాల వర్షాలకు తీవ్ర నష్టం కలిగింది. దీంతో దిగుబడి తగ్గిపోయి మార్కెట్లో కొరత ఏర్పడింది. ఇటీవల వరకు ...

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో విజయ్‌ జూనియర్‌ కళాశాల జయకేతనం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విజయ్‌జూనియర్‌ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేసినట్టు కరస్పాండెంట్‌ ప్రజ్ఞా గంగామోహన్‌ తెలిపారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాదించినట్టు ఆయన చెప్పారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఆర్మూర్‌ డివిజన్‌ 2వ ర్యాంకు సాధించినట్టు ఆయన చెప్పారు. ఎంపిసిలో డి.శుభశ్రీ 978, ఎన్‌.సుష్మ-950, బైపిసిలో వినీల-935, సిఇసిలో వంశీకృష్ణ-919 మార్కులు సాదించినట్టు ఆయన వివరించారు.

Read More »

వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌, పిప్రి, ఆలూర్‌, ఆర్మూర్‌ పట్టణంలోని ఒడ్డెర కాలనీలోగల పాఠశాలల్లో వెనక బడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసవి శిక్షణ తరగతులు సర్పంచ్‌లు బండ లక్ష్మణ్‌, విజయలక్ష్మి, కళాశ్రీ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. పెర్కిట్‌ శిక్షణ తరగతులను ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఇవో రాజగంగారాం మాట్లాడారు. ఇందులో 1వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న వెనకబడిన విద్యార్తులు హాజరవుతున్నారని, ఈ తరగతులు ...

Read More »

చైన్‌స్నాచర్ల విజృంభణ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో చైన్‌ స్నాచర్లు విజృంభిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసుకొని వారి ప్రతాపాన్ని చూపుతున్నారు. దీంతో మహిళలు ఒంటరిగా రోడ్లపై తిరగాలంటే జంకుతున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆర్మూర్‌ పట్టణంలోని యోగేశ్వర్‌ కాలనీలో కట్కం అరుంధతి అనే మహిళ వద్ద నుంచి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయినట్టు బాధితురాలు ...

Read More »

యానంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలో రైతు సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ దాసరి ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించటానికే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విండో చైర్మన్‌ గజవాడ జైపాల్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, దాసరి లక్ష్మీనర్సయ్య, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read More »

టీఎన్‌వీఎస్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌కు వినతిపత్రం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలను పరిష్కరించాలని వచ్చే విద్యాసంవత్సరానికి కల్లా నూతన బాలుర హాస్టల్‌ భవనాన్ని నిర్మించాలంటు తెయూ రిజిస్ట్రార్‌ లింబాద్రికి టీఎన్‌వీఎస్‌ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం నాడు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోర్సులు పెరిగిన దృష్ట్యా హాస్టల్‌ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా చూడాలని అన్నారు. పీజీ ప్రవేశ పరీక్ష ఎంట్రన్స్‌ టెస్ట్‌ కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేస్తే వెనుకబడిన నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల విద్యార్థులకు సౌకర్యంగా ...

Read More »