Breaking News

Daily Archives: April 1, 2015

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవికుమార్‌ అనే యువకుడు గత నెల 27వ తేదీన ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామంలో లోబిపి కారణంగా కిందపడినట్టు, దీంతో అతన్ని స్థానికలు హైదరాబాద్‌లోని గాంధీఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడచికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.

Read More »

పోరాటాలతోనే బీడీ కార్మికుల జీవనభృతి సాధన

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీడీ కార్మికులందరికి బతుకు దెరువు కోసం నెలకు వెయ్యి రూపాయల జీవన బృతి ఇస్తానని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకపోవడంతో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆద్వర్యంలో జిల్లాలోని గ్రామస్థాయి నుంచి మండల స్థాయిలో ఎంపిడివో, తహసీల్‌ కార్యాలయాల ముందు అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందని యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్‌ 18న ...

Read More »

మద్యం మత్తులో వ్యక్తిపై హోంగార్డు దాడి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఎడపల్లి పోలీసు స్టేషన్లో విదులు నిర్వహించే ధన్‌సింగ్‌ అనే హోంగార్డు కేతావత్‌ సంతోష్‌ (27) అనే వ్యక్తిపై దాడి చేసి అక్రమంగా రూ. 10 వేలతో పాటు తన వాహనాన్ని గుంజుకున్నాడని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన స్నేహితుడు స్వామికి తనకు తెలిసిన షోరూంలో డౌన్‌ పేమెంట్‌ కట్టి వాహనాన్ని ఇప్పించానని అన్నారు. 29.03.2015 నాడు తన అత్తగారి ఊరైన ఒడ్యాట్‌పల్లి ...

Read More »

ఇంకెన్ని ముట్టడిస్తారు ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయాన్ని పింఛన్‌ కోసం ఎన్నిసార్లు ముట్టడిస్తారని బీడీ కార్మికులకు అన్నారు. ఇప్పటికే మండలంలోని అన్ని గ్రామాలు పింఛన్ల కోసం మండల పరిషత్‌ కార్యాలయాన్ని గతంలో ముట్టడించడం జరిగిందని వినతిపత్రాలను అందజేశారన్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులందరికి జీవన భృతి ఇచ్చే వరకు ముట్టడిస్తామని కార్మికులు హెచ్చరించారు. మండల పరిషత్‌ కార్యాలయాన్ని తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు ముట్టడించడం వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి మరోసారి 1.2 లక్షల మందికి జీవన భృతి ...

Read More »

ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన బీడీ కార్మికులు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయాన్ని బుధవారం బీడీ కార్మికులు ముట్టడించి అధికారులను నిలదీశారు. బీడీలు చేస్తున్న కార్మికులకు పింఛన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. సకల జనుల సమ్మెలో నమోదు చేసుకున్న ప్రతి బీడీ కార్మికురాలికి అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వారు వాపోయారు.ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌ అర్హులకు పింఛన్‌ వస్తుందని బీడీ కార్మికులకు నచ్చజెప్పారు. కార్మికులు విన్నకుండా కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిట్టాపల్లి గ్రామ సర్పంచ్‌ ...

Read More »

కొత్త కార్లు వస్తున్నాయోచ్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగాగల కలెక్టర్లు, జేసిలకు నూతన వాహనాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఫార్చునర్‌ కార్లను మంజూరు చేసేందుకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటివిడతగా రూ. 5 కోట్ల 20 లక్షల నిధులను మంజూరు చేసి ప్రస్తుతం వీరు వినియోగిస్తున్న టాటా వాహనాల స్థానంలో త్వరలో టొయోటా ఫార్చునర్‌ కార్లు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా అధికారుల హోదాకు తగిన రీతిలో వాహనాలను కేటాయించే క్రమంలో ప్రభుత్వం ...

Read More »

గుట్టుగా సాగుతున్న గుట్కా వ్యాపారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని నూతన, పాత బస్టాండ్‌, పలు ప్రాంతాల్లో గుట్టుగా గుట్కావ్యాపారం జరుగుతుంది. ముడుపుల మత్తులో మునుగుతున్న సంబంధిత అధికారులు రాజకీయ నాయకలు, అధికారుల అండదండలతో యథేచ్చగా గుట్టుగా గుట్కా వ్యాపారం. నిజామాబాద్‌ జల్లా వ్యాప్తంగా రోజురోజుకు గుట్కా దందా గుట్టుగా సాగుతుంది. ఈ విషయమై సంబంధిత అధికారులు గుట్కా వ్యాపారులు ఇచ్చే ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారు. ఈ దందా విషయం సంబంధిత అధికారుల దృస్టికి వచ్చినా అంటి అంటనట్టుగా వ్యవహరిస్తున్నారు. అదికార ...

Read More »

అధికార పార్టీ అండదండలతో దర్జాగా దందా – అక్రమ మట్టి తవ్వకాలకు ఇష్టానుసారంగా అనుమతులిస్తున్న అధికారులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మండల పరిధిలో గల చెరువులు, కాలువల నుంచి అడ్డగోలుగా పూడిక మట్టిని తరలిస్తున్నారు. దీనివల్ల కోట్ల రూపాయలతో వారి జేబులు కాంట్ట్రార్లు నింపుకుంటున్నారు. ప్రతిరోజు సుమారు వంద లారీల్లో అక్రమంగా మట్టిని అధికార పార్టీ నేతల అండదండలతో తరలిస్తున్నారు. దర్జాగా మమ్ములను ఎవ్వరేం చేయలేరని, అటువైపునకు ఎవరైనా వెళితే ఎంతటి వారిపై దాడులకు వెనుకాడడం లేదు. ”మిషన కాకతీయ” పనుల పేరిట అధికార పార్టీల నేతల అండదండలతో ప్రతిరోజు వందల వాహనాల్లో ...

Read More »