Daily Archives: April 4, 2015

నగరంలో 30 యాక్టు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో హనుమన్‌ జయంతిని పురస్కరించుకొని శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు 30 యాక్టు అమల్లో ఉంటుందని నిజామాబాద్‌ డిఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. నగరంలో వివిధ యువజన సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ర్యాలీలు, శోభాయాత్రలు, ధ్వజ యాత్రలు నిర్వహిస్తున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయసంఘటనలు, అల్లర్లకు తావులేకుండా సహకరించాలని పేర్కొన్నారు. అలాగే పోలీసువారి అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని ...

Read More »

గుర్తు తెలియని మహిళ శవం లభ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని తహసీల్‌ కార్యాలయం సమీపంలో శనివారం గుర్తు తెలియని మహిళా శవాన్ని కనుగొన్నట్టు పట్టణ ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. మృతురాలికి 40 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచుతామని, ఎవరైనా సంబంధీకులు వస్తే అందజేస్తామన్నారు.

Read More »

గులాబీ కండువా వేసుకున్న పట్వారీ డిసిసిబి ఛైర్మన్‌ కారెక్కారు

నిజామాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ గంగాధర్‌ పట్వారీ ఎట్టకేలకు కారెక్కారు. సిఎం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కెటిఆర్‌, విప్‌ గంపగోవర్థన్‌, బోధన్‌ ఎమ్మెల్యే షకిల్‌ సమక్షంలో పార్టీలో చేరారు. తెర వెనక కెటిఆర్‌, గంప గోవర్థన్‌లు కీలకంగా వ్యవహారించినట్లు తెలస్తుంది. డిసిసిబి ఛైర్మన్‌ పదవి కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన పట్వారీకి ఈసారి అవకాశం దక్కింది. అయితే టిఆర్‌ఎస్‌ హవాతో కాంగ్రెస్‌ ...

Read More »

అర్హులైన అందరికి జీవన భృతి ఇప్పించాలి

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలంలోని ముచ్కూరు గ్రామంలో అర్హులైన బీడీ కార్మికులందరికి జీవన భృతి వర్తింపజేయాలని టిఆర్‌ఎస్‌వి గ్రామ శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాస్‌, రైతు విభాగం అధ్యక్షులు గిరి, అంజయ్యలు శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఈవోపిఆర్‌డి శేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ముచ్కూరు గ్రామంలో గత రెండ్రోజలు క్రితం జీవనభృతి పింఛన్లు రాలేదని సర్పంచ్‌ తులసీగౌడ్‌ దృష్టికి రావడంతో బండి శ్రీనివాస్‌ జోక్యం చేసుకొని గ్రామంలో బీడీ పింఛన్లు రాని ...

Read More »

జిల్లాలో 276 వరి కొనుగోలు కేంద్రాలు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ రబీలో వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 276 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో రైస్‌మిల్లర్లు, పౌర సరఫరా లశాఖ అధికారులతో రబీ ధాన్యం కొనుగోలుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 230, ఐకెపి ద్వారా 44, మెప్మా ఆధ్వర్యంల రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుల డిమాండ్‌మేరకు అవసరాన్ని బట్టి ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికుల ధర్నా

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శనివారం కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆద్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలు చెల్లించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించినప్పటికి ఎలాగో అలా జీవితాలు వెళ్లదీస్తూ వెట్టిచాకిరి చేస్తున్నామని పేర్కొన్నారు. తమచేత పని చేయించుకుంటున్న ప్రభుత్వం వైద్యశాఖ వెంటనే తమ పట్ల స్పందించి తమకు రావాల్సిన ...

Read More »

కామారెడ్డిలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

– పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం హనుమాన్‌ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యువకులు విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ నాయకులు వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని విహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌ ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ...

Read More »

చంద్రగ్రహణం కారణంగా ఆలయాల మూసివేత

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చంద్రగ్రహణం కావడంతో హనుమాన్‌ జయంతి వేడుకలు మధ్యాహ్నంతోనే ముగిశాయి. చంద్రగ్రహణం వల్ల వివిధ ఆలయాలన్ని రాత్రి 8.30 గంటలకు శుద్దిచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆయా ఆలయ పూజారులు పేర్కొన్నారు. అలాగే హనుమాన్‌ భక్తులు గత 41 రోజులుగా మాల ధారణ చేశారు. హనుమాన్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాలలు విరమించారు. హనుమాన్‌ భక్తులు కాలినడకన శనివారం కొండగట్టు పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు.

Read More »

పవనసుత హనుమాన్‌కీ జై ఘనంగా హనుమాన్‌ జయంతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని హనుమాన్‌ ఆలయాలన్ని హనుమాన్‌ నామస్మరణతో మారుమోగాయి. ఉదయం నుంచే భక్తులు హనుమాన్‌ ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్దలతో హనుమాన్‌ స్వామిని ఆరాధించారు. వివిధ ఆలయాల వద్ద వేదపండితులు హోమం, కుంకుమార్చన, అన్నదానం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని జంబి హనుమాన్‌ ఆలయం, సిద్దులగుట్ట హనుమాన్‌ మందిరంలో, దార్ల హనుమాన్‌, దోబిఘాట్‌ హనుమాన్‌ ఆయలంలో భక్తులు కిక్కిరిసిపోయారు. చంద్రగ్రహణం కావడంతో ఉదయం 5 గంటల నుంచే ఆలయాలన్ని ...

Read More »

3వ వార్డులో జీవనభృతి పంపిణీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని స్థానిక 3వ వార్డు హౌజింగ్‌ బోర్డు కాలనీలో శనివారం తెరాస నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మోత్కురి లింగాగౌడ్‌లు బీడీ కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న రూ. వెయ్యి జీవనభృతిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు పోకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ...

Read More »

టిటిడిసిలో స్వచ్ఛభారత్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిటిడిసి శిక్షణ కేంద్రంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కంప్యూటర్‌ శిక్షణకు హాజరైన నిరుద్యోగులు శిక్షణ ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. గతంలో శిక్షణ కోసం వచ్చిన మహిళా సంఘాలు కూడా ఇక్కడ స్వచ్ఛభారత్‌ నిర్వహించారు.

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుని మృతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన మోహన్‌ (35) మృతి చెందినట్టు ఎస్‌ఐ ముజుబూర్‌ రహమాన్‌ తెలిపారు. మృతుడు మోహన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మోహన్‌ ద్విచక్రవాహనంపై వెళుతుండగా జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో మోహన్‌ అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ...

Read More »

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలోని చిన్న హనుమాన్‌ దేవాలయంలో హనుమాన్‌ జన్మదిన వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విరివిగా గ్రామాల నుంచి బక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖిల్లా డిచ్‌పల్లి గ్రామ శివారులోగల బాల ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ మాల ధారులు బాల హనుమాన్‌ ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రగ్రహణం ఉన్నందున పూజాది కార్యక్రమాలతో పాటు, అన్నదానం కూడా ముగించేశారు. ...

Read More »