Breaking News

Daily Archives: April 5, 2015

7వ బెటాలియన్‌లో బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 7వ బెటాలియన్‌ డిచ్‌పల్లి లో బాబుజగ్జీవన్‌ రాం 108వ జయంతి ఉత్సవాలను ఆదివారం కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత వర్గాల పెన్నిధి, పరిపాలనాదక్షుడు, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి, క్విట్‌ ఇండియా ఉద్యమం విజయవంతం చేయడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని కొనియాడారు. పేదవాడి కన్నీటిని తుడిచిన జగ్జీవన్‌రాం ఈరోజే కాదు ...

Read More »

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు సన్మానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ను కామారెడ్డి ఆర్యక్షత్రియ సంఘం ప్రతినిదులు సన్మానించారు. ఎమ్మెల్యే స్థాయినుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రభుత్వ విప్‌ స్థాయికి చేరుకున్న గంప గోవర్దన్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. సన్మానించిన వారిలో సంఘం ప్రతినిధులు నిట్టు విఠల్‌రావు, నిట్టువేణుగోపాల్‌రావు, బలవంతరావు, రాజగంభీర్‌రావు, బాపురావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కాల్పుల ఘటనలో పోలీసులు కోలుకోవాలని పూజలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల ఘటనలో గాయాలపాలై చికిత్స పొందుతున్న పోలీసులు వెంటనే కోలుకోవాలని పట్టణంలోని కోడూరి వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు పుల్లూరి సతీష్‌ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు వదిలిన పోలీసుల త్యాగాలను కొనియాడారు. మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారుత్వరగా కోలుకోవాలని అభిప్రాయపడ్డారు.

Read More »

ఘనంగా జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలను వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ జగ్జీవన్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. టిడిపి కార్యాలయంలో నాయకులు చీల ప్రభాకర్‌, నజీరోద్దీన్‌, రాజమౌళిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆనంద్‌, నర్సింలు, ఎం.జి.వేణుగోపాల్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

చెరువులో పడి గొర్లకాపరి మృతి

రెంజల్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన చిలుకూరి మల్లేశ్‌ (30) అనే వ్యక్తి రోజు మాదిరిగానే ఉదయం గొర్లుకాయడానికి వెళ్లి మంద ఒక్కసారిగా చెరువులోకి వెళ్లడంతో వాటిని బయటికి తెచ్చే ప్రయత్నం చేయగా కాలుజారి చెరువులో పడ్డాడు. దీంతో ఈత రాక అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్‌ఐ చామంతుల టాటాబాబు తెలిపారు. మృతుడి పెదనాన్న పుల్లల సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. మృతుడికి భార్య రాద, ఇద్దరు ...

Read More »

అడుగడుతున్న భూగర్భ జలాలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. గత పక్షంరోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటుతుండడంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భూగర్భజలాల అదారంగా పంటలు సాగుచేసే రైతులు బోరుబావులు వట్టిపోతుండడంతో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వీటి ఆధారంగా పంటలు సాగుచేయడంతో నీరందక ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. ఈయేడు వర్షాలు లేక నీటి వనరులు ఎండిపోవడంతో ముందుగానే భూగర్బజలాలు పాతాళానికి దిగజారాయి. బోధన్‌ డివిజన్‌లో మద్నూర్‌, బిచ్కుంద, నిజాంసాగర్‌, పిట్లం ...

Read More »

ఘనంగా జగ్జీవన్‌రాం జయంతి – మహనీయుల అడుగుజాడల్లో నడవాలి : కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజం మహనీయుల జీవితాల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ తెలిపారు. భారతదేశ మాజీ ప్రధాని బాబు జగ్జీవన్‌రాం 108వ జయంతి సందర్భంగా స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అద్యక్షత వహించిన కలెక్టర్‌ మాట్లాడారు. దళితులకు ఏ సదుపాయాలు, గౌరవ, మర్యాదలు లేని కాలంలో ఎంతో కష్టపడి జగ్జీవన్‌రాం ఉన్నత శిఖరాలకు ఎదిగారన్నారు. స్వాతంత్య్ర ...

Read More »

నీటి కష్టాలు తీర్చండి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవికి ముందే నీటి ఎద్దడి తీవ్రతరమైంది. గత వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు ఇంకిపోవడంతో బోర్లలో నీరు రాక తాగడానికి నీరులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్పందించాల్సిన మునిసిపల్‌పాలకవర్గం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాజారాం నగర్‌ కాలనీ వాసులు మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు ఇంటి వద్దకెళ్లి నీటి ఎద్దడి విషయాన్ని వివరించారు. దీంతో ఛైర్మన్‌ ...

Read More »