Breaking News

Daily Archives: April 6, 2015

కొత్త పరిశ్రమల అనుమతులపై కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొత్త పరిశ్రమలకు సంబందించి వివిధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలు, ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి పరిశ్రమలు తదితర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ సోమవారం కార్యాలయ చాంబర్‌లో ప్రగతిని సమీక్షించారు. కేటాయించిన కాలపరిమితిలోపు చర్యలు తీసుకొని సంబంధిత శాఖ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా సమావేశంలో ఆరు యూనిట్లకు సంబందించి జిల్లా ట్రాన్స్‌కో జిల్లా పరిశ్రమలు, ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్‌, డిపివో, తదితర శాఖల అధికారులతో పెండింగ్‌ పనులపై ...

Read More »

దొంగ అరెస్టు – బైక్‌ స్వాధీనం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ గ్రామానికి చెందిన తాళ్ల చిన్నయ్య అలియాస్‌ ప్రవీణ్‌ బైక్‌ దొంగతనం కేసులో సోమవారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… బల్కొండ పోచమ్మ గల్లికి చెందిన ప్రవీణ్‌ గతనెల 24వ తేదీన దేగాం గ్రామానికి చెందిన చిన్న ముత్తన్న హీరో గ్లామర్‌ టిఎస్‌ 16 ఇడి 0541 నెంబరు గల వాహనాన్ని దొంగిలించినట్టు తెలిపారు.కాగా బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ...

Read More »

సిసి డ్రైన్‌ పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 1వ వార్డులో సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి డ్రైన్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో సిసి డ్రైన్‌ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే 1వ వార్డుకు సైతం నిదులు కేటాయించామన్నారు. అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కాళ్ళ గణేశ్‌, నాయకులు రాంకుమార్‌గౌడ్‌, తదితరులు ...

Read More »

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ బిజెపి కార్యాలయం వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ సిద్దిరాములు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బిజెపిని స్థాపించి నేటికి 35 సంవత్సరాలు అవుతోందని తెలిపారు. ఈకాలంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడి మూడుసార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. పీడిత పాలననుంచి ప్రజలను విముక్తులను ...

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 11వవార్డులో సుభాష్‌ రోడ్డులో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అంబలి కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. వినాయక్‌నగర్‌ ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలం ప్రజల దాహార్తి తీర్చేందుకు అంబలి కేంద్రాలు, చలి వేంద్రాలు ఉపయుక్తంగాఉంటాయని అన్నారు. అంబలి కేంద్రాలు, చలి వేంద్రాలను దాతలు ముందుకు వచ్చి ఏర్పాటు చేయాలని సూచించారు. సంఘం ప్రతినిధులు దిగంబర్‌, చంద్రశేఖర్‌, ఆంజనేయులు, రమేశ్‌, ...

Read More »

పెద్దాసుపత్రిలో అరకొర సదుపాయాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల ఆరోగ్య సౌకర్యాల నిమిత్తం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడంతస్తుల మేడ కట్టించింది. కానీ దీనిలో మాత్రం అరకొర సదుపాయాలతో అక్కడికి వచ్చే రోగులు అనేక ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూపర్‌ స్పెషాలిటీలో ఉండే ప్రతి ఒక్క సదుపాయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటుందని తెలిపిన విషయం మనకు తెలిసిందే. కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్లిన రోగులు మాత్రం ...

Read More »

నేడు పబ్లిక్‌ రిలేషన్‌ సెమినార్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగ ఆధ్వర్యంలో ‘ఆధునిక డిజిటల్‌ యుగంలో ప్రజాసంబంధా’లు అన్న అంశంపై మంగళవారం ఉదయం 10 గంటలకు జాతీయ సెమినార్‌ నిర్వమిస్తున్నట్లు సెమినర్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె. రాజారాం తెలిపారు. ఈ సెమినార్‌కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గటిక విజయ్‌కుమార్‌ పాల్గొంటారని అన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు సెంట్రల్‌ యూనివర్సిటీ మౌలానా ఆజాద్‌, ఉర్దూ ...

Read More »

డిస్టెంట్స్‌ పద్దతిలో పీజీ విద్యను అందించాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులను డిస్టెంట్స్‌ పద్దతిలో ఏర్పాటు చేయాలని నిజామాబాద్‌, ఇతర జిల్లాల విద్యార్థులు టీయూ రిజిస్ట్రార్‌ లింబాద్రికి విన్నపం చేశారు. ఎమ్మెస్సీ మ్యాస్‌, ఫిజిక్స్‌, కెమెస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్‌, ఎంకాం తదితర కోర్సులను ఏర్పాటు చేయాలని పీజీ విద్యను చదవలేక ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల విద్యార్థులు చదవలేకపోతున్నారని డిస్టెంట్స్‌ పద్దతిలో వీటిని విద్యార్థులకు అందజేయాలని వారు కోరారు. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వారికి డిస్టెంట్స్‌ పద్దతిలో పీజీ విద్యను ...

Read More »

దరఖాస్తు చేసుకోవాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 2014-15 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం విద్యార్థులు రెన్యూవల్‌, నూతన విద్యార్థుల ఉపకార వేతనాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రొఫెసర్‌ కనకయ్య అన్నారు. దరఖాస్తు చేసుకున్న పత్రాలను రెండు సెట్లు కార్యాలయంలో స్కాలర్‌షిప్‌ సెక్షన్‌లో ఒకటి, ఇన్‌ఛార్జీకి ఒకటి అందజేయాలని అన్నారు. లేకుంటే దీనికి పూర్తి బాధ్యత విద్యార్థులదేనని అన్నారు. ఇప్పటి వరకు కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులు 136 మంది, రెండు, మూడు, నాలుగు, ...

Read More »

మనుషుల అక్రమ రవాణాపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలమందిని లైంగిక వ్యాపారానికి అక్రమంగా తరలిస్తున్నారని, ఇందులో ఆడవారు, మగవారు, చిన్న పిల్లలు ఉన్నారని ”ప్రజ్వల” మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది చిన్న పిల్లలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణా గత 30 సంవత్సరాల ...

Read More »

ప్రజావాణి ఫిర్యాదులకు బారులు తీరిన ప్రజలు

ఇందూరు, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వారి ఫిర్యాదులు విన్నవించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు బారులు తీరారు. ఈ మేరకు వారి సమస్యల పరిష్కారానికై కలెక్టర్‌కు వినతి పత్రం అందించేందుకు ఎదురుచూశారు. అంతేకాక ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన పింఛన్ల కౌంటర్ల వద్ద వృద్దులు, వికలాంగులు, అర్హులు ఎండలో బారులు తీరారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇకనైనా సంబంధిత అధికారులు వారి వారి గ్రామాల్లోని ప్రజలకు అక్కడే పింఛన్లు, ఆహారభద్రత ...

Read More »

ప్రజావాణి ఫిర్యాదుదారులకు నీటి వసతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా నలుమూలల నుంచి మండుతున్న ఎండల్లో వారి సమస్యలను, గోడులను విన్నవించేందుకువ వస్తున్న ప్రజలకు సోమవారం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కనీస సదుపాయం మేరకు మంచినీటి సౌకర్యాన్ని వారికి ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రజవాణికి వచ్చిన ఫిర్యాదుదారులు ఈ మంచినీటి ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ ప్రజల సమస్యలను గ్రామ గ్రామాన, అడుగడుగునా తిరుగుతూ తెలుసుకోవడం ఎంతో అభినందనీయమని ప్రజలు అంటున్నారు. ...

Read More »

చీకటి దందాలో విచ్చలవిడిగా డోమెస్టిక్‌ సిలిండర్లు

– చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు ఇందూరు, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా సిలిండర్లను అందించే దీపం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గానికి 5 వేల చొప్పున సిలిండర్లను మంజూరు చేసిన విషయం కూడా తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా మొత్తం మీదుగా 9 నియోజకవర్గాలకు కలిపి 45 వేల దీపం సిలిండర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ...

Read More »