Breaking News

Daily Archives: April 7, 2015

పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళి… పోలీసుల కాగడాల ర్యాలీ

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రీల్‌ 7: నల్గోండ జిల్లాలో కాల్పుల్లో మరణించిన పోలీసుల అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని మంగళవారం రాత్రి పోలీసులు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిజామాబాద్‌ నగరంలోని ఎ.ఆర్‌.హెడ్‌ క్వార్టరర్స్‌ వద్ద ర్యాలీని నిజామాబాద్‌ డిఎస్పీ అనిల్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల కోసం విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడు ప్రాణాలు అర్పించేందుకు సిద్దంగా ఉంటారని అన్నారు. అనంరతం ర్యాలీ ఎన్‌.టి.ఆర్‌ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ మీదుగా అమరవీరుల స్థూపం వద్దకు చెరుకున్నారు. ఈ ...

Read More »

పందికొక్కుల్లాగా అక్రమంగా చీకటి దందాలో ఐసిడిఎస్‌ బియ్యం తరలింపు

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలలు గడవక ముందే పసిపిల్లలకు ఇవ్వాల్సిన ఈ బియ్యాన్ని ఓ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఆహరభద్రత కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని కొందరు కాంట్రాక్టర్లు చీకటి దందాలో ఈ బియ్యాన్ని అక్రమంగా చీకటి దందాలో తరలిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులు సోదాలు చేసినా కేసులు నమోదు చేసినా, వారి దందాను మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా దర్జాగా సాగుతున్నాయి. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా వీరికి రాజకీయ ...

Read More »

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తాగునీటికి నోచుకోని రోగులు

ఇందూరు, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చే రోగులకు సరైన తాగునీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరమ్మతుల విషయమై ఆసుపత్రి అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇంజనీరింగ్‌ విభాగ అధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఇంజనీరింగ్‌ విభాగ ఇద్దరు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉండాలని ఆదేశించినా, వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఇంజనీర్లు. ఎండలు మండిపోతున్న తరుణంలో రోగులు, వారి సహాయకులు గుక్కెడు ...

Read More »

‘బంగారుతల్లి’కి గ్రహణం

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడపిల్లలు భారమనుకుంటున్న ఈ రోజుల్లో వారి తల్లిదండ్రులు అండగా నిలిచి, ఆడపిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే ఉద్దేశంతోఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బంగారుతల్లి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ ఈ పథకాన్ని కలగానే మారుస్తున్నారుమన నాయకులు. పథకాన్ని రాష్ట్రంలోని నిరుపేదలైన లబ్దిదారులు తమకు ఆడపిల్లలు పుట్టారని ఎలాంటి బెంగ, బాధ లేకుండా ఉండడం కోసం ప్రారంభించారు. ఈ పథకానికి అర్హులైన వారికి ...

Read More »

5 సంవత్సరాలలోపు మీ పిల్లలున్నారా, అయితే వారికి రేషన్‌ కట్‌

ఇందూరు, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డీలర్లపై అపనమ్మకంతో పిల్లల సంఖ్యలో అక్రమాలపై పలు అనుమానాలతో బియ్యంలో కోత… సర్వే చేసిన తర్వాతే పిల్లలకు బియ్యాన్ని అందిస్తామంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నూతన సంవత్సర కానుక పేరుతో ప్రారంభించిన ఆహారభద్రత పథకానికి కొర్రీలు పడుతున్నాయి. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి వయసుతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ...

Read More »

నేడు మండలానికి ఎమ్మెల్యే షకీల్‌ రాక

రెంజల్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు మండలంలోని కల్యాపూర్‌, సాటాపూర్‌, నీలా గ్రామాల్లో మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించడానికి బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ వస్తున్నట్టు రెంజల్‌ మండల తెరాస అధ్యక్షులు పాశం సాయిలు తెలిపారు. అలాగే బోర్గాం గ్రామంలో గ్రామ సర్పంచ్‌ రమేశ్‌, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరనున్నట్టు అన్నారు. అనంతరం బోర్గాంలోని పుష్కర ఘాట్‌ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

Read More »

ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లను వెంటనే తొలగించాలి

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిక్షణ పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న పలు ప్రయివేటు కోచింగ్‌సెంటర్లను ఏబివిపి ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబివిపి నగర ప్రధాన కార్యదర్శి వాసు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన ఫీజులు కాకుండా ప్రయివేటు కోచింగ్‌ సెంటర్ల పేరుతో అత్యధికంగా విద్యార్థుల అధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన శిక్షణ ఇవ్వపోవడంతో మంగళవారం నగరంలోని ఖలీల్‌వాడిలోగల ఐ5 శిక్షణ కేంద్రాన్ని తక్షణమే మూసివేయాలని, అక్కడే శిక్షణ కేంద్రం దిష్టిబొమ్మ దహనం ...

Read More »

ఇఎస్‌ఐ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులకు సరైన వైద్య సౌకర్యాలు కల్పించాలి

ఇందూరు, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇఎస్‌ఐ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు సరైన వైద్య సౌకర్యాలు, వసతులు అందించాలని నిజామాబాద్‌ నగర భారత కార్మిక సంఘాల సమాఖ్య కమిటీ అధ్యక్షులు ఎన్‌.బి.రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఇఎస్‌ఐ ఆసుపత్రి ఎదుట ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పనిచేసే వేలమంది కార్మికులు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో చేరి ఉన్నారని ఆయన అన్నారు. కానీ ఈ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు ప్రయివేటు ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాల ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్టు తెలిపారు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదమ్మ, బట్టు మోహన్‌, ఏ.ఇ. ...

Read More »

బిజెపి పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం, – బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి పాలనలో కేంద్ర ప్రబుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుందని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి అన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన మహిళా మోర్చా సభ్యత్వ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్‌, విద్య, ఉద్యోగం, ఉపాధి తదితర వసతుల కల్పనలో బిజెపి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు. మోడి ఆశయాలకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ...

Read More »

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి – మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నల్గొండ ఘటనలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు అహర్నిశలు పాటుపడుతూ తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే పోలీసుల సేవలను కొనియాడారు. తీవ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడంలో ...

Read More »

డిిసిసిబి ఛైర్మన్‌ ఇంటి ఎదుట కాంగ్రెస్‌ ధర్నా – పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌

బోధన్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణానికి చెందిన డిసిసిబి ఛైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారి ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీని వీడి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తెరాస కండువా వేసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు ఆయనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతూ పార్టీలో అత్యున్నత పదవిని అనుభవిస్తూ పార్టీ వీడడంపై నాయకులు గుస్సా అవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన నివాసం ఎదుట నాయకులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ...

Read More »

పార్టీయా… నామినేటేడా… టిఆర్‌ఎస్‌లో పదవుల ముసలం వర్గపోరుకు రంగం సిద్దం

నిజామాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 7: టిఆర్‌ఎస్‌ పార్టీలో కొత్త ముసలం ప్రారంభం కానుంది. పదవుల కోసం నువ్వా నేనా అంటున్నారు. ముందుగానే పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంతో పార్టీకి నాయకత్వంవహించేందుకు ససేమిరా అంటున్నారు. ఇక్కడ పదవులు తీసుకుంటే రేపు నామినేటేడెటన పదవుల కోసం పోటీ పడేందుకు అవకాశం కోల్పోతామని భావించి ముందుగానే పార్టీ పదవులకు దూరంగా ఉంటున్నారు. మరోపక్క ఎవరికి వారే పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసి వర్గపోరుకు సిద్దం అవుతున్నారు. దీనికి తోడు పార్టీలో కీలకంగా వ్యవహరించి, సిఎంకు సన్నిహితంగా ఉండే ...

Read More »

గ్రామాల్లో గులాబీ రెపరెపలు…. బలోపేతం వైపు టిఆర్‌ఎస్‌ అడుగులు….

గ్రామ కమిటీలు పూర్తి 16 లోపు మండల, జిల్లా కమిటీలు నిజామాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 7 : తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌) పార్టీ జిల్లాలో గ్రామాల్లో గులాబీమయం అవుతుంది. గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు పూర్తి స్తాయి చర్యలు చేపట్టింది. రాష్ట్రం ఏర్పడక ముందు జిల్లా కమిటీలకే పరిమితమైన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు బూత్‌ స్థాయిలో కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంటుంది. దీనికి తోడు అధికారంలోకి వచ్చాక మొదటిసారి పార్టీ ప్లీనరీని చారిత్రాత్మక స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అందుకు గత నెల 20 నుంచి ...

Read More »

ఎన్‌ ‘కౌంటర్‌’ ….నలుగురు పోలీసుల మృతి ….అయిదుగురి ఐఎస్‌ఐ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 7 : వరంగల్‌ జిల్లా పెంబర్తి వద్ద అయిదుగురు ఐఎస్‌ఐ తీవ్రవాదులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా దక్షిణ భారత దేశంలోనే అలర్ట్‌ మొదలైంది. నల్గోండ జిల్లా జానకీపురంలో సిమి కార్యకర్తలు పోలీసులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తనిఖీల్లోనూ కాల్పులు జరిపి నలుగురు పోలీసుల మృతికి కారణం అయ్యారు. వీరిలో ఒక్కరు ఎస్‌ఐ సిద్దయ్యచికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. జానకీపురం ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఇదే రోజు వరంగల్‌లో ఎన్‌కౌంటర్‌లో ...

Read More »