Breaking News

Daily Archives: April 8, 2015

బైక్‌ దగ్ధం

ఇందూరు, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని హమాల్‌వాడికి చెందిన నల్లూరి శ్రీకాంత్‌ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం (యమహ లిబరో)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్దం చేసినట్టు 3వ టౌన్‌ ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. ఈ మేరకు శ్రీకాంత్‌ రోజువారి లాగే రాత్రి నిదిరించే సమయంలో తన వాహనాన్ని ఆరుబయట ఉంచాడని, దీంతోగుర్తు తెలియని వ్యక్తులు కాల్చేసి ఉంటారని తెలిపారు. శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన అన్నారు. Bike ...

Read More »

ఆర్టీసి బస్సు ఢీ – మృతి చెందిన వృద్ధుడు

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని రైల్వే స్టేషన్‌ఎదుట బుధవారం ఆర్టీసి బస్సు ఢీకొని జానకంపేట గ్రామానికి చెందిన లింబాద్రి (60) అనే వృద్దుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో సమాచారం అందుకున్న 1వ టౌన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామా చేశారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్టు 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో తెలిపారు. RTC bus hits an old man limbadri aged ...

Read More »

మిషన్‌కాకతీయతో చెరువులకు పునర్‌వైభవం

– ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా తెలంగాణలోని చెరువులు, కుంటలు పునర్‌వైభవాన్ని సంతరించుకుంటాయని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఉగ్రవాయి, క్యాసంపల్లి గ్రామాల్లో మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. చిన్నమల్లారెడ్డి, లింగాయిపల్లి గ్రామాల్లో అంగన్‌వాడి భవనం, సిసిరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ...

Read More »

పోలీసుల శాంతి ర్యాలీ

రెంజల్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని రెంజల్‌ ఎస్‌ఐ చామంతుల టాటాబాబు అన్నారు. ఎస్‌ఐ సిద్దయ్య, కానిస్టేబుళ్ళు లింగన్న, మహేశ్‌, నాగరాజు మృతికి బుధవారం పోలీసుల ఆద్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. సాటాపూర్‌ చౌరస్తా నుంచి రెంజల్‌ ప్రదాన వీధుల గుండా విద్యార్థులతో కలిసి మౌనం పాటించి, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐలు మస్తాన్‌, హమీద్‌, హెడ్‌కానిస్టేబుల్‌ గంగారాం, భీమ్‌రావు, కానిస్టేబుల్‌ గంగాధర్‌, సతీష్‌, ప్రసాద్‌, ...

Read More »

చెరువుల పునరుద్దరణతోనే గ్రామాల అభివృద్ధి

రెంజల్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువుల పునరుద్దరణతో గ్రామాలు సస్యశ్యామలంగా మారినప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ అన్నారు. మండలంలోని కళ్యాపూర్‌, సాటాపూర్‌ గ్రామాల్లో మిషన్‌ కాకతీయ కింద చెరువుల పూడికతీత పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. సాటాపూర్‌ పెద్ద చెరువు అభివృద్ధికి 57 లక్షల 40 వేలు, కళ్యాపూర్‌ ఐలకుంట చెరువు అభివృద్ధికి 28 లక్షల 10 వేలతో పనులు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం ఆయన గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ...

Read More »

మంత్రిని అడ్డుకున్న కేసులో కోర్టుకు హాజరు

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 18న సదాశివనగర్‌ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అడ్డుకొని వాగ్వాదానికి దిగిన కేసులో 15 మంది సిఐటియు నాయకులు బుధవారం కామారెడ్డి కోర్టులో హాజరయ్యారు. బీడీ కార్మికుల జీవనభృతికి సంబంధించి జనవరి 18న మంత్రి పోచారంను సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయంలో సిఐటియు నాయకులకు మంత్రికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి 15 మంది నాయకులపై కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరైన నాయకులు బెయిల్‌పై బయటకు ...

Read More »

ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి

– మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతీయువకుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వినియోగించుకొని తద్వారా లబ్దిపొందాలని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డిలో మెప్మా, మునిసిపల్‌ ఆద్వర్యంలో నిరుద్యోగ మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నిరుద్యోగ యువతులు, మహిళల కోసం మెప్మా ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన ...

Read More »

పోలీసు అమర వీరులకు నివాళి – కర్షక్‌ బిఇడి కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండ ఘటనలో మృతి చెందిన పోలీసు అమరవీరులకు కామారెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు నివాళి అర్పించారు. బుధవారం కళాశాలలో పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కళాశాల నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు పోలీసులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానంహారం ఏర్పాటు చేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశంకోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రషీద్‌, ...

Read More »

17 రోజులైనా మారని అక్రమ చెరువు మట్టి రవాణా…

– ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు – చూసిచూడనట్టుగా అధికారుల తీరు ఇందూరు, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేశాపూర్‌ గ్రామ చెరువు నుంచి మట్టిని కొందరు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అధికారుల కన్నుగప్పి అక్రమంగా భారీ వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని గూపన్‌పల్లి గ్రామానికి చెందిన సి.హెచ్‌. నారాయణరెడ్డి అనే వ్యక్తి మార్చి 23వ తేదీన నిజామాబాద్‌ తహసీల్దార్‌ రాజేందర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కంఠేశ్వర్‌ ...

Read More »

తాగునీరు, మిషన్‌ కాకతీయ, హరితహరం పథకాలపై జిల్లా కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాగునీరు, మిషన్‌ కాకతీయ, తెలంగాణ హరితహారం కార్యక్రమాలపై మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. బుధవారం స్తానిక ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో పై మూడు ప్రధాన కార్యక్రమాలపై జిల్లా స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమాలు సరిగా అమలు చేయడానికి, క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయడానికి, మండల స్థాయి అధికారులకు తగు ...

Read More »