mission kakateeya

మిషన్‌కాకతీయతో చెరువులకు పునర్‌వైభవం

– ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా తెలంగాణలోని చెరువులు, కుంటలు పునర్‌వైభవాన్ని సంతరించుకుంటాయని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఉగ్రవాయి, క్యాసంపల్లి గ్రామాల్లో మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు.

చిన్నమల్లారెడ్డి, లింగాయిపల్లి గ్రామాల్లో అంగన్‌వాడి భవనం, సిసిరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృడ సంకల్పంతో ఉందని, ఇందులో భాగంగానే మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.

తద్వారా గత పాలకుల కారణంగా నిర్లక్ష్యానికి గురై బీడు భూములుగా మారిన చెరువుల్లో తిరిగి భూగర్భ జలాలను పెంచి రైతులకు అందుబాటులో తెచ్చేందుకు పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. పంట చేలకు సారవంతమైన మట్టిన తోడుకోవడంతోపాటు పూడిక తీత కార్యక్రమం చేసి తద్వారా చెరువుల్లో నీటితోపాటు రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు మిషన్‌ కాకతీయలోపొందుపరిచినట్టు పేర్కొన్నారు.

రైతులు, ప్రజలు, అధికారులు అందరు ఏకమై మిషన్‌ కాకతీయ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి మంగమ్మ, నాయకులు మోహన్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, గోపిగౌడ్‌, నిట్టు వేణుగోపాల్‌రావు, కిషన్‌గౌడ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

 

Re-Establishment of lakes with mission kakateya Trs Kamareddy Gampa Govardhan

Check Also

అధిక వసూలు చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అంబులెన్స్‌ డ్రైవర్లు అధిక ...

Comment on the article