Breaking News

Daily Archives: April 9, 2015

టీచర్‌ పోస్టులు 15 వందలు ఖాళీ…

త్వరలో భర్తీకి రంగం సిద్దం… మరిన్ని ఖాళీలపై ఆరా నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఖాళీలపై విద్యశాఖ కసరత్తు మొదలుపెట్టింది. 2014 డిసెంబరులో తీసిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 15 వందల ఉపాధ్యాయుల పోస్టులు ఉన్నట్లు తెలింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల 250 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పదవి విరమణ పొందిన వారు, మరణించిన వారు లేదా ...

Read More »

తెవివిలో ఎంబిఎ విద్యార్థుల వీడ్కోలు సమావేశం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎంబిఎ విద్యార్థులు కామర్స్‌ కళాశాల భవనంలో బుధవారం రాత్రి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులనుద్దేశించి ఎంబిఎ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సత్యనారాయణచారి మాట్లాడుతూ విద్యార్థులు ఎంబిఎ వంటి వృత్తి విద్యా కోర్సుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని సూచించారు. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అవుతుందని వివరించారు. విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలన్నారు. కోర్సు పూర్తిచేసుకొని వెళుతున్న విద్యార్థులందరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో ప్రథమ, ...

Read More »

ముమ్మరంగా నూర్పిళ్ళు…

బాన్సువాడ, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కారుమబ్బులు కర్షకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులు వారిలో గుండెదడ పెంచుతున్నాయి. ఆరుగాలం కష్టించి పనిచేసిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు అన్నదాతను వెంటాడుతున్నాయి. రెండ్రోజులుగా తెరిపి లేకుండా మబ్బులు పట్టి ఉరుములు, మెరుపులు వస్తుండడంతో రైతులు పంటలను కోతలు చేపడుతున్నారు. ముఖ్యంగా సాగునీటి కష్టాలు ఎదుర్కొని సాగుచేసిన వరిపంట చేతికందే తరుణంలో వడగళ్ళు వెంటాడుతుండడం అన్నదాతను అందోళనకు గురిచేస్తోంది. దీంతో ఉన్నఫలంగా రైతులు కోతలకు సిద్దపడుతున్నారు. యంత్రాలను అద్దెలకు ...

Read More »

నీటి సమస్య తీర్చాలని ఛైర్మన్‌కు వినతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో నీటి సమస్య తీవ్రతరమైంది. 8 ట్యాంకర్లతోనే 23వార్డుల ప్రజలకు సేవలు చేయడం ఏమాత్రం సరిపోవడం లేదు. అందులో భాగంగానే ప్రజా నీటి సమస్యను తీర్చాలని గురువారం పలు కాలనీల ప్రజలు ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లుకు నీటి సమస్యపై విన్నవించారు. దీనికి ఛైర్మన్‌ స్పందిస్తు మరికొన్ని రోజుల్లో నీటి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటమని హామీ ఇచ్చారు.

Read More »

ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాటి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు గురువారం దాడిచేశాయి. కూలీలు యధావిధిగా తమ విదులను కొనసాగిస్తున్న సమయంలో ఎవరో ఆకతాయిలు తేనెతుట్టపై కొట్టడంతో ఈగలు లేచి అక్కడే పనిచేస్తున్న ఉపాధి కూలీలను తీవ్రంగా గాయపరిచాయి. దీంతో స్తానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Honey bees attack on Occupation Guarantee workers Armoor

Read More »

గత కార్మిక వ్యవస్థను రద్దు చేయవద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారిని రద్దుచేసి కొత్తగా టెండర్లు ఆహ్వానించారని పాలకవర్గం యోచిస్తుందని ఆ యోచనను వెంటనే మానుకోవాలని మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులు డిమాండ్‌ చేశారు. గురువారం మునిసిపల్‌ ఆవరణలో సమావేశమై పాలకులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టెండర్లు పిలిచి తద్వారా కార్మికులను విదుల్లో పెట్టుకున్నారని, మళ్లీ టెండర్లు పిలిచి పాతవారిని తీసేసి వారికి ఇష్టమైన వారిని పెట్టుకోవాలనే యోచనలో పాలకవర్గం ఉన్నట్టు ...

Read More »

ఘనంగా డైరీ కళాశాల వార్షికోత్సవం

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పివి.నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం డైరీ కళాశాల 6వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ డీన్‌ ఆచార్య రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ డైరీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. డైరీ కోర్సు పూర్తవగానే విద్యార్థులకు స్వదేశంతో పాటు విదేశాల్లో సైతం అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోని ఏకైక డైరీ కళాశాల కామారెడ్డిలో ఉందని, విద్యార్థులు డైరీలో ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతులకు బంగారు పంట …

– ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్‌ కాకతీయ తో చెరువుల పునరుద్దరణ చేసి తద్వారా రైతులు బంగారు పంటలు సాగుచేసుకునేందుకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని భిక్కనూరు మండలంలో బాగిర్తిపల్లి, ఇస్సన్నపల్లి, తిప్పాపూర్‌ గ్రామాలను సందర్శించి మిషన్‌ కాకతీయ పనులను, పలు అభివృద్ది పనులనుసైతం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఆంధ్రా పాలకుల ...

Read More »