గత కార్మిక వ్యవస్థను రద్దు చేయవద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారిని రద్దుచేసి కొత్తగా టెండర్లు ఆహ్వానించారని పాలకవర్గం యోచిస్తుందని ఆ యోచనను వెంటనే మానుకోవాలని మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులు డిమాండ్‌ చేశారు. గురువారం మునిసిపల్‌ ఆవరణలో సమావేశమై పాలకులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టెండర్లు పిలిచి తద్వారా కార్మికులను విదుల్లో పెట్టుకున్నారని, మళ్లీ టెండర్లు పిలిచి పాతవారిని తీసేసి వారికి ఇష్టమైన వారిని పెట్టుకోవాలనే యోచనలో పాలకవర్గం ఉన్నట్టు తెలుస్తుందని ఆరోపించారు. అలా కాకుండా గతం నుంచి కొనసాగుతున్న కార్మికులను విదుల్లో ఉంచాలని కోరారు. కాదని టెండర్లను ఆహ్వానిస్తే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు.

doపాలకులు, అధికారులు తమ స్వార్థం చూసుకోకుండా కార్మికుల గురించి ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు లక్ష్మణ్‌, నర్సింగ్‌రావు, సాయిరాం, రాజనర్సు, తదితరులు పాల్గొన్నారు.

Old Workers System should not be cancelled kamareddy.

Check Also

అధిక వసూలు చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అంబులెన్స్‌ డ్రైవర్లు అధిక ...

Comment on the article