dist president

వైకాపా జిల్లా అధ్యక్షుని ఎంపిక పట్ల సంబరాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకాపా జిల్లా అధ్యక్షునిగా పట్లోళ్ళ సిద్ధార్థరెడ్డిని నియమించడం పట్ల శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పార్టీ జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి ఆద్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్ధార్థరెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకుగాను పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ పటిష్టానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు హరీష్‌రెడ్డి, ప్రశాంత్‌, అనిల్‌రెడ్డి, లిఖిత్‌, శ్రీశైలం, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article