Breaking News

Daily Archives: April 11, 2015

మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌కు సన్మానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఇటీవల నిర్వహించిన అయ్యప్పస్వామి రజతోత్సవ దేవాలయ వేడుకలకు మునిసిపల్‌ శాఖ ద్వారా సేవలు అందించినందుకుగాను స్వామి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, వెంకట్‌ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ రజతోత్సవ వేడుకలకు మునిసిపల్‌ ఆధ్వర్యంలో నీటి వసతితో పాటు రోడ్డు నిర్మాణం, మురికి నీటి తొలగింపు, శుభ్రత తదతర సౌకర్యాలు కల్పించి ఉత్సవాలను విజయవంతంగా జరుపుకునేందుకు తోడ్పడినందుకు ...

Read More »

ఘనంగా జ్యోతిరావుఫూలే జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం మహాత్మాజ్యోతిరావుఫూలే జయంతివేడుకలను ఘనంగా నిర్వహించారు. బిసి ఐక్య సంఘర్షణ సమితి, తెలంగాణ విద్యార్థి పరిషత్‌, నవ నిర్మాణ్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌, తదితర సంఘాల ఆద్వర్యంలో మునిసిపాలిటి ఎదుట గల జ్యోతిరావుఫూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ 1850వ దశకంలో అగ్రకులాల దురహంకారాన్ని మనుధర్మానికి వ్యతిరేకంగా శ్రామికులను కలుపుకొని పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావుఫూలే అని కొనియాడారు. చదువు అందరికి అవసరమని ...

Read More »

హౌజింగ్‌ బోర్డులో స్వచ్ఛభారత్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌ బోర్డులో శనివారం హౌజింగ్‌బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఉదయం 6 గంటల నుంచి 10 వరకు స్వచ్ఛభారత్‌లో పాల్గొని గణపతి ఆలయం చుట్టుపక్కల పరిసరాలను, కాలనీని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడి ఇచ్చిన పిలుపుమేరకు స్వచ్ఛభారత్‌ నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిదులు రవి, లక్ష్మణ్‌, సాయిలు, సిద్దరాంరెడ్డి, నళిని, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ...

Read More »

ఘనంగా హనుమాన్‌ చాలీసా పారాయణ యజ్ఞం

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గంజివర్తక సంఘం ధర్మశాల ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. శ్రీమన్మధనామ సంవత్సరం అధిపతి శనీశ్వరుడు కావడం వల్ల శనిదోష నివారణ కోసం శ్రీగణపతి సచ్చిదానంద స్వామి ఆదేశాల మేరకు హనుమాన్‌ చాలీసా పారాయణ యజ్ఞం చేస్తున్నట్టు గంజి వర్తక సంఘం సభ్యులు తెలిపారు. వందలాది మంది భక్తులతో హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు.ప్రతి మంగళవారం, శనివారం యజ్ఞం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

ప్రభుత్వం తన చిత్తశుద్దిని చేతల్లో చూపాలి ..

– టిడిపి జిల్లా కన్వీనర్‌ అరికెల నర్సారెడ్డి కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం తమ చిత్తశుద్దిని మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని టిడిపి జిల్లా కన్వీనర్‌, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. కామారెడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నప్పటికి పనుల్లో మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటర్‌గ్రిడ్‌ ద్వారా నాలుగేళ్లలో ఇంటింటికి నీటి సరఫరా చేస్తామనిచెబుతున్నారని, కానీప్రస్తుతం నీటి ఎద్దడితో ప్రజలు రోడ్లమీదికి ...

Read More »

విద్యార్థుల రక్తదాన శిబిరం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాఘ విశ్వవిద్యాలయంలో బీసీ విద్యార్థి ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెయూలో జ్యోతిబాపూలే 189వ జయంతిని ఘనంగా నిర్వహించారు. శనివారం నాడు బాలుర వసతి గృహంలో బీసీ విద్యార్థి సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల మీదుగా బాలికల వసతి గృహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలతో క్యాంపస్‌ను హోరెత్తించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్‌ క్యాంటీన్‌ పరిసరాలను శుభ్రం ...

Read More »

మండల నూతన కార్యవర్గం ఎన్నిక

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల నూతన టీఆర్‌ఎస్‌ కార్యవర్గంలో మండల అధ్యక్షుడిగా చక్కరకొండ కృష్ణను నియమించినట్లు నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. టీఆర్‌ఎస్‌ మండల కార్యవర్గంలో మరో కొందరిని సీనియర్‌ కార్యకర్తలకు స్థానం కల్పించడం జరిగిందన్నారు. మండల ఉపాధ్యక్షుడిగా బాలాగౌడ్‌, మోజిరాంనాయక్‌, ఈగ రాజరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిగా నర్సయ్య, గోపి, సహాయ కార్యదర్శిగా సాయిలు, కోశాధికారిగా లక్ష్మీనారాయణ, మండల రైతు విభాగం అధ్యక్షుడిగా సాయిరెడ్డి, బీసీ సెల్‌ ...

Read More »

తెయూలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో కళాశాల సెమినార్‌ హాలులో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకగలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆర్‌. లింబాద్రి జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అభివృద్ధి కోసం అప్పట్లోనే అందరికి విద్యను అందించాలని బ్రిటిష్‌ పాలన కౌన్సిల్‌ అధికారులకు సమాన విద్యను అందజేయాలని వివిధ రకాల ...

Read More »

మే 10న తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీ ప్రవేశ పరీక్ష

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల ప్రవేశానికి టిఎస్‌ఆర్‌జేసి సెట్‌ 2015 మే 10న నిర్వహించనున్నారు. ఈపరీక్షకు దరఖాస్తు ఈనెల 18 వరకు గడువు విధించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలని అధికారులు పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లాలోని హసన్‌పర్తి (బాలికలు), నల్గొండలోని సర్వేల్‌, నిజామాబాద్‌లోని నగర (మైనార్టీ), హైదరాబాద్‌లోని ఎల్‌.బి.నగర్‌ (మైనార్టీ) జూనియర్‌ కాలేజీలో ప్రవేశాలు కల్పిస్తారు. Telangana Gurukal Jr College Entrance Test on 10th May .

Read More »

జిల్లాలోని ఆడపిల్లలు నూరుశాతం విద్యావంతులు కావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మహాత్మాజ్యోతి బాఫూలే 189వ జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, నగర మేయర్‌ ఆకుల సుజాత, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జేసి ఏ.రవిందర్‌రెడ్డి తదితరులు ఫూలే చిత్రపటానికి పూలమాలలువేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సమాజం ముందుకు వెళ్లి ...

Read More »

ముమ్మరంగా పూడిక తీత

బాన్సువాడ, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయలో భాగంగా బోధన్‌ డివిజన్‌లో చెరువులకు పునర్‌వైభవం వస్తుంది. పక్షం రోజులుగా డివిజన్‌లోని పలు చెరువుల్లో అధికారులు ప్రజా ప్రతినిదులు పూడిక తీత పనులకు ప్రారంభోత్సవం చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్‌ డివిజన్‌లో పలు చెరువుల్లో పూడిక తీత పనులకు శ్రీకారం చుట్టారు. దీనికి స్థానిక అధికారులు, నాయకులు కొనసాగింపుగా తమ ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. దీంతో డివిజన్‌లోని ...

Read More »

ఘనంగా జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని స్తానిక రాజారాంనగర్‌ కాలనీలో పిఎంపి డాక్టర్స్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షులు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆద్వర్యంలో జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిరావుఫూలే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల, పట్టణ పిఎంపి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు. Jyothi Rao pule birthday celebrations in Armoor

Read More »

వరుడు ఊడాయించాడు… వివాహాం అగిపోయింది…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10: తెల్లవారే సరికి పేళ్లి. అదనంగా కట్నం ఇస్తేనే పేళ్ళి చేసుకుంటానని వరుడు మొండి కేసాడు. అందుకు వదువు తల్లిదండ్రులు నిరాకరించడంతో వరుడు ఊడాయించాడు. వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అదే తరహాలో వ్యవహారించడంతో వివాహాం అగిపోయింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలోని బోర్గాం(పి) గ్రామంలో ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. చివరకు వదువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుడు పేళ్లికి అంగీకరించాడు. కానీ వదువు మాత్రం ససేమిరా తనకు ఈ పేళ్లి ఇష్టం ...

Read More »