Daily Archives: April 12, 2015

అకాల వర్షం… రోడ్లన్ని అస్తవ్యస్తం..

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో శనివారం రాత్రికురిసిన గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు విరిగిపోవడంతో పాటు విద్యుత్‌ స్థంభాలు పడిపోయాయి. ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగి పడ్డాయి. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో వేపచెట్టు నేలకూలింది. దీంతో ఈప్రాంతంలో విద్యుత్‌ స్థంభాలు సైతం కూలిపోయాయి. కాంగ్రెస్‌ భవన్‌ వద్ద విద్యుత్‌ స్థంభం విరిగిపడడంతో విద్యుత్‌ తీగలు రోడ్డుపై పడ్డాయి. స్థానికులు స్పందించి ఆవైపు వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. ...

Read More »

మేదరి మహాసభ గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈనెల 19న తలపెట్టిన మేదరి మహాసభ గోడప్రతులను ఆదివారం కామారెడ్డిలో మేదరికుల సభ్యులు ఆవిష్కరించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ మేదరి కులస్తుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం హైదరాబాద్‌లో మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. మేదరి కులస్తులు సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పోశాద్రి, కిషన్‌, ధర్మపురి, ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు. Medhari Community Wall Posters Inauguration, Medhari Community ...

Read More »

వాన కురిసింది… మోము మురిసింది…

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం, ఆదివారం రెండ్రోజులపాటు కురిసిన వర్షం పట్టణ ప్రజలకు కాసింత ఊరట నిచ్చింది. వేసవి కాలంలో వేడిగాలులు, వేసవి తాపంతో బాదపడుతున్న పట్టణ వాసులకు రెండ్రోజుల వర్షం చల్లార్చింది. వేడినుంచి ఉపశమనం కలిగించింది. వర్షం కారణంగా లోతట్టుప్రాంతాలైన బతుకమ్మ కుంట, ఆర్‌బి నగర్‌, సాయిబాబా గుడి చౌరస్తా, ఎరుకల వాడా, సైలానిబాబా కాలనీ, తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతర్గత రోడ్లు సరిగా లేకపోవడంతో అవి చిత్తడిగా మారాయి. శివారు కాలనీల్లో ...

Read More »

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు కండి …

– ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నాయకులు, కార్యకర్తలు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో ఆదివారం డివిజన్‌లోని నాలుగు మండలాల్లో పట్టణ టీఆర్‌ఎస్‌ కమిటీలను ఎన్నుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలు తమపై నమ్మకముంచి కౌన్సిలర్లుగా, వార్డుసభ్యులుగా, జడ్పిటిసిలుగా, ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాద్యతతమపై ఉందన్నారు. ప్రజల కస్టాల్లో పాలుపంచుకొని సమస్యల పరిష్కారానికి కృషి ...

Read More »

ఘనంగా మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆమె స్వగృహంలో కేక్‌ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. మునిసిపల్‌ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, మునిసిపల్‌ కార్మికులు, బంధుమిత్రులు ఛైర్మన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం పాటుపడతానని, తనకు ఛైర్‌పర్సన్‌గా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. Kamareddy Municipal Chairman Pippiri Sushma Birthday ...

Read More »

జిల్లా జర్నలిస్టుల ఛలో హైదరాబాద్‌

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 19వ తేదీన జర్నలిస్టులు ఛలో హైదరాబాద్‌ చేపట్టినట్టు జిల్లా అధ్యక్షులు అంగిరేకుల సాయిలు తెలిపారు. శనివారం ఛలో హైదరాబాద్‌ గోడప్రతులను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు లేక సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని, డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడియేషన్‌ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టులకు, నాన్‌ జర్నలిస్టులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

ఏఐసిసి ప్రతినిధి రాక

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులైన జిల్లా మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్‌ సోమవారం జిల్లాకు రానున్నారని డిసిసి అధ్యక్షులు తాహెర్‌బిన్‌ హందాన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను డిసిసి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని సూచించారు.   AICC President Madhu Yaski Goud Visit to Nizamabad

Read More »

పశువులను మింగుతున్న పాలిథిన్‌ భూతం…

– అధికారుల నియంత్రణ కరువు   – ప్రజా చైతన్యంతోనే ప్రకృతికి రక్షణ నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశువులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తింటూ అక్కడే విశ్రమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పశువులు సుమారు 2 వేలకు పైగానే ఉన్నాయని అంచనా. రోడ్లపై పారేసిన వ్యర్థాలలో ప్లాస్టిక్‌ సంచులు ఉండడంతో పశువులు వాటిని తింటున్నాయి. సంచుల్లో తినుపదార్థాలు దొరుకుతున్నాయని భావించి ప్లాస్టిక్‌ కూడా ఆరగిస్తున్నాయి. దీంతో కడుపులో జీర్ణం కాక మృత్యువాత పడుతున్న విషయం అందరికి తెలిసిందే. ...

Read More »