Daily Archives: April 14, 2015

అంబేడ్కర్‌ అందరివాడు…

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అందరివాడని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని అందరం దళిత, దీన జనోద్దరణకు, సంక్షేమానికి కృషి చేద్దామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్‌ అంబేడ్కర్‌ 124వ జయంతి సందర్భంగా మంగళవారం స్తానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

  బాన్సవాడ, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 125వ జయంతిని బోధన్‌ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. బాన్సువాడలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బోధన్‌ డివిజన్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నాయకులు, ఇతరులు అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు.

Read More »

తెవివిలో మహనీయుల జయంతి వేడుకలు

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ, బిసి సెల్‌ ఆద్వర్యంలో డాక్టర్‌ జయంతిని పురస్కరించుకొని మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, మిషన్‌ అంబేడ్కర్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ కె.చిరంజీవులు మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేనపుడు అంబేడ్కర్‌ ఉన్నత విద్యను దేశ విదేశాల్లో అభ్యసించారని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఐఆర్‌ఎస్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ బలరాం నాయక్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళుతూ ...

Read More »

సిపిఎం ఆద్వర్యంలో ప్రజా ప్రదర్శన

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సిపిఎం పార్టీ డివిజన్‌కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి పురస్కరించుకొని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సిఎస్‌ఐ చర్చి నుంచి మునిసిపల్‌ నిజాంసాగర్‌ చౌరస్తా మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్‌ ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ 125వ జయంతి

  రెంజల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 125వ జయంతి వేడుకలను మండలంలోని తాడ్‌బిలోలి, బోర్గాం, రెంజల్‌, సాటాపూర్‌, నీలా, కందకుర్తి, వీరన్నగుట్ట, ధూపల్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాడ్‌బిలోలి సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌ మాట్లాడుతూ భారతదేశంలో గొప్ప వ్యక్తి అంబేడ్కర్‌ అని ఆయన ఆశయసాధన కోసం ప్రతి ...

Read More »

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

  రెంజల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన ఫర్వీన్‌ సుల్తానా (32) అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని రెంజల్‌ ఎస్‌ఐ చామంతుల టాటాబాబు తెలిపారు. మృతురాలు అన్నయ్య ఇస్మాయిల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. Woman Suicide In Renjal

Read More »

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం భారతీయ జనతాపార్టీ ఆద్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి పిలుపుమేరకు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. అంబేడ్కర్‌ సైతం దేశం స్వచ్చంగా ఉండాలని కోరుకున్నారని, అంబేడ్కర్‌ఆశయాల మేరకు అందరం ముందుకు సాగాలని ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి వేడుకలను ఆయా పార్టీలు, కులసంఘాలు, కార్మిక సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. దళిత వర్గంలో పుట్టిన అంబేడ్కర్‌ అనగారిన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు అమలు కావాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిబంధనల్లో రిజర్వేషన్లు పొందుపరిచిన మహనీయుడని కొనియాడారు. సమసమాజ నిర్మాణ ధ్యేయంతో రిజర్వేషన్లు రూపొందించానన్నారు. పాలక ప్రభుత్వాలు ప్రయివేటు రంగంలో ...

Read More »

ప్రగతి స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ప్రగతి స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు సోమవారం నాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కుమారుడు జగన్‌ హాజరై మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ అంబేద్కర్‌ అని, ఈ సందర్భంగా దళితులకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ అడుగుజాడల్లో యువత నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి లక్ష్మీనర్సయ్య, టీఆర్‌ఎస్‌ ...

Read More »

తెయూలో జార్జిరెడ్డి 43 వర్ధంతి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి 43 వర్థంతిని కళాశాల ఎదుట చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు సౌందర్య మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమానికి ఊపిరిపోసిన మహోన్నత నాయకుడని ఆమె అన్నారు. విద్యారంగానికి జరుగుతున్న అన్యాయాలను ఎదురించి పోరాడిన యోధుడని ఆమె శ్లాఘించారు. పాలకుల గుండెల్లో రైల్లు పరుగెత్తించిన జార్జిరెడ్డి విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు ...

Read More »

మురికి కాలువలు శుభ్రపరిచిన పది రోజులకు..

  చెత్తఎత్తడానికి వస్తారు ..కాలనీవాసుల ఆరోపణ డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో డ్రైనేజీలను శుభ్రపరిచిన పదిరోజులకు చెత్తకుప్పలను ఎత్తివేస్తున్నారని గ్రామస్థులు, కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మురికికాలువలను తీసిన చెత్తను, వెనువెంటనే ఎత్తివేయకుండా పదిరోజుల తర్వాత చెత్తకుప్పలను ఎత్తివేస్తున్నారు. మళ్ళీ ఎదావిధిగానే మురికికాలువలోనే అవి కలిసిపోతున్నాయి. చేసిన పనికి ఫలితం లేకుండా పోతోందని అన్నారు. గ్రామస్థాయి అధికారులు చేసే పనిని శ్రద్ధంగా చేయిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని కాలనీవాసులు కోరుతున్నారు. గ్రామంలో సుభాష్‌చందబ్రోస్‌ విగ్రహం ఎదుట ...

Read More »

బీడీ కార్మికులకు జీవన భృతి వెంటనే కల్పించాలి

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న బీడీ కార్మికులకు ప్యాకర్స్‌, చాటన్‌, బట్టి, హమాలీ, కమీషన్‌ఏజెంట్లందరికి వెయ్యి రూపాయల జీవనభృతిని ఇవ్వాలని కోరుతూ లేబర్‌ రైట్స్‌ వెల్పేర్‌ సొసైటీ అధ్యక్షులు రాపెల్లి శ్రీనివాస్‌ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. సోమవారం ఆయన బీడీ కార్మికులతో కలిసి వెయ్యి రూపాయల భృతిని వెంటనే అమలు చేయాలని కోరుతూ అధికారులను కలిశారు. 01.03.2015 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల భృతిని ఇస్తున్నప్పటికి ...

Read More »

మహనీయుల జయంతిరోజున మద్యపాన విక్రయాలు నిలిపివేయాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మద్యపాన విక్రయాలను నిలిపివేసి మహనీయుడు డాక్టర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు అన్ని వర్గాలవారు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని దళిత కళ్యాణసమితి జిల్లా కార్యదర్శి చక్రదౌలత్‌ అన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంట నవీన్‌ గాంద్రే, సలేంక్‌ దయానంద్‌, అశోక్‌, గణపతి, తదితరులున్నారు. Alcohol should be Banned on Legends Birthdays stated by Dalith kalyan Samithi President ...

Read More »

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి

  రెంజల్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని రెంజల్‌ తహసీల్దార్‌ వెంకటయ్య అన్నారు. సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఆయన నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలుశాఖల అధికారులు, ఫిర్యాదుదారులు, డిప్యూటి తహసీల్దార్‌ డేవిడ్‌, ఏవో సిద్దిరామేశ్వర్‌, పశువైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. Prajavani is to Solve Public Problems Renjal  

Read More »

కందకుర్తి పుష్కరఘాట్‌లను సందర్శించిన రెంజల్‌ డిఐజి

  రెంజల్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్‌ను సోమవారం నిజామాబాద్‌ రేంజ్‌ డిఐజి గంగాధర్‌, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సందర్శించారు. జూలైలో వచ్చే పుష్కరాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని, అలాగే ట్రాఫిక్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటుచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్‌సిసి క్యాడెట్లు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, స్వచ్చంద సంస్థల కార్యకర్తలును కూడా భద్రత కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే పుష్కరాలకు వచ్చే ...

Read More »

డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డులో సిసిరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను సోమవారం మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2 లక్షలతో డ్రైనేజీ పనులు, రూ. 4 లక్షలతో సిసి రోడ్లు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో విడతల వారిగా ప్రగతి పనులు పూర్తిచేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, నాయకులు సరోజ, గంగాగౌడ్‌, బట్టు మోహన్‌, గంప అశోక్‌,నాగయ్య, వెంకటరాములు ...

Read More »