Daily Archives: April 16, 2015

13,604 హెక్టార్లలో పంట నష్టం

  – మంత్రి పోచారం వెల్లడి నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ళ వాన వల్ల వరి, సజ్జ, నువ్వులు, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మాక్లూర్‌ మండలం గుత్ప గ్రామంలో వరి పొలాలను సందర్శించి అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిదులతో ...

Read More »

రెండు తులాల గొలుసు అపహరణ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ఇందల్‌వాయి గ్రామ శివారులో స్వాగత తోరణం వద్ద ఓ మహిళకు కత్తి చూపించి ఇద్దరు దుండగులు ఆ మహిళ మెడలో ఉన్న రెండు తులాలనర బంగారు చైనును లాక్కొని పరారయ్యారని అన్నారు. దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు వ్యాక్తులు ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఇద్దరు దుండగులు మహిళపై కత్తి చూపించి బంగారాన్ని అపహరించి బైక్‌పై ఏపీ27ఎక్స్‌6718బైక్‌పై పారిపోతుండగా బుధవారం జక్రాన్‌పల్లిలో ...

Read More »

పరీక్ష కేంద్రాల తనిఖీ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం రెండో సెమిస్టార్‌ పరీక్షలు గురువారం జరుగుగా పరీక్ష కేంద్రాలను రిజిస్ట్రార్‌ ఆర్‌. లింబాద్రి సందర్శించారు. పరీక్షలు సక్రమంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు తీసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకార్యాలు కలుగకుండా చూడాలన్నారు. తనిఖీ సందర్భంలో కళాశాల ప్రిన్సిపర్‌ ప్రొఫెసర్‌ కనకయ్య, అడిషనల్‌ కంట్రోలర్‌ నాగరాజు తదితరులు ఉన్నారు. Examinations Centers were checked in Telangana University Dichpally

Read More »

స్పాట్‌ కేంద్రం తనిఖీ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలలో జరిగిన డిగ్రీ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. తెవివి కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలోని స్పాట్‌ కేంద్రాన్ని రిజిస్ట్రార్‌ ఆర్‌. లింబాద్రి సందర్శించారు. మూల్యాంకనం జరుగుతున్న తీరును అధికారులతో సమీక్షించారు. ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఎగ్జామ్స్‌ అడిషనల్‌ కంట్రోలర్‌ నాగరాజు ఉన్నారు. Telangana University Spot Centers were checked

Read More »

శాసనమండలి ప్రతిపక్ష నేతకు సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీని కామారెడ్డి నాయకులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే స్థాయి నుంచి పలు శాఖ ల మంత్రిగా, శాసనమండలి సభ్యునిగా, ప్రతిపక్షనేతగా ఎదగడం కామారెడ్డి ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దికి మరింత కృషి చేయాలని కోరారు. షబ్బీర్‌ను కలిసిన వారిలో కన్నయ్య, చింతల శ్రీనివాస్‌, కృఫాల్‌, శ్రీధర్‌, శేఖర్‌ తదితరులున్నారు. Opposition ...

Read More »

బైండ్ల సంఘం యువజన అధ్యక్షునిగా అర్జున్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైండ్ల సంఘం జేఏసి జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా బైండ్ల అర్జున్‌ను నియమించారు. అర్జున్‌కు నియామక పత్రాన్ని సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్‌ స్వామి గురువారం కామారెడ్డిలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైండ్ల సంఘం అభివృద్ధికి పాటుపడాలని సంఘ సభ్యుల్లో చైతన్యం తీసుకొచ్చి అన్ని రంగాల్లో వారు ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. అర్జున్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు సంఘం అభివృద్దికి కృషి ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డులో గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో రోడ్డు పనులను చేపట్టినట్టు తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రగతి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, వార్డు కౌన్సిలర్‌ సరోజ, కాలనీ వాసులు పాల్గొన్నారు. CC Road and drainage works started ...

Read More »

జీవనభృతి కోసం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వారందరికి జీవనభృతి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కామరెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన చాలామందికి జీవనభృతి జాబితాలో పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో పేరులేదని, ఆధార్‌ కార్డు లేదని తదితర కారణాలతో అర్హులైన తమకు లేదని జీవనభృతి కల్పించడం లేదని వాపోయారు. అదికారులు పిఎప్‌ ఉన్న అందరికి జీవన భృతి ...

Read More »

ప్రమాదవశాత్తు సంపులో పడి కూలి మృతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌ శివారులో మంగళవారం రాత్రి ఓ కూలీ ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందిన సంఘటన గురువారం వెలుగుచూసింది. మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన గంగరాజు (26) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గర్గుల్‌ శివారులోని ఓ వెంచర్‌లో పనిచేస్తుండగా మంగళవారం రాత్రి సమయంలో ఫిట్స్‌ వచ్చి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. బుధవారం వర్షం కారనంగా కూలీలు పనికి రాలేదు. గురువారం పనికివెళ్లగా గంగరాజు మృతదేహం ...

Read More »

ఖిల్లా డిచ్‌పల్లిలో గ్రామసభ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో గ్రామసభను గురువారం నాడు నిర్వహించారు. ఈ సభకు పర్యవేక్షణ అధికారి ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌ హాజరై మాట్లాడారు. గ్రామంలో ఉన్న సమస్యలపై శ్రీనివాస్‌ చర్చించారు. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకు ఇచ్చిన స్థలాలకు బడుగు, బలహీన నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. గతంలో ఉన్న సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పట్టించుకున్న నాథుడే కరవయ్యారన్నారు. ఇందిరమ్మ ...

Read More »