Breaking News

Daily Archives: April 17, 2015

పారిశుద్య పనులకు కృషి చేయాలి

  రెంజల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి, కల్యాపూర్‌గ్రామాల్లో శుక్రవారం సర్పంచ్‌లు తెలంగాణ శంకర్‌, మైని లతల అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ప్రధాన సమస్య తాగునీరు. మురికి కాలువలు శుభ్రం చేయడం, విద్యుత్‌లపై ప్రాధాన్యత ఇవ్వాలని, వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటి సమస్యను పరిష్కరించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం తాడ్‌బిలోలిలో 520 మంది బీడీ కార్మికులకు పిఎప్‌ కలిగిఉండగా 120మందికి పించన్లు వస్తున్నాయని, మిగతా 400 మంది ...

Read More »

రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  – ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ రెంజల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల క్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రైతు బాగుంటేనే తెలంగాణ ప్రభుత్వం బాగుంటుందని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ అన్నారు. శుక్రవారం రెంజల్‌ మండలంలో గత నాలుగు రోజుల క్రితం కురిసిన వడగళ్ళ వానకు నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిందని, రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట నోటికొచ్చే తరుణంలో ప్రకృతి కన్నెర్ర జేయడంతో రైతు శ్రమ వృధా ...

Read More »

సమాచార హక్కు చట్టం విషయసూచికలను ఏర్పాటు చేయాలి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రధాన కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005కి సంబంధించిన విషయ సూచికలు లేకపోవడంతో చట్టంపై ప్రజలకు అవగాహన లేకుండా పోతోంది. ప్రజల చేతుల్లో పాశుపాతాస్త్రంగా పనిచేయాల్సిన చట్టం అవగాహన రాహిత్యం వల్ల నీరుగారిపోతున్నట్లు కనబడుతోంది. ఎలాంటి సమాచారమైన ఏ విషయానికైనా సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు గోప్యంగా ఉంచేందుకే ఇష్టపడుతున్నట్లు స్పష్టమవుతోంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం విషయసూచిక మెనూలు గాని బోర్డులుగాని పొందుపర్చకపోవడం ...

Read More »

అసంపూర్తిగా నిలిచిన డ్వాక్రా సంఘం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో మహిళా డ్వాక్రా గ్రూపు సంఘం కోసం గత ప్రభుత్వ హయాంలో ఎంపీ ల్యాడ్స్‌ కింద మంజూరైన భవనం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా నిలిచిపోయింది. గ్రామంలో డ్వాక్రా మహిళాలకు నెలవారి సమావేశాలు నిర్వహించేందుకు భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని డ్వాక్రా సంఘాల మహిళలు పేర్కొంటున్నారు. భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘ భవనం పట్టించుకున్న ...

Read More »

మిట్టాపల్లిలో జిల్లాస్థాయి సాప్ట్‌బాల్‌ టోర్నమెంట్‌

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిట్టాపల్లి హైస్కూల్‌ క్రీడామైదానంలో ఈ నెల 20న జిల్లాస్థాయి జూనియర్‌ బాలబాలికలకు టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా సాప్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి. ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి ఎం. గంగామోహన్‌, కోశాధికారి బి. రాజునాయక్‌లు తెలిపారు. ఈ టోర్నీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసి ఈ నెల 30 నుంచి మే 2 వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరగన్నున రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ టోర్నీలో పాల్గొనే ...

Read More »