Breaking News

Daily Archives: April 18, 2015

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంద సంవత్సరాల తర్వాత తిరిగి శనివారం అమావాస్య రావడంతో ఈ విశిష్టతనుగుర్తుంచుకొని ప్రజలు ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు శివారులోగల దోబిఘాట్‌ హనుమాన్‌ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే జాన్కంపేట్‌ వద్దగల అష్టముఖి కోనేరు, నర్సింహస్వామిని దర్శించుకోవడానికి భారీగా బయల్దేరారు.

Read More »

వండర్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో పట్టణవాసికి చోటు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణానికి చెందిన మట్టెల వినోద్‌చారి ఈపాటికే కొన్ని రికార్డులు ఆయన ఖాతాలో వేసుకున్నారు. అందులో భాగంగానే వండర్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డును సైతం ఆయన కైవసం చేసుకున్నారు. ఈ మేరకు సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా వండర్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌ను అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డును సాధించడం ఆనందంగా ఉందని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని రికార్డులు సాధిస్తానని, ఆర్మూర్‌కు, తెలంగాణకు మంచి పేరుతెస్తానని పేర్కొన్నాడు.

Read More »

రైతులను ఆదుకోవాలి …

  – బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి. ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో ...

Read More »

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామ శివారులో నిజామాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీకొని గంగాధర్‌ (60) మృతి చెందినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ శనివారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుజరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ శనివారం పలు అభివృద్ధి పనులుప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.50 లక్షలతో చేపట్టిన మురికి కాల్వల నిర్మాణం, నాన్‌ ప్లాన్‌ నిదులు రూ. 4 లక్షలతో చేపట్టిన సిసి రోడ్దు పనులు, బిఆర్‌జిఎప్‌ నిదులు రూ. 2 లక్షలతో చేపట్టిన కల్వర్టు పనులను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ...

Read More »

రైతుల ఆత్మహత్యలు తెరాస పుణ్యమే…

  – టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ కారణంగానే 700 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన కామారెడ్డి టిడిపి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం మాటల్లో చెప్పిన పనులు చేతల్లో ఏమాత్రం చూపడం లేదని, ...

Read More »

నిధుల విడుదలపై హర్షం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని తాగునీటి ఎద్దడిని నివారణ కోసం రూ. 36 లక్షల నిధులను ఎంపీ కవిత, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ విడుదల చేసినట్లు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శక్కరి కొండ కృష్ణ శనివారం తెలిపారు. మండలంలోని బీబీపూర్‌కు రూ. లక్ష, చంద్రయాన్‌పల్లికి రూ. 2 లక్షలు, డిచ్‌పల్లి కి రూ. 1.లక్ష50వేలు, ధర్మారంకు రూ. 2 లక్షలు, సంగ్రానాయక్‌ తండాకు రూ. లక్ష, డిచ్‌పల్లి తండాకు రూ. 1.లక్ష50వేలు, ...

Read More »

ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వ్యాపార నిర్వహణ విభాగంలో రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సులతో పాటు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సులను నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్‌ సత్యనారాయణ చారి శనివారం నాడు తెలిపారు. ఈ కోర్సులకు కావాల్సిన కనీస విద్యార్హత ఇంటర్మీడియేట్‌ ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు 50 శాతం మార్కులు ఉండాలని అన్నారు. ఈ కోర్సులు డిగ్రీ మూడు సంవత్సరాలు, రెండు సంవత్సరాలు పీజీలతో ఐదుసంవత్సరాలుగా ఇంటిగ్రేటెడ్‌గా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ...

Read More »

నష్టపోయిన పంట రైతులను ఆదుకోవాలి

  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట రైతులను ఆదుకొని పంటకు సరైన మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె భూమన్న, మండల అధ్యక్షుడు బాగారెడ్డి శనివారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో జిల్లా రైతాంగాం తీవ్ర ఆందోళనకు గురైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ...

Read More »

7వ బెటాలియన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ 7వ బెటాలియన్‌, డిచ్‌పల్లి ఆఫీసర్స్‌, సిబ్బంది కమాండెంట్‌ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యమ్రాన్ని శనివారం నాడు నిర్వహించారు. బెటాలియన్‌ లో పరిసరాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా సమీపంలోని గామ్రాల్లో, వివిధ కార్యాలయ వద్ద, ఎంఆర్‌వో, ఎంపీడీవో, ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రి, పోస్ట్‌ ఆఫీస్‌ పరిసరాలలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చుట్టుపక్కల వారికి ...

Read More »

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో కొనసాగుతున్న పిజి పరీక్షా కేంద్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి శనివారం తనికీ చేశారు. యూనివర్సిటీ కళాశాలలో జరుగుతున్న పరీక్షహాల్‌లను తనిఖీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కనకయ్య, అడిషనల్‌ కంట్రోలర్‌ డాక్టర్‌నాగరాజులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు సజావుగా జరగడానికి సహకరిస్తున్న అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా డిగ్రీ మూల్యాంకనం కేంద్రాన్ని కూడా రిజిస్ట్రార్‌ ...

Read More »

పురివిప్పుతున్న మూఢనమ్మకాల జాడ్యం

  బాన్సువాడ, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూఢనమ్మకాల జాడ్యం మళ్ళీ పురివిప్పుతోంది. మారుమూల ప్రాంతంలో కొన్నాళ్లుగా సుబుద్దుగా ఉన్న మూడనమ్మకాలు మళ్ళీ వికటాట్టహాసం చేస్తున్నాయి. దేవుడమ్మలు, దేవుళ్ళు, పూనకందారులు, వీటికి ఆజ్యం పోస్తున్నారు. అక్షరాస్యత పరంగా వెనకబాటుతనంలో ఉన్న బోధన్‌ డివిజన్‌ మళ్లీ మూఢనమ్మకాలు పురుడు పోసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పోలీసులు మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో కొన్నేళ్ళుగా సద్దుమణిగినా ఇది మళ్ళీ పురుడు పోసుకుంటున్నాయి. బోదన్‌ డివిజన్‌లోని బీర్కూర్‌ మండలంలో నెలరోజుల ...

Read More »