Daily Archives: April 19, 2015

కానూరి వెంకటేశ్వర్‌రావు సంతాప సభ విజయవంతం చేయండి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరుణోదయ సాంస్కృతిక ఉద్యమ పితామహుడు కానూరి వెంకటేశ్వర్‌రావు సంతాపసభను ఈనెల 28న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు, దానికి సంబంధించిన గోడప్రతులను కుమార్‌ నారాయణ భవన్‌లో ఆదివారం జిల్లా ఉపాధ్యక్షులు రాజు, కార్యదర్శి సూరిబాబు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 20న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కానూరి సంతాపసభకు అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు నాగన్న, అధ్యక్షత వహిస్తారని, వక్తలుగా న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్రామయ్య, ప్రజాగాయకుడు గద్దర్‌, ...

Read More »

ఆలూర్‌లో భారీ చోరీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూరుగ్రామంలో చిన్నమల్లారెడ్డి అనే రైతు ఇంట్లో ఆదివారం భారీ చోరీ జరిగింది. సిఐ రవికుమార్‌ కథనం ప్రకారం…చిన్నమల్లారెడ్డి కుటుంబ సభ్యులు వేల్పూర్‌ గ్రామంలో తమ బంధువుల అంత్యక్రియలకు హాజరుకావడానికి వెళ్లిన సమయంలో ఇంట్లో మధ్యాహ్నం చిన్నమల్లారెడ్డి నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇదే అదనుగా భావించి బీరువాలోని సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్టు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన అన్నారు.

Read More »

బీజేపీ సభ్యత్వ నమోదు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదును జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె భూమన్న ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును ఆదివారం. ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి విశేషకు స్పందన ఉందని మహిళలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. ఈ సభ్యత్వ నమోదులో మహిళలు అధిక సంఖ్యలో నమోదు చేసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మేక బాగారెడ్డి, సంతోష్‌రెడ్డి, ...

Read More »

ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని పెద్దమ ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలోని అన్ని కుల సంఘాల వారు స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను చేపట్టాలని ముదిరాజ్‌ సంఘం కన్వీనర్‌ చిన్నసాయిలు, శ్యాంసుందర్‌, గంగారాంలు అన్నారు.

Read More »

దత్తాశ్రమంలో ఘనంగా పూజలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దత్తాశ్రమంలో ఆదివారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండి, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు.

Read More »

ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లును విరమించుకోవాలి – బిఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు రవాణా వ్యవస్థ నడ్డివిరిచేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న రోడ్డు ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లును వెంటనే విరమించుకోవాలని బిఎంఎస్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ డిమాండ్‌ చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ ఈనెల 30న దేశవ్యాప్తంగా చేపట్టనున్న రవాణా సమ్మెకు సంబందించిన గోడప్రతులను ఆదివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యుపిఏ ప్రభుత్వ హయాంలో సుందరం కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్డీయే ప్రభుత్వం బిల్లు తీసుకువస్తుందని ...

Read More »