Breaking News

Daily Archives: April 20, 2015

ప్రమాదకరంగా మారుతున్న బడాభీమ్‌గల్‌ రోడ్డు

  భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలంలోని భీమ్‌గల్‌ నుండి బడాభీమ్‌గల్‌ వెళ్లే రోడ్డు ఇరువైపులా గుంతలుగా తయారై సంవత్సరాలు గడిచినా సంబంధిత పాలకులకు అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం నుంచి వెళ్లే రోడ్డు ఇలా ఉంటే పల్లెల్లో రోడ్లు ఎలా ఉంటాయో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఒక నిదర్శనమేనని వాహనదారులు అంటున్నారు. భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని బెజ్జోరా, బడాభీమ్‌గల్‌ వెళ్లే రోడ్లు ఇలా గుంతలతో దర్శనమిస్తున్నాయి. ...

Read More »

నేడు విశ్వకర్మ భగవాన్‌ దర్శనానికి రానున్న జిల్లా అధ్యక్షులు

  భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని విశ్వకర్మగుట్ట, విశ్వకర్మ భగవాన్‌ దర్శనానికి విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు నరహరి, సెక్రెటరీ రామ్మోహన్‌చారిలు నేడు మంగళవారం రానున్నట్టు విశ్వకర్మ భగవాన్‌ ఆలయ కమిటీ అధ్యక్షులు సోక్కుల మోహన్‌ విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సమస్త విశ్వబ్రాహ్మణులు భారీగా భీమ్‌గల్‌ లోని విశ్వకర్మ గుట్టకు ఉదయం 8 గంటలకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు సుదర్శన్‌చారి, నాగయ్య, సుంకం నర్సయ్య, విఠల్‌, ...

Read More »

బిజెపి గూటికి ప్రముఖవైద్యులు డాక్టర్‌ మధుశేఖర్‌

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణమే గాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వైద్యరంగంలో సేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధుశేఖర్‌ ఆదివారం తన అనుచరులతోకలిసి హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆద్వర్యంలో బిజెపిలో చేరినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని వెల్లడించారు.

Read More »

డిఎం పోకడకు నిరసనగా ధర్నా

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డిపో మేనేజర్‌నియంతృత్వ పోకడను నిరసిస్తూ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ డిపో మేనేజర్‌ కార్మికులపై తన అక్కసును వెళ్లబోస్తున్నారని ఆరోపించారు. పనవేళల కంటే ఎక్కువగా పనిచేయిస్తూ కార్మికులపై దుర్బాషలాడుతూ తనకిష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని వారికి రావాల్సిన సెలవు దినాలను సైతం వారిని పనిచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్‌ఎం దీన్ని గ్రహించి డిఎంపై చర్యలు తీసుకోవాలని ...

Read More »

పేద క్షత్రియులకు బియ్యం పంపిణీ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని నిరుపేద క్షత్రియులకు ఆర్మూర్‌ క్షత్రియ యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో సోమవారం లక్ష్మినారాయణ మందిరంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్షత్రియ యువజన సమాజ్‌ నాయకులు మాట్లాడుతూ నిరుపేద క్షత్రియులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. క్షత్రియులు అన్నిరంగాల్లో రాణించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ్‌ సభ్యులు నివేదన్‌, అల్జాపూర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

చురుకుగా బిజెపి సభ్యత్వ నమోదు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌పట్టణంలో బిజెపి సభ్యత్వ నమోదు ఉత్సాహంగా కొనసాగుతుందని బిజెవైఎం పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్‌ తెలిపారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా 300 మందికి సభ్యత్వం చేయించి వారికిరసీదులు అందజేశారు. అనంతరం నరేందర్‌ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి పాలనవైపు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, అందుకే బిజెపి సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయికంటే ఎక్కువ నమోదు ...

Read More »

ప్రజావాణికి 66 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం పట్టణంలోని తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఈవారం ప్రజావాణికి 66 ఫిర్యాదులు వచ్చినట్టు తహసీల్దార్‌ శ్రీధర్‌ వెల్లడించారు. అందులో రెండు భూమికి సంబంధించినవి కాగా, ఒకటి తాగునీటి సమస్య, 63 ఎఫ్‌ఎస్‌సికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు. సమస్యలపై సమగ్ర విచారణ జరిపి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Read More »

పరిశ్రమల స్థాపనకు సత్వర చర్యలు తీసుకోవాలి

– జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలపరిమితి వరకు వేచిచూడకుండా పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా పరిశ్రమల అనుమతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించి సరైన నమూనాలో దరఖాస్తులు చేసుకునేవిధంగా చూడాలన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి ...

Read More »

వైభవంగా శ్రీరేణుక ఎల్లమ్మ జోగుపండగ

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో శ్రీరేణుక ఎల్లమ్మ జోగు పండగ కార్యక్రమాన్ని సోమవారం గ్రామ ప్రజలు వైభవంగా నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహించనున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రతియేడు అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని, ఈ యేడు సైతం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రేణుక ఎల్లమ్మ విగ్రహాన్ని గ్రామంలో డప్పు చప్పుళ్ళ మధ్య ఊరేగించారు. మహిళలు మంగళహారుతులతో అమ్మవారికి పూజలు జరిపారు. ఉత్సవాలకు గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు.

Read More »