Breaking News

Daily Archives: April 24, 2015

సిద్దుల గుట్టను సందర్శించిన టూరిజం అధికారులు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దులగుట్టను రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు సందర్శించారు. గుట్టపైగల రామాలయం, హనుమాన్‌ మందిరాలను సందర్శించారు. అంతకుముందు ఆలయకమిటీ సభ్యులు వారికి పూలమాలలతో సత్కరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ సిద్దులగుట్టపై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని వారు అన్నారు. సిద్దులగుట్ట పర్యాటక కేంద్రంగా మారడానికి అన్ని హంగులు గుట్టకు ఉన్నాయని వారు తెలిపారు. గుట్టను సందర్శించిన వారిలో డిప్యూటి మేనేజర్‌ నర్సింహమూర్తి, డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ నర్సింహారావు, ...

Read More »

ప్లీనరీకి భారీగా తరలిన తెరాస శ్రేణులు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం హైదరాబాద్‌లో తెరాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరి సమావేశానికి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు గంగాధర్‌ ఆద్వర్యంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌ తిరిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక కావడం శుభప్రదమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస పాలనలో ప్రజలు సుఖ శాంతులతో ఉన్నారని, అలాగే కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే బంగారు తెలంగాణ అవతరిస్తుందని, దీనికి సైనికులుగా పనిచేస్తామన్నారు.

Read More »

వికలాంగుల హక్కులు తెలుసుకోండి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికలాంగులు తమకున్న హక్కులను, లక్షణాలను ప్రత్యేక సౌకర్యాలను తెలసుకొని ధైర్యంగా ముందడుగు వేయాలని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చిన్నయ్య తెలిపారు. తెవివిలో వికలాంగ విద్యార్థుల సంక్షేమం కోసం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ప్రత్యేక చొరవతో వికలాంగుల సంక్షేమశాఖ అధికారులతో ఈ సమావేశం రిజిస్ట్రార్‌ చాంబర్‌లో శుక్రవారం నిర్వహించారు. వైకల్యం నాలుగు రకాలని, వారందరికి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, సంక్షేమ పథకాలు, ఏర్పాటుచేశామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆయనవివరించారు. రిజిస్ట్రార్‌ ...

Read More »

పరిశోధనలో నాణ్యత ముఖ్యం

  – ప్రొఫెసర్‌ జోషి డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశోధనలో మరింత నాణ్యత పెరగాల్సిన అవసరముందని ప్రముఖ మేనేజ్‌మెంట్‌ పరిశోధకులు ప్రొఫెసర్‌ జె.వి.జోషి అన్నారు. శుక్రవారం మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో స్టాటిస్టిటికల్‌ టూల్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌ ప్రారంభంలో ప్రధాన వక్తగా పాల్గొన్న రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ డీన్‌ జోషి మాట్లాడుతూ మంచి క్వాలిటీ, ఖచ్చితత్వమైన పరిశోధనలు జరిగినపుడే పరిశోధనలకు గుర్తింపు ఉంటుందన్నారు. పరిశోధకులు ...

Read More »

వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకొని వాడుకోవాలి

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని వాటినే వాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ మాచారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు. శుక్రవారం కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామాన్ని అధికారులతో సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలతో సమావేశమై మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సౌకర్యం తదితర అంశాలపై స్థానిక ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం వాటి పరిస్తితి కొనసాగుతున్న తీరును గ్రామస్తులతో ...

Read More »

దర్గా సేవకుడి దారుణ హత్య

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామ శివారులో గడ్డం భూపతిరెడ్డి పంట పొలం వద్ద గల బాబా షాదుల్ల దర్గాలో గురువారం రాత్రి దర్గా సేవకుడు కమ్మరి సంజీవ్‌(45) గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో కొంతకాలంగా దర్గా వద్ద కొనసాగుతున్న వ్యక్తి సహాయకుడు సిరికొండ మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తికూడా దర్గా వద్ద ఉంటారని కాగా గురువారం రాత్రి తన ...

Read More »

ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో తెయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి బాత్‌నాత్‌ శంకర్‌ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలని తెవివి రిజిస్ట్రార్‌ లింబాద్రికి అందజేశారు. గత సంవత్సరం ఎల్‌ఎల్‌ఎం కోర్సు అనుమతి లభించినప్పటికి ఇప్పటి వరకు తెలంగాణ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం కోర్సును ప్రవేశపెట్టక పోవడం ద్వారా ఎల్‌ఎల్‌ఎం చేసిన విద్యార్థులు ఎల్‌ఎల్‌ఎం కోర్సు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో లింబాద్రిని కోరారు.

Read More »

ఓయూ, పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ జారీ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యాసంవత్సరానికి 2015-16 వివిధ పీజీ కోర్సులలో అడ్మిషన్‌ పొందేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామన్‌ నోటిఫికేషన్‌ వెలువడిందని ప్రొఫెసర్‌ కనకయ్య అన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఒక సబ్జెక్టు రూ. 400, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300, అదనంగా రాయడానికి ఒక సబ్టెక్టుకు రూ. 200 తెలంగాణ ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చని అన్నారు. క్రెడిట్‌, డెబిట్‌, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేసుకోవచ్చన్నారు. చివరి తేదీ 13.05.2015 అపరాధ ...

Read More »