Breaking News
nannu gelipinchandy

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి – మాజీ మునిసిపల్‌ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేసేందుకు వైశ్య సంఘం ప్రతినిధులు తనకు అవకాశం కల్పించాలని మాజీ మునిసిపల్‌ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రామాంజనేయస్వామి దేవాలయంలో గురువారం పట్టణంలోని ఆర్యవైశ్య ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తాను పోటీ చేస్తున్నానని, ఆర్యవైశ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా తనను గెలిపించాలని కోరారు. పట్టణంలోని 33 కాలనీల్లోని ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కైలాష్‌ శ్రీనివాస్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పిప్పిరి వెంకట్‌, సునీల్‌, సూర్యం, గణేష్‌ గుప్త, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article