Monthly Archives: May 2015

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం 1983-84 లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ది స్నేహ ఏ ట్రూ ప్రెండ్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో 130 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ది స్నేహ సొసైటీ తరఫున గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధిని గురించి వివరించారు. అనంతరం సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా ...

Read More »

నేడు జిల్లాకు కేంద్రమంత్రి గడ్కరీ రాక

– మాజీ ఎమ్మెల్యే యెండల కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో సోమవారం జరగనున్న జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి, అనంతరం జరిగే సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరుకానున్నట్టు నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు యెండల లక్ష్మినారాయణ తెలిపారు. ఆదివారం కామారెడ్డిలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్రమోడి ఏడాది పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి గురించి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి గడ్కరీ వివరిస్తారన్నారు. ...

Read More »

పేకాటకు బ్రేక్‌ పడేదెప్పుడో…?

– జిల్లా ఎస్పీ ఆదేశాలు బేఖాతరు – మామూళ్ళకు అలవాటు పడిన కిందిస్తాయి సిబ్బంది – జిల్లాలో విచ్చల విడిగా సాగుతున్న పేకాట నిజామాబాద్‌ అర్బన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు పేకాట రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విచ్చలవిడిగా కొనసాగుతున్న పేకాటను పూర్తిగా నియంత్రిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట జిల్లాలో వేళ్ళూనుకుంది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో విచ్చలవిడిగా పేకాట స్థావరాలు ...

Read More »

బాలుడిని చేరదీసిన రైల్వే పోలీసులు

నిజామాబాద్‌ అర్బన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడురోజుల క్రితం ఓ తల్లి పిల్లవాడిని వదిలివేయడంతో నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. గమనించిన స్టేషన్‌ పోలీసులు చేరదీశారు. వివరాల్లోకి వెళితే… ఆదివారం మధ్యాహ్నం బోదన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి తరుణ్‌ (10) అనే పిల్లవాడు నిజామాబాద్‌కు వచ్చాడు. కాగా అతని మరణించాడని, తల్లి గత మూడురోజుల క్రితం పిల్లవాడిని వదిలివేయడంతో గమనించిన జిఆర్‌పిఎస్‌ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి రైల్వే నిజామాబాద్‌ స్టేషన్‌ మేనేజర్‌కు వివరాలు తెలిపి వారి ...

Read More »

ఇద్దరు బైకు దొంగల అరెస్టు – 9 బైకులు స్వాధీనం

ఆర్మూర్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఇద్దరు బైకు దొంగలను ఆదివారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామానికి చెందిన నరేశ్‌, విజయ్‌ శనివారం ఆర్మూర్‌ దార్ల హనుమాన్‌ మందిరం వద్ద పోలీసులు వాహనాల తనికీ చేస్తుండగా హీరోహోండా ద్విచక్రవాహనంపై వస్తుండగా వాహనాల తనికీని గమనించిన వారు వెనక్కి తిరిగి వెళుతుండగా పోలీసులు వెంబడించి పట్టుకొని వాహన దృవీకరణ పత్రాలు అడుగగా ...

Read More »

సిబిఎస్‌ఇ పదిలో ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యార్థుల ప్రతిభ

నిజామాబాద్‌ కల్చరల్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2015-15 విద్యాసంవత్సరానికి గాను ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల అదినేత అన్నారు. ఈనెల 28న సిబిఎస్‌ఇ విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యార్థులు మరోసారి తమ సత్తాచాటారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్తుళు అత్యధిక గ్రేడులు సాధించిన రోషిని, ప్రణవ్‌రెడ్డి, స్పందన, రాకేశ్‌ తదితర విద్యార్థులను అభినందించారు. పాఠశాల ...

Read More »

పచ్చిరొట్టె ఎరువులు వాడాలి – ఏవో

డిచ్‌పల్లి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రియ వ్యవసాయంతో అధిక పంట దిగుబడులు సాద్యమని, రైతులు భూసారం పెంపుకోసం వ్యవసాయ అధికారుల సూచనలతో పాటు పచ్చిరొట్టె ఎరువులు వాడి అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ అధికారి రాంబాబు సూచించారు. మన తెలంగాణ – మన వ్యవసాయం రైతు అవగాహన సదస్సులో భాగంగా మండలంలోని బర్దిపూర్‌, నడిపల్లి గ్రామాల్లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో రైతులు తప్పకుండా భూసార పరీక్షలు, మట్టి నమూనా సేకరించి భూమిలో ఉన్న పోషకాలు తెలుసుకోవాలని, ...

Read More »

మెడిసిన్‌లో 116 ర్యాంకు సాధించిన ఆర్మూర్‌ విద్యార్థిని

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పుప్పాల సంజన మెడిసిన్‌ ప్రవేశ పరీక్షలో 116 వ ర్యాంకు సాధించి జిల్లా విద్యార్థినిగా తన ప్రతిభ కనబరిచారు. పుప్పాల చంద్రశేఖర్‌, మాధవిల కూతురు 10వ తరగతి వరకు నిజమాబాద్‌లో చదివి, ఇంటర్మీడియట్‌ కూకట్‌పల్లి హైదరాబాద్‌లోని సాయినగర్‌ చైతన్య కళాశాలలో పూర్తిచేసిందన్నారు. సంజన తల్లి మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో విధులు నిర్వహిస్తుండగా, పుప్పాల రాజశేఖర్‌ ప్రొఫెసర్‌గా విదులు నిర్వహిస్తున్నారు. మెడిసిన్‌లో 116వ ర్యాంకు సాదించడం ఎంతో సంతోషంగా ఉందని ...

Read More »

సోమవారం ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళా

నిజామాబాద్‌ అర్బన్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 1వ తేదీ సోమవారం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఆశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన వినూత్న ఫర్టిలైజర్స్‌లో సేల్స్‌ టైనీ పోస్టులు 30 ఉన్నాయని, నెల జీతం రూ. 5000+ 1690 (టిఎ, డిఎ) ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే ఆర్‌ఎస్‌ సెక్యురిటీస్‌లో 500 పోస్టులున్నాయని ఇందులో నెలజీతం 6000 భోజనం వసతి ఉంటాయన్నారు. వయసు 19 – 40 సంవత్సరాలలోపు వారు 5,6 అడుగుల ...

Read More »

మే31 ప్రపంచ పోగాకు నిషేదిత దినోత్సవం ఐఎంఏ కరపత్రం విడుదల

నిజామాబాద్‌, మే 31 : ప్రపంచ పోగాకు నిషేదితదినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) పోగాకు వాడకం వల్ల నష్టాలను వివరిస్తూ ఓ కరపత్రంను విడుదల చేసింది. ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ గుప్త, కార్యదర్శి డాక్టర్‌ కవితారెడ్డి, కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ విశాల్‌, ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌లు కరపత్రమును విడుదల చేసారు. కరపత్రం ద్వారా పొగాకు తయారీ, ఉపయోగించే పదార్థాలు, శరీరానికి ఏవిధంగా హానిచేస్తుంది, ఇది అలవాటైనవారు ఎలా మాన్పించే ప్రయత్నం చేయాలి, తదితర ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. ...

Read More »

బౌద్ద సన్యాసిగా మిస్‌ ఇండియా రన్నరఫ్‌

ముంబాయి, మే 31 : ఉన్నత స్థాయిలో అందరు గుర్తించేలా, పలువురిలో మెరిసేలా ఉండటం మహిళలకు ఓ కళ. అ కళ సాధన కోసం ఆమె మిస్‌ ఇండియా పోటీలకు వెళ్లి రన్నరఫ్‌గా నిలిచింది. అ తర్వాత సినిమా నటిగా, మోడిల్‌గా దేశంలోనే ఓ గుర్తింపు తెచ్చుకుంది. కాని సడన్‌గా కనుమరుగు అయి బౌద్ద సన్యాసినిగా అవతారమెత్తారు. సదాసిదగా రెండు జతల బట్టలు, ఒక జత చేప్పులే అస్తిగా ఆమె స్థిరా పడ్డారు. ఆమెనే బర్ఖామదన్‌. హిమాలయాల ప్రాంతానికి చెందిన మొట్టమొదటి బౌద్ద సన్యాసినిగా ...

Read More »

తంగెడు ఆకులపై తెలంగాణ చరిత్ర

అదిలాబాద్‌, మే 31: అతని పేరు దుర్గం వినయ్‌కుమార్‌, ఊరు పెద్దబండ, మండలం సిర్పూర్‌(టి), జిల్లా అదిలాబాద్‌. డీగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేసాడు. ఇతను చేసిన పని ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇచ్చిప తంగెడు ఆకులపై తెలంగాణ చరిత్రను రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సుమారు నెల రోజులుగా 20 వేల 700 ఆకులపై చరిత్రను రాసి 230 తెల్ల కాగితాలపై అతికించాడు. ఈ తంగేడు ఆకులపై రాసిన తెలంగాణ చరిత్రకు మంచి గుర్తింపు రావాలని, రాష్ట్ర అవతరణ వేడుకల్లో ...

Read More »

వైట్‌హౌస్‌లో రహెమన్‌ జయహో

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రహమాన్‌కు వైట్‌ హౌజ్‌లో అరుదైన గౌరవం దక్కింది. రహమాన్‌ జీవిత విశేషాలతో కూడిన దూపొందించిన జయహో డాక్యుమెంటరీని వైట్‌ హౌస్‌లో ప్రదర్శించారు. అయన సంగీతంలో చూపించిన ప్రతిభ, వైవిద్యం, వ్యక్తిగత జీవితం, వృత్తి, ప్రవృత్తి విశేషాలతో దర్శకుడు ఉమేష్‌ అగర్వాల్‌ డాక్యుమెంటరీని రూపొందించారు. అస్కార్‌ గుర్తింపు నుంచి గ్రామీణ పురస్కారాల వరకు అన్నింటిని పొందుపరడం విశేషం. ఈ మేరకు వైట్‌హౌస్‌ గౌరవంపై రహమాన్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

Read More »

ఈ ఏడాది పెద్ద జోక్‌ టిడిపి జాతీయ పార్టీ కావడం …. టిఎస్‌ శాసన మండలి నేత షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌, మే 31 : టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం ఈ ఏడాది అతి పెద్ద జోక్‌ అని కాంగ్రెస్‌ తెలంగాణ శాసన మండలి పక్షనేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయిన జాతీయ పార్టీగా గుర్తింపు కావాలంటే కనీసం నాలుగు రాష్ట్రల్లో పార్టీ పని చేస్తు ఉండాలని అన్నారు. అక్కడి ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు రావాలని అన్నారు. ఇవివే లేకుండా టిడిపిని జాతీయ పార్టీగా గుర్తింపు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 425 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ...

Read More »

పార్శిల్‌కు గుర్తింపు తప్పనిసరి… రైల్వే శాఖ కొత్త నిబంధన

హైదరాబాద్‌, మే 31 : ఇక నుంచి రైల్వే ద్వారా ఏలాంటి పార్శిల్‌ పంపాలన్న తప్పకుండా సదరు వ్యక్తి గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. బినామి పేర్లతో వస్తువులు రవాణ చేస్తున్నరని, వీటిని రూపుమాపేందుకు కొత్త నిబంధనను అమలు చేస్తున్నారు. గుర్తింపు కార్డుల్లో ఓటరు గుర్తింపు కార్డు, పాసుపోర్టు, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఏ ...

Read More »

జూన్‌ 24న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్‌, మే 31 : బ్యాంకు ఉద్యోగుల, సిబ్బంది సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తు జూన్‌ 24న దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని అలిండియా బ్యాంకు ఎంప్లాయస్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అనుబంధ బ్యాంకులతో పాటు స్టేట్‌ సెక్టార్‌ బ్యాంకు ఎంప్లాయిస్‌ సంఘాలన్ని ఈ సమ్మెకు మద్దతును ఇస్తున్నాయి. ఎస్‌బిఐ నుంచి అనుబంధ బ్యాంకులను విడదీయాలని, ప్రభుత్వ నిబంధనాల మేరకు కారుణ్య నియమాకాల పథకాన్ని విస్తరించాలని, యూనియిన్ల ప్రాతినిధ్యం తగ్గించవద్దని ఇలా పలు డిమాండ్లతో ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు సిద్దం ...

Read More »

స్కాలర్‌ షిప్పుల ధరఖాస్తులకు గడువు జూన్‌ 15కు పెంపు

హైదరాబాద్‌, మే 31 : 2014-15 సంవత్సరం బోధన రుసుములు, ఉపకార వేతనాల(స్కాలర్‌ షిప్పుల) కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. మే 30తో చివరి తేదిగా ఉన్న గడువును జూన్‌ 15 నాటికి తెలంగాణ ప్రభుత్వం పెంచింది. డిగ్రీలో విద్యార్థులు చెరాల్సి ఉండటం, విద్యార్థులు, వారి తల్లితండ్రుల నుంచి వినతులు రావడంతో గడువు పెంచారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ విద్యార్థులు సకాలంలో స్కాలర్‌షిప్పులను ధరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించింది.

Read More »

అంబేద్కర్‌ పేరునా అంతర్జాతీయ కేంద్రం… రూ.296 కోట్ల కెటాయింపు… 125 జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు

డిల్లీ, మే 31 : భారత రాజ్యంగా శిల్పి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌కు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కట్టపెట్టనుంది. ఆయన 125వ జయంతి ఉత్సవాలను సాక్షాత్తు ప్రధాన మంత్రి అధ్యక్షతన మంత్రుల సంఘాన్ని నియమించి, వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్రలు చేపట్టాల్సిన కార్యక్రమాలను సిఫారసు చేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఈ మేరకు రూ.,296 కోట్లును ముందుగా కెటాయించి, అందులో 15-జన్‌పథ్‌లో రూ.197 కోట్లతో అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రం, రూ.99 కోట్లతో స్మారక నిర్మాణం డిల్లీలో చేపట్టాలని నిర్ణయించారు. అంబేద్కర్‌ సిద్దాంతాలు, ...

Read More »

మహిళతోదురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి ఒడ్డెర కాలనీలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ శనివారం తెలిపారు. సిఐ కథనం ప్రకారం… లావణ్య అనే మహిళ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి వద్ద ఉండగా ఇంటిపక్కనేగల వేముల సోమయ్య అనే వ్యక్తి లావణ్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. సోమయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ...

Read More »

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం

– మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్‌ పట్టణంలో ఆవిర్భావ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహిస్తామని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు, ప్రత్యేకాధికారి సమ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంరోజుల పాటు కొనసాగే ఈ వేడుకలు జూన్‌ 1 రాత్రి 8 గంటల నుంచి పట్టణంలోని జంబిహనుమాన్‌ మందిర ప్రాంగణంలో తెలంగాణ ధూం… ధాం.. కార్యక్రమం, రాత్రి 11.55 ...

Read More »