Breaking News

Daily Archives: May 7, 2015

బంగారు గొలుసు అపహరణ

నిజామాబాద్‌ అర్బన్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఎన్జీవోస్‌ కాలనీలో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బంగారు గొలుసు అపహరణకు గురైంది. వివరాల్లోకి వెళితే… మహాజన్‌ ప్రమీల అనే వృద్దురాలు ఉదయం ఇంటివద్ద చెట్లు పువ్వులు కోస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్‌ వాహనంపై వచ్చి అపార్ట్‌మెంట్‌ ఇక్కడ ఉందా అని అడిగారు. నాకు తెలియదని సదరు మహిళ సమాధానం ఇచ్చింది. కొద్ది ముందుకెళ్ళే ప్రయత్నం చేసి తిరిగి వెనక్కి వచ్చి వేగంగా మహిళ మెడనుంచి ...

Read More »

కారోబార్లకు ప్రభుత్వం న్యాయం చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్టు కారోబార్లుగా పనిచేస్తున్న వారందరికి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శ్యాం కోరారు. డిపివో కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ 24 రోజులుగా చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. కాంట్రాక్టు కారోబార్లు కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని ...

Read More »

రెండో రోజుకు చేరిన ఆర్టీసి కార్మికుల సమ్మె – 43 శాతం ఫిట్‌మెంట్‌కోసం డిమాండ్‌

నిజామాబాద్‌ అర్బన్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి అందరిని రెగ్యులరైజ్‌ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బస్టాండ్‌ ఎదుట ఆర్టీసి కార్మికులు బైఠాయించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ ప్రధానంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ఇవ్వాలని, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వమే నడపాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి అందరిని రెగ్యులర్‌ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ ...

Read More »

బస్సుల కొనుగోలుకు బడ్జెట్‌లో 150 కోట్లు – రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా పనిచేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో అన్ని హంగులతో రూ. 63 లక్షలతో నిర్మించిన రవాణా శాఖ కార్యాలయం నూతన భవనానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ ఆర్టీసి విభజన సమస్య 14వ తేదీతో ...

Read More »

రాబడ్డి లక్ష్యసాధనకు కృషి చేయాలి – రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రవాణా శాఖ అధికారులు, మోటారు వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్లు విదులను సమర్థవంతంగా నిర్వర్తించినపుడే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో నూతనంగా ప్రారంభించిన ఆర్టీఓ కార్యాలయంలో రవాణా శాఖ పనితీరును మంత్రి సమీక్షించారు. చెక్‌పోస్టుల్లో మరియు వాహనాల తనిఖీ ద్వారా రావాల్సిన రాబడి లక్ష్యాన్ని సాధించడానికి అంకితభావంతో కృషిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. తెలంగాణ రోడ్డు ...

Read More »

డంప్‌ యార్డును పరిశీలించిన ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంప్‌ యార్డును ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలకులు చెత్తను సేకరించి తమకు ఇష్టమొచ్చినట్టు వేశారని, కానీ తమ పాలకవర్గం డంప్‌ యార్డు ఏర్పాటు చేసి అందులో వేస్తున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తమకు సహకరిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి, ఎంపి కవితలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

ఆర్మూర్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్‌ సద్వార్‌ అస్కారీ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రయివేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి విద్యార్థులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేర్చాలని ఆమె సూచించారు.

Read More »

తాగునీరు లేక ప్రజల విలవిల

ఆర్మూర్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో తాగునీరు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు. రెండ్రోజులకోసారి క్రమంగా రావాల్సిన నీటి ట్యాంకర్‌ వారం రోజులైన రాకపోయేసరికి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవాల్సిన మునిసిపల్‌ పాలకవర్గం, అదికారులు పట్టించుకోకపోవడంతో నీటి సమస్య జఠిలమవుతుంది. దీంతో ప్రజలే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటినిసేకరిస్తున్నారు. ఇప్పటికైనా మునిసిపల్‌ అధికారులు, పాలకవర్గం స్పందించి నీటి ట్యాంకర్లను, ప్రత్యామ్నాయ మార్గాలను పకడ్బందీగా చేపట్టాలని కోరుతున్నారు.

Read More »

మారుతి కారు దగ్దం

ఆర్మూర్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని రాజారాం నగర్‌ కాలనీకి చెందిన అలిశెట్టి నారాయణ మారుతి 800 కారు గురువారం దగ్దమైంది. తన పని నిమిత్తం కారులో బయల్దేరిన నారాయణ వెంకటేశ్వర కాలనీ వద్ద కారు ముందు భాగం నుంచి మంటలు చెలరేగడంతో కారులోంచి దిగి నీళ్లు చల్లే ప్రయత్నం చేయగా, అనంతరం చూసే సరికి కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయి కనిపించింది.

Read More »

ఆగిన బస్సు చక్రాలు – ప్రయాణీకుల ఇబ్బందులు

ఆర్మూర్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజు సైతం విజయవంతంగా కొనసాగుతుంది. పట్టణంలో బస్సులు నడవకపోవడంతో ప్రయాణీకుల అవస్థలకు అంతులేకుండా పోయింది. నిత్యం రద్దీగా ఉండే ఆర్మూర్‌ బస్టాండ్‌ ప్రాంతం, బస్టాండ్‌ ప్రయాణీకులు లేక విలవిలపోతుంది. దీన్ని అదనుగా భావించిన ఆటోలు, ప్రయివేటు వాహనదారులు ప్రయాణీకుల నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గురువారం ఆర్మూర్‌ డిపో ఎదుట ఆర్టీసి కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ...

Read More »