Breaking News

Daily Archives: May 8, 2015

నేటి సూక్తి

దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి – డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌

Read More »

సిసి డ్రైన్‌ పనులు ప్రారంభం

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 4వ వార్డులో శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి డ్రైన్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5 లక్షలతో సిసి డ్రైనేజీ పనులను ప్రారంభించినట్టు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సిసి డ్రైన్‌ పనులను చేపట్టినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ పుల్లూరి జ్యోతి, బట్టు మోహన్‌, నాయకులు సంపత్‌, ప్రభాకర్‌, అశోక్‌, గంగాగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

టిపిసిసి అధ్యక్షునికి సన్మానం

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని శుక్రవారం కామారెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. కామారెడ్డికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చిన నేపథ్యంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆయన్ను కలిసి శాలువా, పూలమాలలతో సన్మానించారు. మొదటిసారి కామారెడ్డికి వచ్చిన ఆయనకు నాయకులు ఘన సన్మానం పలికారు. ఈనెల 11న కామారెడ్డిలో జరిగే బహిరంగసభకు కాంగ్రెస్‌ పార్టీతోపాటు అనుబంధ సంఘాల ప్రతినిధులందరు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులను కోరారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు శాసనమండలి విపక్ష ...

Read More »

కోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ అధికారికి సన్మానం

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అదనపు జిల్లా కోర్టులో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ప్రభుదాస్‌ను శుక్రవారం కోర్టు హాల్‌లో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు సన్మానించారు. ప్రభుదాస్‌ సంగారెడ్డికి బదిలీ అయిన నేపథ్యంలో ఆయన్ను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుదాస్‌ లాంటి వ్యక్తులు గురుతర బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. 20 సంవత్సరాల అనుభవంలో భాధ్యత గల అదికారిగా పనిచేస్తూ వచ్చారని ప్రశంసించారు. కార్యక్రమంలో బార్‌ ...

Read More »

ఆర్టీసి కార్మికులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఉద్యోగులపై కన్నతల్లిప్రేమ చూపి భారీగా జీతాన్ని పెంచి ఆర్టీసి కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆర్టీసి కార్మికులు దుయ్యబట్టారు. ఆర్టీసి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 3వ రోజుకు చేరింది. సమ్మెలో పాల్గొన్న కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసి కార్మికులపై నష్టాల బూచి చూపి ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టుగా 43 శాతం జీతాలు పెంచకుండా 28 శాతం మాత్రమే పెంచుతామని ప్రకటించడం గర్హనీయమన్నారు. ఆర్టీసికి వచ్చే నష్టాలను ఇతర రాష్ట్రాల ...

Read More »

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతు ఆత్మహత్యలు రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్ర – టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రభుత్వాల భరోసా లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతు భరోసా పాదయాత్రను చేపడుతున్నారని తెలిపారు. శుక్రవారం కామారెడ్డి సిఎస్‌ఐ గ్రౌండ్‌లో రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ...

Read More »

ఆర్టీసి కార్మికులకు ఆయా పార్టీల మద్దతు

ఆర్మూర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో మూడో రోజుకు చేరుకుంది. పట్టణంలోని ఆర్టీసి డిపోముందు బైఠాయించిన కార్మికులకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు.

Read More »

నడవని బస్సులు- ప్రయాణీకుల ఇబ్బందులు

ఆర్మూర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె మూడురోజులకు చేరుకున్నా సమ్మె విరమించకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల ఇక్కట్లు అంతా ఇంతా కాదు. దీన్ని అదనుగా భావించిన ప్రయివేటు ఆటోలు, వాహనాలు అధిక డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసి యాజమాన్యం ప్రయివేటు బస్సులను నడుపుతున్నా వారు సైతం ప్రయానీకులకు టిక్కెట్లు కొట్టకుండా ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ...

Read More »

త్వరలో ‘అటల్‌ పింఛన్‌ యోజన’ ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతమున్న స్వావలంబన యోజన స్థానంలో అటల్‌ పింఛన్‌ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుంది. ఈ పథకంలో 18 సంవత్సరా లనుంచి 40 ఏళ్ల వయసున్న వారందరు చేరవచ్చని నిజామాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రావు తెలిపారు. కనిష్ట పించన్‌ రూ. 1000 నుంచి గరిష్టంగా 500 వరకు పింఛన్‌ పొందవచ్చని అన్నారు. ఇందులో చేరేవారు తమ బ్యాంకు ఖాతానుంచి ప్రతినెల నేరుగా జమ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతినెల పించన్‌ 2000 ...

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌ అర్బన్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికుల సమ్మెలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ముందుగా నిజామాబాద్‌ ఆర్టీసి 1వ డిపో నుంచి దిష్టిబొమ్మను బస్టాండ్‌ వరకు ఊరేగించి అక్కడే దగ్దం చేశారు. ఈ సందర్భంగా టిఎంయు రీజినల్‌ సెక్రెటరీ వందేమాతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ మూడురోజుల నుంచి ఆర్టీసి కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సాదనలో భాగంగా సకల జనుల సమ్మెలో ఆర్టీసి కార్మికులు ...

Read More »

ఆర్టీసి సమ్మెకు మద్దతుగా సిఐటియు

నిజామాబాద్‌ అర్బన్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ దిష్టిబొమ్మ శవ యాత్ర నిర్వహించి బస్టాండ్‌ ఆవరణలో దగ్దం చేశారు. గత మూడు రోజులుగా ఆర్టీసి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నప్పటికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కార్మికులు సమ్మెను ఉధృతం చేశారని అన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మాటమార్చారని సిఐటియు జిల్లా కార్యదర్శి ...

Read More »

నూతన ఇసుక విధానం ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలులోకి తీసుకు వచ్చిన ఇసుక విధానానికి సంబంధించి నిజామాబాదు జిల్లాలోని పట్టాదారులతో తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఒప్పందం కుదర్చుకుంది. ఇందుకు సంబంధించిన సంతకాల ప్రక్రియ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ సమక్షంలో శుక్రవారం సంబంధిత అధికారులు పట్టాదారులతో పూర్తి చేసుకున్నారు. ఇకనుంచి తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ విక్రయానికి శ్రీకారం చుట్టినట్లయింది. తెలంగాణ రాష్ట్ర ం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అగ్రిమెంట్‌ జిల్లాలో ప్రారంభమైంది. ...

Read More »

ఆధార్‌ అనుసంధానం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధార్‌ కార్డును ఓటరు కార్డు అనుసంధానం చేసే ప్రక్రియను నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ శుక్రవారం పరిశీలించారు. నగరంలోని ఖిల్లారోడ్డులో ప్రభుత్వ సిబ్బంది బిఎల్‌వో బూత్‌ లెవల్‌ ఆపీసర్‌ నిర్వహిస్తున్న పనిని స్వయంగా తనికీ చేశారు. పలు ఇళ్లకు వెళ్లి స్థానికులతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్బంగా బిఎల్‌వోలకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. ఆ తరువాత కలెక్టర్‌ స్థానిక తహసీల్‌ కార్యాలయ సమీపంలో మీ సేవ కేంద్రాన్ని ...

Read More »

మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభం

డిచ్‌పల్లి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ తాండా దోన్‌చెరువును మిషన్‌ కాకతీయలో భాగంగా శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ దత్తత తీసుకొని పోలీసు డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో దోన్‌చెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని, ఇతర అదికారులకు గిరిజనులు వారి సంప్రదాయం ప్రకారం నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. భూమిపూజ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ చెరువు జాతీయరహదారికి పక్కన ఉండడం వల్ల దీన్ని తమ ఆధ్వర్యంలో చాలా చక్కగా ...

Read More »