Breaking News
rahul sabhaku siddam

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతు ఆత్మహత్యలు రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్ర – టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కామారెడ్డి, మే 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రభుత్వాల భరోసా లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతు భరోసా పాదయాత్రను చేపడుతున్నారని తెలిపారు. శుక్రవారం కామారెడ్డి సిఎస్‌ఐ గ్రౌండ్‌లో రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఈనెల 12న ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లోని మారుమూల ప్రాంతంలో రైతు భరోసా పాదయాత్రలో పాల్గొననున్నట్టు తెలిపారు. యాత్రను పార్టీలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలో మోడి, రాష్ట్రంలో కేసీఆర్‌ అధికారం చేపట్టిననుంచి రైతుల ప్రయోజనాలను విస్మరించారని అన్నారు. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 900 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికంతటికి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. రాహుల్‌గాంధీ యాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతుల ఆత్మహత్యలు అరికట్టాలనే ఉద్దేశంతో భరోసా యాత్ర చేపట్టారన్నారు. రాహుల్‌గాంధీ ఐదు గ్రామాల రైతులతో మాట్లాడతానని 15 కి.మీల పాదయాత్రలో పాల్గొంటారన్నారు. రైతుల సమస్యలు వింటారని తెలిపారు.

శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకోమాట, పూటకోమాట మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మంజూరు చేయిస్తే డిజైన్‌ మార్పు పేరిట ఇంతవరకు పూర్తిచేయకపోవడం రైతుల పట్ల కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్దిని చూపిస్తుందన్నారు. కామారెడ్డిలో చెరుకు రైతులతో రాహుల్‌గాంధీతో మాట్లాడించేలా చూడాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు.

సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధి బట్టి విక్రమార్క, కరీంనగర్‌ డిసిసి అధ్యక్షులు మృత్యుంజయ, నిజామాబాద్‌ డిసిసి అధ్యక్షులు తాహెర్‌ బిన్‌ హందాన్‌, మాజీ ఎంపి సురేశ్‌ షెట్కార్‌, జడ్పిటిసి నిమ్మ మోహన్‌రెడ్డి, మాచారెడ్డి ఎంపిపి నర్సింగ్‌రావు, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, నాయకులు సురేందర్‌, జమునా రాథోడ్‌, మామిండ్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article