Breaking News

Daily Archives: May 10, 2015

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

  కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భారత్‌ రోడ్డులో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రోగులు అధిక సంఖ్యలో హాజరై శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జీవ్‌ ఆయుర్వేద పాలీ క్లినిక్‌ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. ఇందులో డయాబెటిస్‌, అధిక బరువు, కిడ్నీలో రాళ్లు, బిపి, తదితర వ్యాదులున్న రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.

Read More »

వికలాంగ క్రీడాకారుడికి సన్మానం

  కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన వికలాంగ క్రికెట్‌ క్రీడాకారుడు రియాజ్‌ను ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సన్మానించారు. రియాజ్‌ చిన్నప్పటినుంచే క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వికలాంగుడైనప్పటికి వికలాంగుల క్రికెట్‌ టీంలో స్థానం సంపాదించాడు. రియాజ్‌ జిల్లాకు చెందిన క్రీడాకారుడు కావడం గర్వకారణమని ఎమ్మెల్యే ప్రశంసించారు. రియాజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు రాణించాలని అన్నారు. రియాజ్‌ మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆశించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరిసుష్మ, వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ ...

Read More »

పయ్య తిరగలే పైసా రాలే

  కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం 5వ రోజుకు చేరుకుంది. ఆర్టీసి పయ్య తిరగకపోవడంతో ఆదాయానికి పైసా రాలేదు. ఐదురోజులుగా బస్సులు డిపోకే పరిమితం కావడంతో ఆర్టీసి ఆదాయానికి భారీగా గండిపడింది. ఆర్టీసి సమ్మె కారణంగా ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి రెట్టింపు చార్జీలు చెల్లించి మరీ ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసి కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ధర్నా, రాస్తారోకో, వివిధ రకాలుగా ...

Read More »

స్వచ్ఛభారత్‌-స్వచ్ఛ తెలంగాణే లక్ష్యం

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛభారత్‌-స్వచ్ఛ తెలంగాణే బంగారు తెలంగాణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో ఆదివారం స్వచ్ఛతెలంగాణ- స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే ప్రసంగించారు. బంగారు తెలంగాణే ధ్యేయంగా సిఎం కేసీఆర్‌ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. వృద్దులకు, వికలాంగులకు పింఛన్లు, బీడీ కార్మికులకు జీవనభృతి, నిరుపేదలైన లబ్దిదారులకు రెండు పడకగదుల ...

Read More »

రైతు ఆత్మహత్యలన్ని సర్కారీ హత్యలే

  వైకాపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు అధికమయ్యాయని, వీటిని రైతు ఆత్మహత్యలు అనడం కన్నా సర్కారీ హత్యలు అనడమే సబబని వైకాపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఆదివారం రైతుదీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు బంగారు తెలంగాణ సాధిస్తానని చెప్పిన కేసీఆర్‌ తన ఇంట్లో వ్యక్తులకు మంత్రి పదవులు ...

Read More »

27వ రోజు కారోబార్ల సమ్మె

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27 రోజులు గడుస్తున్నా గ్రామ పంచాయతీ కారోబార్లు చేపట్టిన నిరవధిక సమ్మెను అధికారులు, నాయకులు,ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా అధ్యక్షులు ఆర్‌.శ్యాం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో పనిచేసే కాంట్రాక్టు కారోబార్లు, సఫాయి కార్మికులు, వాటర్‌మెన్‌లు, ఎలక్ట్రీషియన్‌, అటెండర్ల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె 27వ రోజుకు చేరుకుందన్నారు. సంబంధిత మంత్రిగాని, కమీషనర్‌ గాని స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఉందా లేదా అనే అనుమానం కలుగుతుందని ...

Read More »

5వ రోజు ఆర్టీసి కార్మికుల వంటా వార్పు

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికుల సమ్మె నానాటికి తీవ్రమవుతోంది. కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మె చేస్తుండడంతో ఆర్టీసిపై పెనుభారం పడుతుంది. సమ్మె విఫలం చేయడానికి యాజమాన్యం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడమే కాక ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అయితే సంస్థ ఉన్నతాధికారులు మొండి వైఖరి అవలంబిస్తూ ఎలాంటి లాభాలు లేకున్నా 150 ప్రయివేటు బస్సులను, 40 ఆర్టీసి బస్సులను నడిపించినా ఫలితం శూన్యమైంది. సమ్మె ...

Read More »

12వ సాయంత్రం కల్లా ఆధార్‌ నివేదికలు పూర్తిచేయాలి

  – కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ బూత్‌లెవల్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదివారం కలెక్టర్‌ నగరంలోని శంకర్‌భవన్‌, ఐటిఐ, మాణిక్‌భవన్‌, పద్మశాలి వసతి గృహం, అలాగే ఎంపిడివో కార్యాలయంలోని 76,77,88,89,95,96,97,98, పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న స్పెషల్‌ క్యాంపు శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా బిఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. ఆధార్‌నెంబర్లు, మొబైల్‌ నెంబర్లు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ...

Read More »