Breaking News

Daily Archives: May 11, 2015

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమీషనర్ గా ఎన్నికైన శ్రీమతి కల్వకుంట్ల కవిత

11- మే-2015 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమీషనర్ గా ఎన్నికైన శ్రీమతి కల్వకుంట్ల కవిత (ఎంపీ, నిజామాబాద్) గారు నేడు ప్రమాణ స్వీకారం చేసారు.  హైదరాబాదులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి మరియు విద్యాశాఖామాత్యులు శ్రీ కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న శ్రీ కేపీ మిశ్రా గారు శ్రీమతి కవిత గారిచే ...

Read More »

నేటి పద్యం

  చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు మేలు వచ్చేనేని మెచ్చుదన్ను చేటు మేలు తలప జేసిన కర్మముల్‌ విశ్వదాభిరామ వినురవేమ భావం : ఏదైనా కష్టం వచ్చినప్పుడు దైవాన్ని తిడతారు. తమకు మేలు జరిగినప్పుడు తమ ప్రతిభను మెచ్చుకుంటారు. ఏమైనా జరగడం, జరగకపోవడం మనమీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ప్రయత్నంలోనే లోపం ఉందని తెలుసుకోలేక దేవుడిని తిడుతుంటారు. చెడిపోయిన పనికి బాధ్యత మనదేనని గ్రహిస్తే మనలో ఆలోచన పెరుగుతుందంటారు వేమన.

Read More »

గ్రాండ్‌ మోడల్‌ ఎంసెట్‌ టెస్టు

  తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన ఆధ్వర్యంలో… నిజామాబాద్‌ అర్బన్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన ఆధ్వర్యంలో సోమవారం గ్రాండ్‌మోడల్‌ ఎంసెట్‌ టెస్టు నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి నిజామాబాద్‌ డిఎస్పీ ఆనంద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యావకాశాలు బాగా పెరిగిపోయాయని, దానికి తగినట్టుగా పోటీ కూడా ఎక్కువగానే ఉందని అన్నారు. విద్యార్థులు శ్రద్దతో శ్రమిస్తే గాని లక్ష్యాన్ని చేరుకోలేమన్నారు. ఈ ...

Read More »

నిజామాబాద్‌లో సమ్మె ఉధృతం

  – పోలీసుల రక్షణ మధ్య నడిచిన బస్సులు -ధర్నాలో ఆందోళనతో నిరసన తెలిపిన ఆర్టీసి కార్మికులు నిజామాబాద్‌ అర్బన్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోజు తెలంగాణ పోరాటంలో లాఠీదెబ్బలు తిన్న ఆర్టీసి కార్మికులు ఈరోజు పిఆర్‌సి అడిగినందుకు మళ్ళీ లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది. అదే పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసి పిడిగుద్దులతో, బూతులు తిడుతూ కార్మికులను పోలీసు స్టేషన్‌కు జీపులో తరలించారు. ఆరోజు లాఠీదెబ్బలు.. ఈ రోజు లాఠీదెబ్బలు కొట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్‌ ...

Read More »

ఆర్టీసి కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికులు గత ఆరురోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా ఎయిర్‌ బస్‌ డ్రైవర్స్‌ యూనియన్‌, సిఐటియు జిల్లా కమిటీ ఆద్వర్యంలో స్తానిక బస్టాండ్‌లో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలను 1వ డిపో సిఐ ఆనంద్‌, సాయన్నలు పూలదండలువేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసి ఎయిర్‌ అద్దె బస్సు డ్రైవర్స్‌ యూనియన్‌, సిఐటియు అధ్యక్షులు మల్యాల గోవర్ధన్‌, ఉపాధ్యక్షులు సి.హెచ్‌.రమేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసి రోజుకు ...

Read More »

తెవివి బ్యాక్‌లాగ్‌ పరీక్షలు వాయిదా

  డిచ్‌పల్లి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మే 12వ తేదీ మంగళవారం నుంచి మొదలు కావాల్సిన బ్యాక్‌లాగ్‌ పరీక్షలు మే 15వ తేదీ శుక్రవారం నుంచి మొదలవుతాయి. ఆర్టీసి సమ్మె దృస్ట్యా విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాల్సిందిగా రిజిస్ట్రార్‌ తెలిపారు.

Read More »

గ్రంథాలయ భవన నిర్మాణం పనులు వేగవంతం చేయండి – రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మొత్తం 4.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన గ్రంథాలయ భవన నిర్మాణం పనులు వేగం పెంచాలని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రిజిస్ట్రార్‌ గ్రంథాలయ నిర్మాణ పనులను తనికీ చేశారు. జూన్‌లో మొదటి వారంలో భవన ప్రారంభ కార్యక్రమం అనుకుంటున్నందున, భవన నిర్మాణ పనులను మంచి క్వాలిటీతో, త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. లైబ్రరీ వరకు సిసిరోడ్డు పార్కింగ్‌ షెడ్‌ ...

Read More »

డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి

  డిచ్‌పల్లి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో ఓ యువకుని రహదారి మింగేసింది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే డిచ్‌పల్లి మండలం ఖిల్లాడిచ్‌పల్లిగ్రామానికి చెందిన ఒడ్డెం శ్రావణ్‌ (17), వారాల ప్రవీణ్‌ (22), నిజామాబాద్‌కు చెందిన ధన్‌రాజ్‌, ముగ్గురు కలిసి సోమవారం ఉదయం బైక్‌పై స్నేహితుడి వివాహం ఉండడంతో భిక్కనూరు మండలం పొందుర్తి గ్రామానికి వెళ్ళారు. శుభకార్యం పూర్తిచేసుకొని తిరిగి వస్తుండగా టేక్రియాల్‌ వద్ద ప్రమాదవశాత్తు ...

Read More »

పాతబస్తీ వీధి పోరాటం….యువకుడి బలి

(11 May) బెట్టింగ్ ఫైట్‌లో యువకుడి బలి పిడిగుద్దులే ప్రాణం తీసాయా! గల్లీ గల్లీలోఇలాంటి దృశ్యాలు ఎన్నో పట్టించుకోని పోలీసులు నేతల జోక్యంతో నమోదు కాని కేసులు చాంద్రాయణగుట్ట, మే 10: యువకుల సరదా, వీధి పోరాటాలు యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన పాతబస్త్తీలోని మీర్‌చౌక్ పరిధిలో చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య జరిగిన సరదా స్ట్రీట్ ఫైట్‌లో నబీల్ అనే యువకుడు గత ఐదు రోజుల క్రితం మృతి చెందిన సంఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన మీర్ చౌక్ ...

Read More »

కొరటాల శివ తో ఎన్టీఆర్.?

(11 May) మిర్చి చిత్రం తో ఒక్కసారిగా పెద్ద డైరెక్టర్స్ లిస్టు చేరిన దర్శకుడు ‘కొరటాల శివ’. ప్రస్తుతం మహేష్ బాబు తో శ్రీమంతుడు అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల చివరి వారంలో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని జూన్ లో రిలీజ్ కాబోతుంది. అప్పుడే కొరటాల తదుపరి చిత్రం గురించి చర్చలు మొదల్లయ్యాయి. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీమంతుడు తర్వాత ఎన్టీఆర్ తో ఈ దర్శకుడు ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ ...

Read More »

అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు హైకోర్టు తీర్పుతో ఉపశమనం

(11 May) చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టు తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. జయపై నమోదైన అభియోగాలన్నింటినీ కర్ణాటక హైకోర్టు కొట్టివేసి ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నా.. సుదీర్ఘ కాలం పాటు జరిగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసును ఒకసారి పరిశీలిద్దాం. * 1991 నుంచి 1996 జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అక్రమ ఆస్తులను కూడబెట్టిందంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పెషల్ కోర్టులో ...

Read More »

ప్రయాణికులపై చార్జీల భారం తప్పదా ?

(11 May) సమ్మెతో మరింత నష్టాల్లో ఆర్టీసీ సంస్థ నిజామాబాద్, మే 10: ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న ఆర్టీసీ సంస్థ, కార్మికుల సమ్మెతో మరింత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించాలని, 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీ నుండి రవాణా సంస్థ కార్మికులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించి సమ్మె బాటలో పయనిస్తున్నారు. పట్టువిడుపు ధోరణులకు ఆస్కారం లేకుండా అటు యాజమాన్యం, ఇటు కార్మిక సంఘాల నేతలు ఎవరికివారు తమతమ ...

Read More »