Breaking News

Daily Archives: May 12, 2015

7వ రోజుకు చేరిన ఆర్టీసి సమ్మె

  – రోడ్లెక్కని బస్సులు – ప్రయాణీకులకు తప్పని ఇక్కట్లు ఆర్మూర్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరింది. ఆర్టీసి బస్సులు రోడ్లెక్కకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఆర్మూర్‌ ఆర్టీసి డిపో ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. డిపో ఎదుట ఆందోళన చేపడుతున్న ఆర్టీసి కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఘర్షణ వాతావరణం ...

Read More »

ఏడుగురి పేకాటరాయుళ్ల అరెస్టు

  ఆర్మూర్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని యోగేశ్వర కాలనీకి చెందిన ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. పట్టణంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరంపై దాడిచేసి వారి వద్దనుంచి 12,170 రూపాయలు, పేకముక్కలను స్వాదీనం చేసుకున్నామన్నారు. పట్టణంలోగాని, మండలంలోగాని ఇంకా ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని, దగ్గర్లోని పోలీసుస్టేషన్లో తెలపాలని కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Read More »

ఆర్టీసి సమ్మె ఉధృతం – కామారెడ్డిలో బోనాలు, నిరసనలు

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. కార్మికులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం పట్టణంలో బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద పోతరాజు విన్యాసాలు చేశారు. బోనాలను ఉంచి రోడ్డుపై బతుకమ్మలు ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో సమ్మెను విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Read More »

రైతు భరోసా పాదయాత్ర గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న తలపెట్టిన ఛలో కామారెడ్డి కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను మంగళవారం కామారెడ్డిలో శాసనమండల విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతుభరోసా పాద యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 14న సాయంత్రం 6 గంటలకు కామారెడ్డిలోని సిఎస్‌ఐ మైదానంలో బహిరంగ సభ ఉంటుందని అన్నారు. రైతుల్లో స్ఫూర్తినింపి వారికి భరోసా ...

Read More »

కేసీఆర్‌ది నయవంచక పాలన

  – శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేసీఆర్‌ది నయవంచక పాలన అని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఈనెల 14న రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో కామారెడ్డికి వచ్చిన ఆయన ఆర్టీసి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ అధికారం చేపట్టిన నాటినుంచి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా మోసపూరిత పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. వాటర్‌గ్రిడ్‌, ...

Read More »

ఇన్‌చార్జి వైద్యాధికారిగా డాక్టర్‌ శుభాకర్‌ నియామకం

  భీమ్‌గల్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్‌చార్జి వైద్యాధికారిగా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామ వైద్యాధికారి డాక్టర్‌ శుబాకర్‌ను నియమిస్తూ డిడివో ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టి క్లస్టర్‌ వైద్యాధికారి డాక్టర్‌ మోహన్‌బాబుకు సమాచారమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ఉద్యోగులకు తన సహకారాన్ని అందిస్తూ విధి నిర్వహణలో ముందుకు పోతామన్నారు. డాక్టర్‌ సందీప్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

Read More »

మట్టి టిప్పర్లను బైపాస్‌వైపు మళ్ళించాలి

  భీమ్‌గల్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లో మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్‌లు పట్టణంలోని ప్రధాన రహదారిలో వెళుతుండడం వల్ల ప్రమాదాలు జరగడమే కాకుండా ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భీమ్‌గల్‌ వార్డు సభ్యుడు సి.హెచ్‌.గంగాధర్‌ అన్నారు. ఈ విషయం ఆయన భీమ్‌గల్‌ సిఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రధాన రహదారుల వెంబడి ఇళ్లు, వ్యాపార సముదాయాలు, స్కూళ్ళు ఉన్నందున అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. పైగా టిప్పర్లు ...

Read More »

డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల

  డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను తెవివి రిజిస్ట్రార్‌ ఆర్‌.లింబాద్రి మంగళవారం ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం 2015-16 విద్యాసంవత్సరానికి మొత్తం ప్రవేశాల ప్రక్రియను ఆగష్టు 31లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా పలితాలు తొందరగా వెలువడుతున్నందున డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పకడ్బందీగా క్రమపద్దతిలో నిర్వహించడానికి ఈ షెడ్యూల్‌ ప్రకటించినట్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, డిప్యూటి డైరెక్టర్‌ ఎం.మమత, పరీక్షల అదనపు ...

Read More »

ఒక్కో ఇంటికి రూ.ఐదు లక్షలు

(12 May) తెలంగాణలో పేదలకు నిర్మించే ఇంటికి రూ.ఐదు లక్షలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. పేదలపై ఒక్క రూపాయి భారం పడకుండా ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్లు, పురపాలిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ..నగరాలు, పట్టణాల్లో పేదలకు ఇళ్లు కట్టించే విషయంపై దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని 67 మున్సిపాల్టీల్లో జి+1, జి+2 పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని చెప్పారు. కేంద్ర పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ...

Read More »

హైదరాబాద్‌లో గూగుల్‌ క్యాంపస్‌రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం

(12 May) హైదరాబాద్‌: గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన అతిపెద్ద ప్రాంగణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మౌంటెన్‌వ్యూలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి గూగుల్‌ సంస్థ ఉపాధ్యక్షుడు డేవిడ్‌ రాడ్‌ క్లిప్‌, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ.వెయ్యికోట్ల పెట్టుబడితో రెండు మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్‌ ...

Read More »

About Us NizamabadNews.in is a community portal website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, business and community directory, real estate, and employment listings. Nizamabadnews.in concentrates on Telangana Gulf NRI news and other aspects of NRI ...

Read More »

క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి జూనియర్‌ ఎన్టీఆర్‌ పరామర్శ

(12 May) కూకట్‌పల్లి, హైదరాబాద్‌: వరంగల్‌ శ్రీవర్ధన్నపేటకు చెందిన శివాజి, క్రాంతి కుమారి దంపతుల కుమార్తె పదేళ్ల శ్రీనిధి మూడేళ్లుగా బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ పాప జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని కావటంతో ఆమె జూనియర్‌ ఎన్టీఆర్‌ను చూడాలని కోరుకుంటున్నట్లు తల్లిదండ్రులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్‌ మంగళవారం ఆసుపత్రికి వచ్చి చిన్నారితో కొద్ది సేపు గడిపారు. ఆమెకు చాక్లెట్లు, బొమ్మ అందజేశారు. పాప ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని పాప తల్లిదండ్రులకు దైర్యం చెప్పారు. ఆర్థికంగా ఏదైనా ...

Read More »

దారి తప్పుతున్న యువతరం

(12 May) హైదరాబాద్, మే 11: మహానగరంలో యువత దారి తప్పుతోంది. ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ తమ పిల్లలను చదివించిన తల్లిదండ్రల కలలను కల్లలవుతున్నాయి. పిల్లలు ప్రయోజకులుగా సమాజానికి, దేశానికి సేవ చేసే వారిగా ఎదగాలని ఆకాంక్షించిన ఎంతో మంది తల్లిదండ్రులకు చివరకు కన్నీరే మిగిలుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోనే గాక, పలువురు సెలబ్రిటీలకు చెందిన పిల్లలు కూడా ప్రాణాంతక క్రీడలకు అలవాటు పడుతున్నారు. పోలీసుల నిఘా లోపం కారణంగా పాతబస్తీతో పాటు న్యూ సిటీలోని పలు ప్రాంతాలు, శివారుల్లో కూడా బైక్, ...

Read More »

ఢిల్లీలో రెండోసారి భూప్రకంపనలు

(12 May) న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెండోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఇవాళ మధ్యాహ్నం 1.11 గంటలకు మరోసారి భూమి కంపించింది. నేపాల్, చైనా సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 7.4తీవ్రత ప్రభావంతో భూమి మరోసారి కంపించింది. భూకంప ప్రభావంతో ఢిల్లీ సెక్రటేరియట్ ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రభావంతో దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయవాడ, గొల్లపూడి, నర్సాపురం, కాకినాడ, గాజువాక, ఏలూరు,రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఆప్ఘనిస్తాన్‌లో 4.7 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. ...

Read More »

ఉత్తరభారతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదు

(12 May) న్యూఢిల్లీ : నేపాల్ లో పుట్టిన భూకంపం మరోసారి ఉత్తర భారత దేశాన్ని కూడా చిగురుటాకులా వణికించింది. పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావాన్ని ప్రజలు స్పష్టంగా చూశారు. మూడో అంతస్థులో ఉండి పని చేసుకుంటున్న తాము ఉన్నట్టుండి అటూ ఇటూ ఊగిపోయామని, ఏం జరిగిందో అర్థమయ్యేలోపే భూకంపం అన్నారని దాంతో వెంటనే కిందకు పరుగులు తీశామని ఢిల్లీకి చెందిన ఓ గృహిణి తెలిపారు. తాను పాఠం చెబుతుండగా ఓ పిల్లాడు ఉన్నట్టుండి భూకంపం వచ్చిందన్నాడని, ముందు ఏదో జోక్ వేశాడనుకుంటే ఈలోపు బల్లలు ...

Read More »

సౌదీ కష్టాలు అంతా ఇంతా కాదు

సౌదీ కష్టాలు అంతా ఇంతా కాదు…నాలుగు డబ్బులు సంపాదించుకొని వచ్చి భార్య పిల్లలను పోషించుకుందామని సౌదీకి వెళ్లిన యువత పరిస్థితి దయనీయంగా మారుతుంది. వీసా గడువు పూర్తి కావడంతో వారు ఉండే గదినుంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. సౌదీ వారు యువకులతో వెట్టిచాకిరి చేయించుకొని సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. నెలకు కేవలం 300 రూపాయలు ఇచ్చి సరిపుచ్చుకుంటున్నారు. ఈ డబ్బు తిండికి కూడా సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, ...

Read More »

రేప్‌ను ప్రతిఘటించిన ఆంటీ‌

-ఇద్దరు పిల్లలను కాల్చేసిన కామాంధుడు (12 May) రాయపూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఓ కామాంధుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ అత్యాచార యత్నాన్ని అడ్డుకుందనే కోపంతో ఇద్దరు పిల్లలను అతను అగ్నికి ఆహుతి చేశాడు. ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం – ఖాప్రీ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళకు నెల రోజుల క్రితం పెళ్లయింది. దీంతో ఆమె గుసిద్ గ్రామంలోని తన ఆడపడుచు ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారంనాడు ...

Read More »

కోల్‌కత లోకల్‌ రైలులో ఘర్షణబాంబు దాడిలో 25మందికి గాయాలు

(12 May)కోల్‌కత : కోల్‌కతలోని లోకల్‌ రైలులో షెల్దా-కృష్ణానగర్‌ మార్గంలో ఈ రోజు తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ అనంతరం పరస్పరం నాటు బాంబులు విసురుకోవడంతో 25మందికి తీవ్ర గాయాలయ్యాయి.     గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఆర్జీకర్‌ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు టిటాగఢ్‌ స్టేషన్‌ దాటగానే ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన అనంతరం నిందితులు ...

Read More »