Breaking News

Daily Archives: May 22, 2015

రాయితీపై జింక్‌ సల్ఫైట్‌, వేప నూనె, జీలుగ పంపిణీ

  ఆర్మూర్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల రైతులకు 50 శాతం రాయితీపై రాయితీపై జింక్‌ సల్ఫైట్‌, వేప నూనె, జీలుగ శుక్రవారం పంపిణీ చేశారు. రైతులు తమ ఒరిజినల్‌ పట్టా పాసుపుస్తకాలను తీసుకొని వచ్చి వ్యవసాయ కేంద్రం వద్ద అనుమతి పొందిన వారికి వాటిని పంపిణీ చేశారు.

Read More »

ఆవిర్భావ సంబరాలకు సర్వం సిద్ధం

  ఆర్మూర్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్‌ 2వ తేదీ నుంచి సంవత్సరం పూర్తవుతుంది. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలను జూన్‌ 1 నుంచి 7వ తేదీవరకు ఘనంగా నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్మూర్‌ పట్టణంలో సైతం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహిస్తామని మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మాట్లాడుతూ వివిద రంగాల్లో విశేష కృషి, ...

Read More »

నలుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

  ఆర్మూర్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. పెర్కిట్‌ గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరంపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనుంచి 6010 రూపాయలు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు సిఐ చెప్పారు.

Read More »

జూన్‌ 5 నుంచి ఛలో ఎస్సీ కార్పోరేషన్‌…. చెన్నయ్య, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు

నిజామాబాద్‌, మే 22 : తెలంగాణ రాష్ట్రంలో మాలలకు ప్రభుత్వం తీరాని నష్టం చేస్తుందని, ప్రధానంగా ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పీడమర్తి రవి మాల, మాదిగ వివక్షతతో మాలలకు తీరాని నష్టం చేస్తున్నరని, అందుకే జూన్‌ 5 నుంచి ఛలో ఎస్సీ కార్పోరేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టనుఃన్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళ గర్జన పేరుతో ప్రభుత్వాన్ని మంద కృష్ణ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నరని, ...

Read More »

ఈయేడు వైద్య సీట్లకు ఎంసిఐ గ్రీన్‌సిగ్నల్‌

నిజామాబాద్‌, మే 22 : 2015-16 సంవత్సరానికి నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలకు వంద వైద్య సీట్లను యథావిధిగా కొనసాగించాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2014-15 సంవత్సరంలో వైద్య విద్యకు రాష్ట్రంలో 250 సీట్లను ఎంసిఐ కెటాయించింది. ఇందులో వంద సీట్లకు నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలకు అనుమతి ఇచ్చింది. కళశాలలోని మౌలిక సదుపాయాలు కల్పించడడానికి ప్రత్యేకంగా నిధులు ఇతర ఆంశాలపై గతంలో ఎంసిఐ బృందం పర్యటించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈయేడు కూడా అనుమతిని మంజూరి ...

Read More »

25, 26 పంట నష్టంపై జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

నిజామాబాద్‌, మే 22 : నిజామాబాద్‌ జిల్లాలో పంట నష్టంపై అంచనా వేసేందుకు రెండు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలు, వడగళ్ల వానలతో తీవ్రమైన పంట నష్టం జరిగింది. దీనిపై ఇటు రాష్ట్రం అటు కేంద్ర ప్రభుత్వానికి రైతులు ప్రజా సంఘాలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసాయి. ఈ పంట నష్టంపై విచారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందాలు తెలంగాణ జిల్లాలో ఈనెల 25, 26 తేదిలలో పర్యటించనున్నాయి. ప్రధానంగా నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌, ...

Read More »

టిడిపిలో ముసలం… కాంగ్రెస్‌లో మౌనం… ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం

జిల్లాలో రాజకీయ నాయకుల తీరు (వై.సంజీవయ్య – నిజామాబాద్‌ ప్రతినిధి) : ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపేడుతున్నాయి. ఒకవైపు టీడిపీలో ముసలం తయారు కాగా, కాగ్రెస్‌లోని నేతలు మౌనవ్రతం చేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎవరి మార్గాన వారు పయనిస్తున్నారు. చివరకు ఎవరి పయనం ఫలిస్తుందో వేచి చూడాల్సిందే కదా… ఇది అయా పార్టీ తీరు… మౌనమే నీ భాష.. కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ టికెట్‌ నిజామాబాద్‌కు చెందిన టీపీససీ మహిళ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల ...

Read More »

నకిలీ టీసీ అరెస్టు

నిజామాబాద్‌ క్రైం, మే 22 : రైళ్లలో తిరుగుతూ టిసిని అని చెప్పి ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రైల్వే జీఆర్‌పి పోలీసులు అరెస్టు చేసారు. ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ గత కొన్ని రోజులుగా నకిలీ టీసీగా అవతారం వేసుకొని హైదరాబాద్‌, నాందేడ్‌ మధ్య తిరిగే రైళ్లలో ప్రయాణికులను టిసినని చెప్పి డబ్బులు వసూలు చేయడం, పోలీసుగా బెదిరింపులకు దిగడం చేసాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. రైల్వే డిఎస్పీ ...

Read More »

టిడిపి కార్యాలయం ధ్వంసం … అరికెలకు వర్గీయుల వీరంగం…

ఎమ్మెల్సీకి అవకాశం రానందుకే నిజామాబాద్‌, మే 22 : మాజీ ఎమ్మెల్సీ, ఇటీవలే టిడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అరికెల నర్సారెడ్డికి ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వనందుకు పార్టీ కార్యకర్తలు టిడిపి కార్యాలయాన్ని ధ్వంసం చేసారు. పార్టీని కష్టాకాలంలో కూడా దగ్గర ఉండి కాపాడుకుంటు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశనిర్థేశం చేస్తున్న నాయకులకు అవకాశం ఇవ్వకుండా ఇతరులకు చాయిస్‌ ఇవ్వడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేసారు. టిడిపి పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పార్టీ నగర ...

Read More »

జూన్‌6న లండన్‌కు కవిత… రాష్ట్ర అవతరణ వేడుకలను హాజరు

నిజామాబాద్‌, మే 22 : విదేశాల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు హాజరైందుకు నిజామాబాద్‌ ఎంపీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు కవిత తెలంగాణ వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు జూన్‌ 5న అబూదాబిలో, 6న లండన్‌లో వేడుకలకు హాజరు అవుతారు. అలాగే హైదరాబాద్‌, నిజామాబాద్‌లో ప్రభుత్వం నిర్వమించే వేడుకలలోనూ పాల్గొననున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అవతరణ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More »

ఎమ్మెల్సీ పదవికి నామినేషన్‌ వేసిన ఆకుల

నిజామాబాద్‌, మే 22 : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆకుల లలిత నామినేషన్‌ వేసారు. గురువారం నామినేషన్‌ దాఖలు చేసిన ఆమెకు మద్దతు తెలిపిందేకు జిల్లా నుంచి పలువురు కాంగ్రెస్‌ నాయకులు తరలి వెళ్లారు. లలితతో పాటు టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సీఎల్‌సీ నాయకులు జానారెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబులున్నారు. జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌, మాజీ విప్‌ అనిల్‌, పిసిసి ...

Read More »