Breaking News

Daily Archives: May 23, 2015

జీవనభృతి కోసం లొల్లి… లొల్లి…

  – సిబ్బందిని నిలదీసిన బీడీ కార్మికులు కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవనభృతి కోసం కామారెడ్డి పట్టణంలో ప్రతీరోజు లొల్లి లొల్లి జరుగుతుంది. అర్హులైన లబ్దిదారులు కార్యాలయం చుట్టు రోజు చక్కర్లు కొట్టినా తమకు జీవనభృతి ఇవ్వడం లేదంటూ ఆందోళన చేపడుతున్నారు. శనివారం కామారెడ్డి పోస్టాఫీసు కార్యాలయం వద్ద జీవనభృతి కోసం బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా తమకు ఆధార్‌ నెంబరు లేదని, ఎస్‌కెఎస్‌లో పేరులేదని, ఏదో ఒక సాకు చెప్పి తిప్పి ...

Read More »

వడదెబ్బతో వృద్ధుడి మృతి

  కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భానుడి ప్రతాపానికి మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండలు తీవ్రంగా మండిపోతుండడంతో ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని 18వ వార్డుకు చెందిన అన్నేపల్లి చిన్నబూదయ్య (55) అనేవృద్దుడు శనివారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పుల కారణంగానే బూదయ్య మృతి చెందినట్టు కాలనీవాసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఇంటినుంచి బయటకు వెళ్ళగా స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతుల కళ్ళలో ఆనందం

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల కళ్ళలో ఆనందం చూసేందుకే మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రారంభించినట్టు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో శనివారం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలోని చెరువులు నిరాదరణకు గురై వ్యవసాయం దిగుబడులు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల్లోని సారవంతమైన ...

Read More »

బ్యాక్‌లాగ్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న బ్యాక్‌లాగ్‌, ఇంప్రుమెంట్‌ పరీక్షా కేంద్రాన్ని శనివారం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తనికీ చేశారు. పరీక్షా కేంద్రంలోని వివిధ గదులను తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య ఉన్నారు. పరీక్షలు జరుగుతున్న తీరుపట్ల రిజిస్ట్రార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎండలు బాగా విపరీతంగా ఉన్నందున విద్యార్తులకు మంచినీరు అందించడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం నాటి పరీక్షలకు 309 ...

Read More »

తీగలు కలిశాయి… టివిలు కాలిపోయాయి…

  ఆర్మూర్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని రాజారాంనగర్‌ కాలనీ 5వ వార్డులో శనివారం రెండు విద్యుత్‌ తీగలు కలిసి సుమారు 50 టివిలతోపాటు, కూలర్లు, ఫ్యాన్లు, లైట్లు కాలిపోయాయి. తీవ్రమైన గాలికి రెండు విద్యుత్‌ తీగలు తగులుకోవడంతో ఈ సంఘటన జరిగినట్టు కాలనీవాసులు చెబుతున్నారు. అతుక్కున తీగలను విద్యుత్‌ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని వేరుచేశారు. బాధిత కుటుంబాలు తమ కాలిన పరికరాలతో గోడును వెల్లబుచ్చుకున్నారు.  

Read More »

తెయు పరిపాలనా భవనంలో వాటర్‌ ప్లాంట్‌కు ఎస్‌బిఐ చేయూత

  డిచ్‌పల్లి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో రక్షిత, శుద్ది చేసిన మంచినీరు అందించడానికి ఏర్పాటు చేయనున్న వాటర్‌ ప్యూరిఫికేషన్‌ ప్లాంటు కోసం ఎస్‌బిఐ రూ. 1,55,000 చెక్కును శనివారం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రికి ఎస్‌బిఐ, తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్‌ మేనేజర్‌ పి.స్వర్ణలత అందించారు. వాటర్‌ ప్యూరిఫికేషన్‌ ప్లాంటుకు ఎస్‌బిఐ ఆర్థిక సహాయం చేయడం పట్ల రిజిస్ట్రార్‌ బ్యాంకు యాజమాన్యానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారుచేసిన ఆర్థిక సహాయానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ...

Read More »

జూన్‌ మొదటి వారం నాటికి సెంట్రల్‌ లైబ్రరీ పనులు పూర్తి కావాలి

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ నిర్మాణంలో వున్న భవనముల గురించి సిపిడబ్ల్యుడి ఇంజనీర్లతో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ సెంట్రల్‌ లైబ్రరీ భవన నిర్మాణ పనులు జూన్‌ మొదట వారంకల్లాపూర్తిచేసి అప్పగించాలని ఇంజనీర్లకు సూచించారు. అలాగేప్రహరీ గోడ నిర్మాణ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. భిక్కనూరు క్యాంపస్‌ ప్రహరీగోడ, లా కాలేజ్‌ నుంచి లైబ్రరీ వరకు ...

Read More »

తెయు డిగ్రీ రివాల్యుయేషన్‌ ఫీజు చెల్లింపు చివరితేది మే 30

  డిచ్‌పల్లి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెయు డిగ్రీ పరీక్ష ఫలితాలకు సంబంధించి సందేహాలు ఉన్నవారు రివాల్యుయేషన్‌ లేదా రీకౌంటింగ్‌ కోరడానికి మే 30 చివరితేదీగా నిర్ణయించారు. రీవాల్యుయేషన్‌కై ప్రతీ పేపర్‌కి రూ. 500 చొప్పున, రీకౌంటింగ్‌ కై ప్రతి పేపర్‌కు రూ. 300 చొప్పున అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డాక్టర్‌ పాత నాగరాజు పేర్కొన్నారు.

Read More »

తెయు అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్ష ఫీజు చివరి తేది మే 30

  డిచ్‌పల్లి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెయు డిగ్రీ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్ష కోసం పీజు చెల్లింపు చివరి తేది ఈనెల 30 అని పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డా|| పాత నాగరాజు తెలిపారు. రూ. 100 అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపుతేది జూన్‌ 30 వరకు ఉందని, అపరాధ రుసుములేకుండా ఫీజు మే 30 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు జూన్‌ / జూలై మాసంలో నిర్వహించే అవకాశముందన్నారు. మరిన్ని వివరాలకు తెలంగాణ ...

Read More »

108 కు సుస్తీ

  ఆర్మూర్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను నిలిపే 108 వాహనానికి సుస్తీ చేసింది. ఆర్మూర్‌ పట్టణంలోని 108 వాహనానికి మరమ్మతులు చేయకపోవడంతో మొరాయించింది. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలు నిలిపే వాహనానికే సుస్తీ చేస్తే ప్రమాదంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో 108 వాహనం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ దానికి మరమ్మతులు చేయకపోవడంతో మాటి మాటికి మొరాయిస్తుంది. శనివారం 108 వాహనాన్ని తోస్తుండడంతో నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ కెమెరాకు చిక్కింది. ఇకనైనా అధికారులు ...

Read More »

భూగర్భజలాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం – హరితహారం ద్వారా పచ్చదనం – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ కాకతీయ పనుల్లో ముందుగా చెరువు తూములను, అలుగులను పూర్తిచేసి నీటి చుక్క వృధా కాకుండా చెరువులను నీటితో నింపి భూగర్భజలాలను పెంపొందించాలని, విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని సాధించాలన్నదే ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పనులను త్వరితగతిన పూర్తి చేసి భూగర్భ ...

Read More »

చెరువుల పూడికతీత వేగవంతం చేయాలి – వీడియో కాన్ఫరెన్సులో మంత్రి హరీష్‌రావు

నిజామాబాద్‌ అర్బన్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ కాకతీయ కింద ప్రారంభించిన చెరువుల మరమ్మతులు, పూడికతీత పనులు వచ్చే రెండు వారాల్లోగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్‌లు, ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లకు రాష్ట్ర ఇరిగేషన్‌, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌ సచివాలయం నుంచి ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాల వారిగా ప్రగతిని సమీక్షించారు. జూన్‌ నెల మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని నీళ్ళు వస్తే ...

Read More »

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లకై గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆ పార్టీ డివిజన్‌ నాయకుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి లకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, బిసిలకు సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగానికి విధి విధానాలు రూపొందించాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆద్వర్యంలో ఈనెల 20న ప్రచార ...

Read More »

డిగ్రీ ఫలితాలు విడుదల… బాలికలే టాప్‌

డిచ్‌పల్లి, మే 23 : తెలంగాణ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ ఫలితాలను శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ మల్లేష్‌, టీయూ రిజిస్ట్రార్‌ లింబాద్రి చేతుల మీదుగా విడుదల చేసారు. డీగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో 11 వేల 660 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3 వేల 820 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో బాలురలు 6 వేల 40 మందికి గానూ 1621 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. బాలికలు 5 వేల 620 మందికి ...

Read More »

తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

డిచ్‌పల్లి, మే 23 : పిల్లల పట్ల ముందుగా తల్లిదండ్రులకు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి, అందుకు తగ్గట్టుగానే కార్యచరణను సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లిలోని డిటిడిసి ట్రైజం సెంటర్‌లో డిఆర్‌డిఎ- ఐకెపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నెర్చుకున్న పనిని తప్పకుండా అచరణలో పెట్టాలని, దూర ప్రాంతాలకు వెళ్లి పని చేయడం వల్ల మరింత అవగాహన కలుగుతుందని ...

Read More »