Breaking News

Daily Archives: May 26, 2015

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిందే

  – సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం కాంట్రాక్టు కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకరణతో కాంట్రాక్టు విధానంలో కార్మిక వర్గం బద్రత లేని జీవితాలతో వెట్టిచాకిరికి బలవుతున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

అందరి సహకారంతో ట్రాఫిక్‌ సమస్య అధిగమిస్తాం

  – డిఎస్పీ భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్యగా మారిందని, వ్యాపారస్తులు, ప్రజలు, అధికారులు అందరి సహకారంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యను అధిగమిస్తామని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. ట్రాఫిక్‌ సమస్యపై కామారెడ్డి పట్టణంలోని లయన్స్‌ క్లబ్‌లో మంగళవారం సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జెపిఎన్‌ రోడ్డులోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రోడ్లలో ట్రాఫిక్‌కు సంబంధించి గతం నుంచి ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ. 6 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 33 వార్డుల్లోనూ ప్రగతి పనులు చేపడతామని, అన్ని వార్డులకు సమంగా నిధులు కేటాయించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక, నాయకులు చంద్రశేఖర్‌, ఇమ్రాన్‌, అక్బర్‌, లక్ష్మణ్‌, ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతుకు బంగారు భవిత

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి వెన్నెముక అయిన రైతుకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టిందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు మండలంలోని పొందుర్తి, రాజంపేట్‌, పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్తాపనలు చేశారు. అనంతరం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ ...

Read More »

జూన్‌ 5 వరకు రైతు అవగాహన సదస్సులు

  – ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకొని అధిక ప్రయోజనం పొందాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ రైతులకు సూచించారు. మంగళవారం మోర్తాడ్‌ మండలంలోని తడ్‌పాకల గ్రామంలో మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతిలో సాగు పద్ధతులను అవలంబించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ అనుబంధ అధికారుల నుంచి సలహాలు పొందాలన్నారు. రైతు అవగాహన ...

Read More »

జీవనభృతి పంపిణీ

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని మామిడిపల్లి, గోవింద్‌పేట్‌, పలు గ్రామాల్లో బీడీ కార్మికులకు 1000 రూపాయల భృతి మంగళవారం పంపిణీ చేశారు. ఉదయం నుంచే భృతి పంపిణీ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. వరుస క్రమంలో నిలబడి వారికిచ్చిన పాసు పుస్తకాలతో జీవనభృతి పొందారు. పంపిణీ అధికారులు అర్హులైన వారినుంచి బ్యాంకు పుస్తకాలు చూసి వేలిముద్రలు సేకరించి డబ్బులను అందజేశారు. మండుటెండలో సైతం పంపిణీ జరగడంతో చేసేదేం లేక వారు ...

Read More »

మహిళలకు అవగాహన సదస్సు

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు చైన్‌ స్నాచర్లతో అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రాజారాంనగర్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మహిళలకు చైన్‌ స్నాచింగ్‌ దొంగతనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ మహిళలకు దొంగల బారిన పడకుండా పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు దొంగల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దొంగలు ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్‌ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళలు ...

Read More »

స్వదేశానికి విచ్చేసిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అమెరికా పర్యటన ముగించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు స్వదేశానికి విచ్చేశారు. ఈ సందర్బంగా మంత్రి, ఎమ్మెల్యేలకు ఆర్మూర్‌ మునిసిపల్‌ ఇన్‌చార్జి యానాద్రి భాస్కర్‌తో పాటు మండల తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు.

Read More »

‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ ప్రారంభించిన కలెక్టర్‌

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులకు రైతు చైతన్య సదస్సులు వేదికలుగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి రైతు చైతన్య సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఈ సదస్సులు ఈనెల 26 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహిస్తున్నామని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి నూతన ...

Read More »