Breaking News

Daily Archives: May 27, 2015

కేంద్రం ఉద్యోగుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి

  ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంద్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే, టీజివోస్‌ రాష్ట్ర చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆంధ్రాలోని ఉద్యోగుల పరిస్థితి వరదలో చిక్కుకున్న పిల్లల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం విడిపోయి సంవత్సరం గడుస్తున్నా కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సంవత్సర కాలంలో కమలనాథన్‌ కమిటీ కేవలం 40 శాఖల వివరాలు మాత్రమే సేకరించిందని, మిగతా 60 శాతం ఎప్పుడు పూర్తిచేస్తారని ప్రశ్నించారు. ...

Read More »

హరితహారాన్ని విజయవంతం చేయాలి

  ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్‌ ఎంపిడివో ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. బుధవారం ఎంపిడివో కార్యాలయంలో ఇజిఎస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హరితహారంలో భాగంగా మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రైమరీ బెడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉన్న విత్తనాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మొక్కల నాటు ప్రక్రియ గురించి ...

Read More »

చెరువులోపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

  ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ కొటార్మూర్‌ గ్రామ చెరువులో పడి గుర్తు తెలియని మృత దేహం లభించినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ బుధవారం తెలిపారు. సిఐ కథనం ప్రకారం… గుర్తు తెలియని మృతదేహానికి 30 సంవత్సరాలు ఉండవచ్చని, ఒంటిపై పసుపురంగు చొక్కా, జీన్‌ ప్యాంటు ధరించి ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ వెల్లడించారు.

Read More »

ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు ఘన స్వాగతం

  ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదిలాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్న మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు ఆర్మూర్‌ తెరాస నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం రోడ్లు భవనాల అతిథి గృహంలో నాయకులు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై వారి గుండెల్లో ఎనలేని చోటును సిఎం కేసీఆర్‌ సంపాదించుకున్నారని ఆయన చెప్పారు. తెరాస పాలనలో రాష్ట్రం ...

Read More »

28,31 తేదీల్లో క్షౌరశాలలు బంద్‌

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రిలయన్స్‌, స్పానేచర్స్‌ తదితర పేర్లతో బహుళజాతి సంస్థలు జిల్లా కేంద్రంలో క్షౌరశాలలు ఏర్పాటు చేయబోతున్నాయని నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శ్రీనివాస్‌ అన్నారు. బహుళజాతి కంపెనీల ఏర్పాటుకు నిరసనగా ఈనెల 28,31 తేదీల్లో క్షౌరశాలలు మూసివేయనున్నట్టు ప్రకటించారు. నగరంలో బహులజాతి సంస్థలు పుట్టుకొస్తుండడంతో వృత్తికి అన్యాయం జరుగుతుందని, జీవనం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నివారించేందుకు సభ్యులతో కూడిన జేఏసి ఏర్పాటు చేశామని అన్నారు. 28వ ...

Read More »

28,29 తేదీల్లో ఏఐకెఎంఎస్‌ జిల్లా మహాసభలు

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలబారత రైతుకూలీ సంఘం జిల్లా 7వ మహాసభలను 28,29 తేదీల్లో సిరికొండ మండలంలో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రభాకర్‌ తెలిపారు. 28నమధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. ఇందులో తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వర్‌రావు వక్తలుగా హాజరవుతారన్నారు. అలాగే రెండోరోజు ఉదయం 10 గంటలకు గడ్కోల్‌ గురడికాపు కళ్యాణ మండపంలో జెండా ఆవిష్కరణ, ప్రతినిధుల సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ...

Read More »

జూన్‌ 3 నుంచి క్రీడాపోటీలు

  నిజామాబాద్‌ కల్చరల్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా జూన్‌ 3 నుంచి 5వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు డిఎస్‌డివో శర్మ తెలిపారు. గజిటెడ్‌, మినిస్ట్రియల్‌ స్టాఫ్‌, తెలంగాణ క్లాస్‌-ఫోర్త్‌, డ్రైవర్స్‌, టీచర్స్‌ అసోసియేషన్స్‌ వారికి పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జూన్‌ 3న ఆఫీసర్స్‌ క్లబ్‌లో షటిల్‌ బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, 4న డిఎస్‌ఎ మైదానంలో కబడ్డి, వాలీబాల్‌ పోటీలు, క్రికెట్‌ పోటీలు పోలీసు పరేడ్‌ మైదానంలో ఉంటాయని వివరించారు. ఆసక్తిగల ...

Read More »

జూన్‌ 1న జిల్లాకు కేంద్రమంత్రి రాక

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ జూన్‌ 1న జిల్లాకు విచ్చేస్తున్నట్టు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రి వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమవుతారని అన్నారు. ప్రధాని మోడి ఏడాదికాలంగా అవినీతి రహిత పాలన అందించారని, భారత్‌లో జరుగుతున్న అభివృద్దిని ప్రపంచం చూస్తుందని అన్నారు. ...

Read More »

ఆర్‌.కె. విద్యార్థులను సన్మానించిన తెవివి రిజిష్ట్రార్‌

  డిచ్‌పల్లి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో ఆర్‌కె డిగ్రీ & పిజి కళాశాల కామారెడ్డి విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ఒకటికాదు, రెండు కాదు సుమారు 25 విభిన్న పేపర్లలో 100/100 మార్కులు 126 మంది విద్యార్థిని విద్యార్థులు సాధించారు. బిఎస్‌సి మొదటి సంవత్సరంలో 99.7 శాతం మార్కులతో రేణుక యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే బికాం మొదటి సంవత్సరంలో జి.సుప్రియ 96 శాతం, బిఎలో 95 శాతం ...

Read More »

తెవివి రిజిష్ట్రార్‌చే వశిష్ట టాపర్స్‌కు సన్మానం

  డిచ్‌పల్లి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల్లో కామారెడ్డికి చెందిన వశిష్ట డిగ్రీ కళాశాల విద్యార్థిని ప్రణితి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇందుకుగాను 99.7 శాతం మార్కులు సాధించి రాష్ట్ర స్తాయిలో ప్రథమ స్థానం రావడం హర్షణీయమని, ఈ ఫలితం యూనివర్సిటీ చరిత్రలో మైలురాయి అని వర్సిటీ రిజిష్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ప్రణితి ఎంచుకున్న లక్ష్యం ఐఏఎస్‌ కావడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీవైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన పైజామహీన్‌ ...

Read More »

అ నలుగురు… మహారాణులు ఫోర్బ్స్‌లో మనవారి స్థానం

న్యూయార్క్‌ : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వంద మహిళల్లో మన దేశానికి చెందిన నలుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన 12వ వార్షిక జాబితాలో మనవాళ్లు ఉన్నారు. 30వ స్థానంలో ఎస్‌బిఐ చైర్‌ పర్సన్‌ అరుందతీ భట్టాచార్య, 35వ స్థానంలో ఐసిఐసిఐ బ్యాంకు ఎండీ చందాకొచ్చర్‌, 85వ స్థానంలో బయోకాన్‌ వ్యవస్తాపకులు కిరణ్‌ మంజూదార్‌ షా, 93వ స్థానంలో హెచ్‌టీ మిడియా ఛైర్‌ పర్సన్‌ శోభనా భర్తియాలకు స్థానం లభించింది. అలాగే భారత సంతతికి చెందిన 15వ స్థానంలో పెప్సీకో చైర్‌పర్సన్‌ ...

Read More »

హైదరాబాద్‌లో అద్దెకు కార్లు జూమ్‌ కార్లు రెడీ

హైదరాబాద్‌, మే 27 : హైదరాబాద్‌లో డ్రైవర్‌ లేకుండానే సొంతంగా నడుపుకోవడానికి జూమ్‌కార్లును అద్దెకు ఇవ్వడానికి అ కంపెనీ ఏర్పాట్లు చేసింది. బెంగళూర్‌కు చెందిన కంపెనీ సీఈవో జార్జ్‌మారన్‌ వివరాలను వెల్లడించారు. కార్లను కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా మోబైల్‌ యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఆరు పిక్‌ప్‌పాయింట్లలో సేవలను ప్రారంభించామని, ప్రధానంగా హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఈ ఏర్పాట్లు ఎక్కువగా చేయడం జరిగింది. ప్రస్తుతం 30 కార్లు ఉన్నాయని, తర్వాత వీటి సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. అద్దె గంటకు రూ.80 నుంచి రూ.140 వరకు ...

Read More »

జీవనభృతి పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్న బిపిఎం

  డిచ్‌పల్లి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో బీడీ కార్మికులకు జీవనభృతి పింఛన్లు మంజూరు అయిన వారికి పంపిణీ చేయకుండా పింఛన్‌ పుస్తకాలు పట్టుకొని పోస్టాఫీసుకు వెళ్ళిన లబ్దిదారులు, ఇప్పుడు నాకు సమయం లేదు, నా పైఅదికారి నాకు ఇంకా చెప్పలేదని పొంతన లేని సమాధానాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. లేదా ఇంటికి రండి సాయంత్రం వీలుంటే పింఛన్‌ పంపిణీ చేస్తా అంటూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నాడని జీవనభృతి లబ్దిదారులు ఆవేదన వ్యక్తం ...

Read More »

అమెరికాలో మనబడి స్నాతకోత్సవం

కాలిఫోర్నియా : తెలుగు కోర్సు మనబడిని పూర్తి చేసిన వారికి సిలికానాంధ్ర, పోట్టీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టాలను ప్రధానం చేసారు. 14 దేశాల్లో పుట్టి పెరుగుతున్న తెలుగు వారి పిల్లలకు మాతృభాషను నెర్పిచేందుకు ఈ కోర్సును ప్రవేశ పెట్టారు. వివిధ దేశాల్లో ఈ కోర్సుల్లో ఉత్తీర్ణులు అయిన 539 మందికి తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రోఫెసర్‌ కర్నాటి తోమసయ్య పట్టాలను ప్రధానం చేసారు. అమెరికాలో ఘనంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను తెలుగు వారంతా హాజరయ్యారు.

Read More »

సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సిద్దం అవుతున్న జాతీయ కార్మిక సంఘాలు

డిల్లీ, మే 27 : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఏకపక్ష కార్మిక సంస్కృరణలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు అన్ని కలిసి సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించి, అందుకు సన్నద్దం అవుతున్నాయి. బీఎంఎస్‌, ఐఎన్‌టియూసి, ఎఐటియూసి, హెచ్‌ఎంఎస్‌, సిఐటియూ, ఏఐయూటీలతో కలిపి మొత్తం 11 జాతీయ కార్మిక సంఘాలు ఐక్య సంఘటనగా ఏర్పాడి మంగళవారం సమావేశం ఏర్పాటు చేసాయి. కార్పోరేట్‌ వ్యవస్థ చెప్పు చెతుల్లో ఉండి పని చేస్తున్న నరేంద్ర మోదీ కార్మికుల జీవితాలను ప్రమాదంలో పడేసేలా చర్యలు చేస్తున్నరని ...

Read More »

టిఆర్‌ఎస్‌ నాయకుడిపై బీడీ కార్మికుల దాడి

మాచారెడ్డి, మే 27 : జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో టిఆర్‌ఎస్‌ నాయకుడిపై బీడీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. సీపిఐ, సీఐటియై ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్లా రోడ్డులో బీడీ కార్మికులు రాస్తారోకో చేస్తున్నారు. అయితే అక్కడే నాయకులు మాట్లాడుతూ కెసిఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. సిఎం ఇంట్లో మూడు మంత్రు పదవులు ఉందోచ్చుగాని ఒక్క ఇంట్లో ఇద్దరికి పెన్షన్‌లు ఉండకూడదా అని ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ నాయకుడు పైడాకుల రాములు జోక్యం చేసుకోని ప్రసంగానికి అడ్డు పడ్డాడు. దీంతో అగ్రహానికి ...

Read More »

28న తాగుబోతు రమేష్‌ వివాహాం సినీ ప్రముఖుల రాక

కామారెడ్డి, మే 27 : తాగుబోతు అనే పేరు ఇంటి పేరుగా మారిన నటుడు రమేష్‌. అంటే అంతటి తాగుబోతు నటనను మరింపించిన అ నటుడి వివాహాం నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలోని వరలక్ష్మి గార్డెన్‌లో ఈనెల 28న జరగనుంది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. ఈ నవ్వుల కిరిటీ బిక్కనూర్‌కు అల్లుడుగారు కాబోతున్నారు. బిక్కనూర్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చెందిన గోసు సత్యనారాయణ కుమార్తె స్వాతితో వివాహాం నిశ్చయమైంది. ఈ మేరకు ఈనెల 28న వివాహాం జరనుంది. జిల్లా ...

Read More »

జూన్‌ 1న గడ్కారీ రాక మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ

నిజామాబాద్‌ అర్బన్‌, మే 27 : నరేంద్రమోడీ ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా కేంద్ర పాలన తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లెందుకు జూన్‌ 1న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కారీ నిజామాబాద్‌కు రానున్నట్లు భాజపా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో అభివృద్ది కోసం నరేంద్ర మోదీ లక్ష్యంగా పని చేస్తున్నరని అన్నారు. పార్టీలనే పక్షపాతం లేకుండా అభివృద్ది లక్ష్యంగా దేశంలో బిజేపి పని చేస్తుందన్నారు. మోదీ ఏడాది పాలన విజయవంతం కావడంతో ...

Read More »

నగరంలో హైదరాబాద్‌వాసుల మృతి మృతిపై అనుమానాలు

నిజామాబాద్‌ క్రైం, మే 27 : నిజామాబాద్‌ నగరంలోని ఈద్‌గావ్‌ దర్గాకు మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన ఇద్దరు హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన యువకులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దర్గా వద్ద ఉన్న డ్యాంలో పడి మరణించడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ చంద్రయాన్‌గుట్టకు చెందిన గులాంనజీయుద్దిన్‌, అలియాస్‌ ఆశ్వాక్‌ బహదర్‌పురాకు చెందిన వాజీద్‌, ఫిర్‌దోస్‌, షాహెద్‌, పాషిమాం, ఖాలెద్‌, హీజీలు కలిసి నిజామాబాద్‌ జిల్లాలోని బడాపహాడ్‌ దర్గాకు ...

Read More »

జూన్‌ 3 నుంచి క్రీడోత్సవాలు

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, మే 27 : తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2 నుంచి 5 వరకు జిల్లాలోని ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ది అధికారి ఎం.ఎస్‌.ఎల్‌.ఎన్‌.శర్మ తెలిపారు. అన్ని స్థాయిలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ఉంటాయన్నారు. 3న షటీల్‌, టెబుల్‌ టెన్నిస్‌ – ఆఫిసర్స్‌ క్లబ్ల్‌లో…. 4న కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు 1 డిఎస్‌ఎ మినీ స్టేడియంలో… 4, 5న క్రికెట్‌ పోటీలు ఉంటాయని అన్నారు. ఈ పోటీల్లో ఉద్యోగ ...

Read More »