Breaking News

Daily Archives: May 30, 2015

మహిళతోదురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి ఒడ్డెర కాలనీలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ శనివారం తెలిపారు. సిఐ కథనం ప్రకారం… లావణ్య అనే మహిళ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి వద్ద ఉండగా ఇంటిపక్కనేగల వేముల సోమయ్య అనే వ్యక్తి లావణ్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. సోమయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ...

Read More »

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం

– మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్‌ పట్టణంలో ఆవిర్భావ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహిస్తామని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు, ప్రత్యేకాధికారి సమ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంరోజుల పాటు కొనసాగే ఈ వేడుకలు జూన్‌ 1 రాత్రి 8 గంటల నుంచి పట్టణంలోని జంబిహనుమాన్‌ మందిర ప్రాంగణంలో తెలంగాణ ధూం… ధాం.. కార్యక్రమం, రాత్రి 11.55 ...

Read More »

బిజెపిది అవినీతి రహిత పాలన

– రాహుల్‌ది రైతు పశ్చాత్తాప యాత్ర – జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోడి నాయకత్వంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విస్తృత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత యుపిఏ పాలనపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌ రైతుల ...

Read More »

గందర గోళంగా మునిసిపల్‌ సాధారణ సమావేశం

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ సాధారణ సమావేశం శనివారం ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం మునిసిపల్‌ ప్రత్యేక అధికారి సమక్షంలో నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందే పలువురు కౌన్సిలర్లు పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ, నీటి ఎద్దడి గురించి మునిసిపల్‌ పాలకవర్గాన్ని నిలదీశారు. బిజెపి, టిడిపి ఆర్మూర్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్లు ద్యాగ ఉదయ్‌, జి.వి. నర్సింహారెడ్డిలు మాట్లాడుతూ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, కానీ మునిసిపల్‌ పాలకవర్గం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ...

Read More »

ఊరిస్తున్న వాతావరణం

– తీవ్ర వడగాలులు, సాయంత్రం వేళ చలిగాలులు – చినుకు రాలడం లేదు – మరో రెండ్రోజుల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ సూచన నిజామాబాద్‌ కల్చరల్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాతావరణం ప్రజలను ఊరిస్తుంది…జల్లు కురిసినట్టే కురిసి మాయమవుతుంది… భానుడు మాత్రం మండిమండనట్టు మండుతూనే ఉన్నాడు…దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మే మాసాంతం కల్లా రుతుపవనాలు వచ్చే అవకాశముందని ఓవైపు వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. దీనికి తోడు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా చిరు జల్లులు కురియడంతో ...

Read More »

నిరుద్యోగ యువతకు శిక్షణ

నిజామాబాద్‌ అర్బన్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ రంగాల్లో నిరుద్యోగ యువతకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, స్టెఫ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేశం తెలిపారు. నిర్మాణ రంగంలో వృత్తి నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ, అలాగే మిషనరీ ట్రేడ్‌లో 30 మంది అభ్యర్థులకు మూడు నెలల శిక్షణ, బార్‌ బెండింగ్‌ ట్రేడ్‌లో 30 మందికి, పెయింటింగ్‌, డెకోరేషన్‌లో 30 మందికి, కార్పెంట్రీలో 30 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ...

Read More »

సమన్వయంతో పుష్కరాలు విజయవంతం చేద్దాం

– నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు నిజామాబాద్‌ అర్బన్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా రెండు జిల్లాల అధికారుల సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్లు రోనాల్డ్‌రోస్‌, జగన్మోహన్‌లు తెలిపారు. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా బాసరలోని త్రిపుల్‌ ఐటిలో ఇరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...

Read More »

డాక్టరేట్‌ అందుకోనున్న అమృతలత

నిజామాబాద్‌ కల్చరల్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ రచయిత, విద్యావేత్త, విజయ్‌ విద్యాసంస్థల అధినేత్రి అమృతలత రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ అందుకోనున్నారు. ఈ మేరకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్‌ను ప్రకటించింది. విద్యావిభాగానికి చెందిన ఆచార్య నిర్మలాదేవి పర్యవేక్షణలో ‘రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌ ఆఫ్‌ టెన్త్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ తెలుగు లాంగ్వేజ్‌ – ఏ స్టడీ’ అన్న అంశంపై విలువైన పరిశోధన గావించి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. దీంతో అమృతలతకు పిహెచ్‌డి పట్టా లభించింది. ...

Read More »

నేషనల్‌ స్కాలర్‌షిప్‌నకు విద్యార్థుల ఎంపిక

మద్నూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. మద్నూర్‌ మండలం పెద్ద తడ్గూర్‌ గ్రామానికి చెందిన సుభాష్‌, సుప్రియలు నేషనల్‌ మీన్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారని ఉపాధ్యాయుడు నరేందర్‌ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లకు ఎంపికవుతున్నారని, ఈయేడు కూడా ఎంపిక కావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, జిల్లాకు చెందిన పలువురు సుభాస్‌, ...

Read More »

తృటిలో తప్పిన ప్రమాదం

భీమ్‌గల్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలంలోని వేల్పూర్‌ రోడ్డు మార్గమధ్యంలో అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. కాగా ఆటో డ్రైవర్‌కు, ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ డ్రైవర్‌ వేగంగా ఆటోనడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలు నడుపరాదని, వాహన దృవీకరణ పత్రాలు, ఇన్సురెన్సు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. వాహనాల తనిఖీ సందర్భంగా సరైన పత్రాలు లేనివారికి జరిమానా విధించడమే ...

Read More »