Breaking News

Daily Archives: June 3, 2015

స్థల పరిశీలన

  ఆర్మూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీలకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆర్మూర్‌ మండలం దేగాం గ్రామంలో సోషల్‌ వెల్పేర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కాలేబ్‌, ఆర్డీవో యాదిరెడ్డి, తహసీల్దార్‌ శ్రీధర్‌లు ఎస్సీలకు పంపిణీ చేసే మూడెకరాల భూమి కొనుగోలుకు దేగాం గ్రామంలో భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్‌ డైరెక్టర్‌ భూమి యజమానులతో చర్చించారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీధర్‌ను ...

Read More »

తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

  ఆర్మూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కుమార్‌నారాయణ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ప్రజల ఆకాంక్ష సాధనకు మరో ఉద్యమానికి సన్నద్దం కావాలనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. సదుస్సు ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి వి.ప్రభాకర్‌ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా జేఏసి ఛైర్మన్‌ గోపాల్‌శర్మ మాట్లాడుతూ నిన్నటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు ...

Read More »

సుర్బిర్యాల్‌లో స్వచ్ఛభారత్‌

  ఆర్మూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలను జరపాలన్న ఆదేశాల మేరకు ఆర్మూర్‌ పట్టణం, మండలంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆర్మూర్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆద్వర్యంలో సుర్బిర్యాల్‌ గ్రామంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లపైగల చెత్తను చీపుర్లతో ఊడ్చి పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ ద్వారా దేశం అభివృద్ది చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ...

Read More »

మిషన్‌ కాకతీయ పనుల ప్రారంభం

  ఆర్మూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం, మండలంలో మిషన్‌ కాకతీయ పనులను బుధవారం ఆర్మూర్‌ నియోజకవర్గ వ్యవహారాల ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని కొత్తకుంట చెరువు, మండలంలోని పెర్కిట్‌ గ్రామంలోగల ఊర చెరువులో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించారు. ముందుగా పారతో మట్టిని తవ్వి తట్టలోకి ఎత్తి ట్రాక్టర్లలో పోసి పనులు ప్రారంభించారు. అనంతరం వారుమాట్లాడుతూ మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం వస్తుందని అన్నారు. చెరవులు బాగుంటే పల్లెలు పచ్చగా ఉంటాయన్నారు. చెరువులనుంచి ...

Read More »

రైల్వే పనులను ప్రారంభించిన ఎంపి కవిత

  ఆర్మూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన నిజామాబాద్‌-పెద్దపల్లి రైల్వే లైను నిర్మాణ పనులకు భూమిపూజ చేసి బుధవారం జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. అనంతరం మామిడిపల్లి సర్పంచ్‌ రవిగౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. నిజామాబాద్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పెద్దపల్లి- నిజామాబాద్‌ రైల్వే లైను పనులకు ఈ యేడు కేంద్ర ప్రబుత్వం నుంచి 141 కోట్ల నిధులను తీసుకువచ్చామని, దీంతో 90 శాతం ...

Read More »

ప్రథమ మహాసభల వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసంఘటిత రంగ కార్మిక సంఘాల సమాఖ్య టిఎకెఎస్‌ నిజామాబాద్‌ జిల్లా మహాసభలకు సంబందించిన గోడప్రతులను బుధవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ భవనంలో టిఎకెఎస్‌ జిల్లా మొదటి మహాసభలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సభలకు వివిధ ప్రజాసంఘాల మేధావులు, న్యాయవాదులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై సభ ...

Read More »

ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించాలి

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రధాన వ్యాపార మార్గాల్లో ఏర్పడ్డ తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యను బుధవారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిదులు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన వ్యాపార మార్గాలైన సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జెపిఎన్‌ రోడ్డు, మాయాబజార్‌లలో అనునిత్యం విపరీతమైన ట్రాఫిక్‌ ఏర్పడుతుందని పేర్కొన్నారు. నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ చేస్తున్నారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ...

Read More »

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామ ఎంపిటిసి కాశీంబి కుమారుడు ఎస్‌.కె.అహ్మద్‌ విద్యుత్‌ ఘాతంతో మరణించాడు. బుధవారం మృతుని కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మృతునికుటుంబాన్ని ఓదార్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, గోపిగౌడ్‌, రాంరెడ్డి, సర్పంచ్‌ బాల్‌రాజు, బాగయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆసుపత్రిపై దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన

  – డిఎస్పీకి వినతి కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం కామారెడ్డి పట్టణంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిరసన ప్రదర్శన చేపట్టారు. వైద్యులు, ఆసుపత్రులపై దాడులు ఆపాలంటూ పట్టణంలో నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ చేపట్టారు. ఐఎంఎ ఆధ్వర్యంలో వైద్యులు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక డిఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకొని డిఎస్పీ భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, ...

Read More »

5న జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు

  నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అవతరణ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 5వ తేదీన జిల్లా స్థాయి సాంస్కృతిక యువజన ఉత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి తెలిపారు. 15 నుంచి 35 సంవత్సరాలలోపు యువతీ, యువకులకు స్తానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో పోటీలు నిర్వహించబడుతాయన్నారు. ఇందులో భాగంగా వ్యాసరచన, ఎలక్యూషన్‌, క్విజ్‌, మ్యూజిక్‌, పెయింటింగ్‌, ఫోటోగ్రఫీ, షార్ట్‌ ఫిలిమ్స్‌, ఎంటర్‌ ప్రినర్‌షిప్‌, ఫోక్‌ సాంగ్‌, ఫోక్‌ డాన్సు, తదితర విభాగాల్లో పోటీలుంటాయన్నారు. ...

Read More »

సెంట్రల్‌ లైబ్రరి భవనాన్ని పరిశీలించిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న సెంట్రల్‌ లైబ్రరి భవనాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి బుధవారం సందర్శించారు. భవనాన్ని పూర్తిచేసి జూన్‌ రెండోవారంలో అందజేస్తామని ఇదివరకే సిపిడబ్ల్యుడి ఇంజనీర్లు చెప్పిన విషయం తెలిసిందే. పనులను సమీక్షించడానికి రిజిస్ట్రార్‌ లింబాద్రి ఇంజనీర్లతో కలిసి తనిఖీ చేశారు. త్వరలోనే భవనాన్ని, లైబ్రరీ వరకు రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. లైబ్రరీ వద్ద గార్డెన్‌ను ఏర్పాటు చేసి, చుట్టు మొక్కలు నాటించాలని, అదేవిధంగా పార్కింగ్‌ కొరకు సరైన ...

Read More »

అలరించిన ఆవిర్భావ వేడుకల కవితా గానం

నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు కవులు తమ కవితా గానంతో ఆవిర్భావ సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. బుధవారం సాయంత్రం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా కవిసమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు తమ తమ కవితలు వినిపించారు. తొలిదశ, మలిదశ ఉద్యమాల ఘట్టాలు, బంగారు తెలంగాణ ...

Read More »

మండల ఉత్తమ రచయిత్రిగా విజయలక్ష్మి

రెంజల్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా మండల స్థాయిలో ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు, సన్మానాలు అందించారు. ఇందులో భాగంగానే రెంజల్‌ మండల ఉత్తమ రచయిత్రిగా గంధం విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. విజయలక్ష్మి తాడ్‌బిలోలిలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కాగా చాలా కాలంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తమ కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. అదేవిధంగా రచయిత్రిగా ఉత్తమ కథల్ని సమాజానికి అందించి, సమాజంలో మంచి మార్పు ...

Read More »

విద్యాబాలన్‌కు డాక్టరేట్‌

ముంబాయి, జూన్‌ 3: ప్రముఖ బాలీవుడ్‌ నటీ విద్యాబాలన్‌కు ఆహ్మదాబాద్‌లోని రాయ్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. భారతీయ సినీ రంగానికి ఆమె చేస్తున్న సేవలకు గానూ ఈ గౌరవం లభించింది. ముంబాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యాబాలన్‌కు ఈ డాక్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీని ప్రధానం చేసారు. ఈనెల 10తో సినీరంగంలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి అవుతున్నందుకు, ఇదే సమయంలో డాక్టరేట్‌ రావడం ఎంతో అనందంగా ఉందని నటీ విద్యాబాలన్‌ ప్రకటించారు. సినీ, కళారంగంలో విద్యాబాలన్‌ చిత్రాలు మహిళాల్ని ఎంతోగానో ప్రభావితం ...

Read More »

జూన్‌ 30న ఒక్క సెకండ్‌ ఎక్స్‌ట్రా

లండన్‌, జూన్‌ 3: సాధారణ రోజు కంటే జూన్‌ 30న ఒక్క సెకండ్‌ ఎక్కువగా నమోదు అవుతుంది. అంటే రోజుకు 24 గంటలకు గానూ 86 వేల 400 సెకండ్లు ఉంటుంది. కాని అ రోజు మాత్రమే 86 వేల 401 సెకన్లు నమోదు అవుతుందని పారిస్‌ అబ్జర్వేటరీ ప్రకటించింది. గతంలో 2012లో ఇలాలీప్‌ సెకండ్‌ను కలిపారు. భూమి తన చుట్టు తాను తిరిగే సమయంలో ప్రతి రోజు సెకనులో 2 వేల వంతు తగ్గతూ ఉంటుంది. దీన్ని ప్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఎర్త్‌ రోటేషరన్‌ ...

Read More »

మిస్సింగ్‌ పిల్లల కోసం వెబ్‌సైట్‌

న్యూడిల్లీ, జూన్‌ 3 : దేశ వ్యాప్తంగా తప్పిపోయిన(మిస్సింగ్‌) పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పత్య్రేకంగా వెబ్‌ సైట్‌ను మంగళవారం ప్రారంభించింది. కేంద్ర మహిళ శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వెబ్‌సైట్‌ను కొనసాగిస్తారు. మహిళ శిశు సంక్షేమ శాఖ, టెలికాం శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వెబ్‌కు ఖోయా-పాయా గా నామకరణం చేసారు. జాతీయ నేర రికార్డుల లెక్కల ప్రకారం ఏటా 70వేల మంది పిల్లలు అదృశ్యం అవుతున్నట్లు తెలుస్తుందని, దీనిని నివారించేందుకు ప్రత్యేకంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు మంత్రి మేనాకాగాంధీ అన్నారు. ...

Read More »

జూన్‌ 15నుంచి బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత రోమింగ్‌… దేశ వ్యాప్తంగా అమలు

న్యూడిల్లీ, జూన్‌ 3 : దేశ వ్యాప్తంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత రోమింగ్‌ విధానాన్ని జూన్‌ 15 నుంచి అమలు చేస్తుంది. అలాగే జులై మాసం చివరి నాటికి పూర్తి స్థాయి మొబైల్‌ పోర్టబులిటీని చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల ఐటి శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు డిల్లీలో విలేకరుల సమావేశంలో వివరాలను ప్రకటించారు. టెలికాం, పోస్టల్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో సాధించిన ప్రగతి వివరాలను తెలిపారు. 2004లో రూ.10వేల కోట్ల లాభాల్లో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌ను యుపిఎ పదేళ్లలో రూ.7 వేల 5 వందల ...

Read More »

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు… ప్రామాణికతపై హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 3: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ శాసన సభ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై షార్జాలో కేసులు ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించి సంబంధిత పత్రాలపై ప్రామాణికతను తెలియజేయాలని కేంద్ర హోంశాఖకు ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సవాల్‌ చేస్తు ఆర్మూర్‌ నుంచే ఆర్‌పీఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తలారీ సత్యం హైకోర్టులో ఎన్నికల పిటీషన్‌ దాఖలు చేసారు. జీవన్‌రెడ్డి దుబాయిలో ఉండి వ్యాపారాల పేరుతో అక్కడి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ...

Read More »

నవ తెలంగాణ కోసం సిపిఎం పోరాటం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను నవ తెలంగాణగా సాధించుకునే దిశగా సిపిఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలోని ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో తెరాస కేవలం ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రజలు, శ్రామిక వర్గాల ఆందోళనలు పెరిగిపోయాయన్నారు. తెరాస ప్రభుత్వం ఎన్నిలక మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని, ...

Read More »

వివిధ రంగాల్లో సేవలందించిన వారికి సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ రంగాల్లోసేవలందించిన వారికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో సన్మానించారు. ఉత్తమ సంఘ సేవకుడిగా కె.నరేందర్‌రెడ్డి, ఉత్తమ వైద్యునిగా రమేశ్‌బాబు, సుధీర్‌కుమార్‌, ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పద్మజ, శివ, ఉత్తమ అర్చకులుగా జార్జ్‌ మాథ్యు కల్లు, ఉత్తమ అంగన్‌వాడి వర్కర్లుగా సుజాత, మల్లికార్జున్‌, ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగులుగా నరేందర్‌, అమృత, ఉత్తమ ఎన్జీవోగా మాసల లక్ష్మినారాయణ, ఉత్తమ క్రీడాకారునిగా సహస్ర, ఉత్తమ పరిశోధకునిగా గడిసెకుర్తి రాజేందర్‌లను ...

Read More »