జూన్‌ 30న ఒక్క సెకండ్‌ ఎక్స్‌ట్రా

లండన్‌, జూన్‌ 3:

సాధారణ రోజు కంటే జూన్‌ 30న ఒక్క సెకండ్‌ ఎక్కువగా నమోదు అవుతుంది. అంటే రోజుకు 24 గంటలకు గానూ 86 వేల 400 సెకండ్లు ఉంటుంది. కాని అ రోజు మాత్రమే 86 వేల 401 సెకన్లు నమోదు అవుతుందని పారిస్‌ అబ్జర్వేటరీ ప్రకటించింది. గతంలో 2012లో ఇలాలీప్‌ సెకండ్‌ను కలిపారు. భూమి తన చుట్టు తాను తిరిగే సమయంలో ప్రతి రోజు సెకనులో 2 వేల వంతు తగ్గతూ ఉంటుంది. దీన్ని ప్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఎర్త్‌ రోటేషరన్‌ సర్వీస్‌ పర్యవేక్షిస్తు ఉటుంది. అవసరమైనప్పుడు సమయాన్ని సరిచేసేందుకు ఒక సెకనును ఇలా కలుపుతారు. దీనిని ఆటమిక్‌ టైమ్‌కు భూస్వయం ప్రదక్షిణసమయం అనుసంధానం చేయడానికి ఇలా చేస్తారని సంస్థ తెలిపింది.

Check Also

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న ...

Comment on the article