Breaking News

భాష, సంస్కృతి, సంప్రదాయాలను పదిలపరుచుకోవాలి

 

– జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాలను పదిలపరుచుకుంటూ వాటి గురించి ఇతరులతో గర్వంగా చెప్పుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ఉద్భోదించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలోని కళాతోరణంలో గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల, తెలంగాణ యూనివర్సిటీ సమన్వయంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వము, అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన అనంతరం మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కాకుండా చూసుకోవాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న మన ప్రజలు మన సంప్రదాయాలు, సంస్కృతి, చరిత్ర భాష గురించి గర్వంగా చెప్పుకుంటారని, అయితే ఇక్కడ ఉన్న ప్రజల్లో మాత్రం అది కొందరిలో కొరవడిందని తెలిపారు. పాత తరంలో ప్రజల్లో ఈ అభిమానం ప్రస్ఫుటంగా కన్పిస్తున్నప్పటికి ప్రస్తుత తరంలో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతికి సంబందించి మంచి రచనలు రావడం లేదని పేర్కొన్నారు. మన సంస్కృతికి అద్దం పట్టే వస్త్రధారణ కూడా కనిపించడం లేదని బాధ వ్యక్తం చేశారు. ఇక్కడ తనకు తమిళులు కలిస్తే తమిళంలోనే గర్వంగా మాట్లాడుకుంటారని, ఇక్కడ మాత్రం అంతగా కనిపించడం లేదని, తెలుగు భాష కాకుండా ఇతర భాషల్లో ముఖ్యంగా ఆంగ్లంలో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని తెలిపారు.

సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, భాష, వారసత్వాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే ఒక రాష్ట్రం కాని, దేశం కాని ఆర్తికంగా, రాజకీయంగా అభివృద్ది చెందుతుందన్నారు. బెంగాళీలు, మహారాష్ట్రులు, తమిళులకు భాషాభిమానం ఎక్కువని, వారి లాగే మనలో కూడా అభిమానాన్ని పెంపొందించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చారిత్రక కట్టడాలు, సంస్కృతిని ప్రతిబింబించే దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించారని, వాటి గురించి తెలుసుకొని చూడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, బోనాలు తదితర సంప్రదాయాల గురించి తెలుసుకోవడమే గాకుండా దేశ విదేశాల్లోని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సమావేశంలో సంయుక్తకలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమంతో పాటు భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అభివృద్ధి చేసుకున్నప్పుడే సమతుల్యత ఏర్పడుతుందని తెలిపారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న రాష్ట్రంలో వీటిని కాపాడుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని, భవిష్యత్తు తరాలకు వీటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, అదనపు జేసి రాజారాం, కళాశాల ప్రధానాచార్యులు రాజేంద్రప్రసాద్‌, ఎన్‌సిఎల్‌పి పిడి సుధాకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి, లెక్చరర్లు, విద్యార్తులు, కవులు, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

సింగర్ కల్పన భర్త గురించి తెలిస్తే షాక్ అవుతారు..

సంగీత సరస్వతి ఆమె. శాస్త్రీయం, హిందుస్థానీ, రాక్, ఫోక్, పాప్ విధానం ఏదైనా ఆమె స్వరం దానికి సౌరభాన్ని అద్దుతుంది. ...

Comment on the article