Breaking News

Daily Archives: June 8, 2015

దాశరథి రంగాచార్య కన్నుమూత

హైదరాబాద్ : అక్షర వాచస్పతి, అభినవ గోర్కీ దాశరథి రంగాచార్య కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో అనారోగ్యంతో రంగాచార్య తుది శ్వాస విడిచారు. జీవన యానంలో అలసిపోని కలం యోధుడు దాశరథి రంగాచార్య. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తుపాకిని, కలాన్ని ఎక్కుపెట్టిన యోధుడాయన. 1928 ఆగస్టు 24న వరంగల్ జిల్లాలోని చినగూడూరు గ్రామంలో దాశరథి జన్మించారు. నవలాకారుడిగా ప్రసిద్ధికెక్కిన దాశరథి రంగాచార్య స్వయంగా ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని పలికిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యకు సోదరుడు. అయితే, కృష్ణమాచార్య నీడలో ...

Read More »

షరతులు లేకుండా పింఛన్లు అందజేయాలి

  ఆర్మూర్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి బీడీ కార్మికురాలికి వెయ్యి రూపాయల పింఛన్లు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ ఐఎఫ్‌టియు నాయకులు సోమవారం ఆర్మూర్‌ మార్కెట్‌ కమిటీ అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా ఎంపిడివో కార్యాలయానికి చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపిడివో ప్రవీణ్‌ కుమార్‌కువినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికి వెయ్యి రూపాయల భృతిని అందజేయాలని డిమాండ్‌ చేశారు. కుటుంబానికి ...

Read More »

సోయావిత్తనాల పంపిణీ

  డిచ్‌పల్లి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో సోమవారం సోయాబీన్‌ విత్తనాల పంపిణీ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పిటిసి అరుణ, ఎంపిపి దాసరి ఇంద్ర, సింగిల్‌విండో ఛైర్మన్‌ గజవాడ జైపాల్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పొంది అధిక దిగుబడులు సాధించాలని వారు కోరారు.

Read More »

మధ్యాహ్న భోజన ఏజెన్సీల సమస్యలు పరిష్కరించాలి

  డిచ్‌పల్లి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలో సోమవారం మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు వారి సమస్యలపై తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని, స్లాబ్‌ రేటు, కనీస వేతనాలు పెంచాలని తహసీల్దార్‌కు మెమోరాండం సమర్పించారు. జిల్లాలో వేలాది మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మరో పక్క బిల్లులు సకాలంలో అందక మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి ఏజెన్సీ నిర్వహించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం ...

Read More »

కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ దీక్షలు

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రాజధానిలో ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన దీక్షలకు మద్దతుగా నిజామాబాద్‌లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి, మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సోమవారం నుండి దీక్షలు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద రాష్ట్ర కమిటీ చేపట్టిన దీక్షకు మద్దతుగా ఈ దీక్షలను మూడు రోజుల పాటు చేస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు భుమన్న తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో దళిత విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్ల కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ ...

Read More »

13, 14 తేదీల్లో ఎబివిపి రాష్ట్రకార్యవర్గ సమావేశాలు

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎపిబిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు నిజామాబాద్‌లో నిర్వహించడం జరుగుతుందని ఎబివిపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు నరేష్‌ తెలిపారు. సోమవారం స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఎబివిపి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. ఎబివిపి పూర్వ జాతీయ అధ్యక్షులు మురళీమనోహర్‌ ముఖ్య అతిథిగా, అఖిల భారత ...

Read More »

నేడు మహాత్ముల విగ్రహాల ఆవిష్కరణ

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని అంబేద్కర్‌ కాలనీలో మంగళవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, శ్రీమతి రమాబాయి, మహాత్మా జ్యోతిరావుపూలే, శ్రీమతి సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరిస్తున్నట్లు అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ తెలిపారు. సోమవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నలుగురు ప్రముఖుల విగ్రహాలను ఒకే వేదికవద్ద నిర్మించడం నిజామాబాద్‌లోనే ప్రథమమని ఆయన అన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు ...

Read More »

14న హిందూసామ్రాజ్య దినోత్సవం

  నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందువాహిని ఆధ్వర్యంలో ఈ నెల 14న హిందూసామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వాహిని అధ్యక్షులు లక్ష్మణ్‌, పట్టణ అధ్యక్షులు ప్రకాశ్‌ తెలిపారు. ఈమేరకు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమానికి దేవాలయాల పరిరక్షణ సమితి నాయకులు కమలానంద భారతి, టిఎన్‌జివోస్‌ అధ్యక్షుడు గంగారామ్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని చెప్పారు. సామాజిక కార్యకర్త హరిదాస్‌, హిందువాహిని రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనులు వక్తగా హాజరవుతున్నారన్నారు. హిందూసామ్రాజ్య దినోత్సవం ...

Read More »

రెండోరోజు లలితాశ్రమంలో విశేష పూజలు

  నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రారంభమైన లలితాదేవి ఆశ్రమ ఆలయ 12 వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే రెండో రోజు సోమవారం ఉదయం 8.30 గంటలనుంచి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఇందులో శాంతిపాఠము, నిత్యపూజా హోమాదులు, జప, పారాయణములు, అష్టోత్తర సహస్ర కలశ స్థాపన, పూజనము, దేవతా హోమములు, శ్రీ లలితాదేవి అమ్మవారికి మహాభిషేకము, తీర్ధ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వేలేటి సుధాకర శర్మ, ...

Read More »

అవతరణ సంబరాలు ప్రశంసాపూర్వకంగా ముగిశాయి

  – ఇక గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిద్దాం : కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ముగిసినందున తదుపరి జరిగే ప్లాగ్‌షిప్‌ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌లో ప్రజల విజ్ఞప్తుల స్వీకరణ అనంతరం మాట్లాడుతూ 6 రోజుల పాటు నిర్వహించుకున్న అవతరణ సంబరాలు ప్రశంసాపూర్వకంగా నిర్వహించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కళాకారులు, సిబ్బంది, కవులు, రచయితలు, ప్రజలు, ...

Read More »

బాబు – స్టీఫెన్ మధ్య ఫోన్ సంభాషణ

బాబు – స్టీఫెన్ మధ్య ఫోన్ సంభాషణ చంద్రబాబు తరపు మనిషి – హాలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ బి ఆన్ ద లైన్..(హలో బ్రదర్ బాబు గారు మీతో మాట్లాడుతారు.. లైన్‌లో ఉండండి) స్టీఫెన్ : యా.. బాబు : హలో.. స్టీఫెన్ : సార్.. గుడ్ ఈవినింగ్ సార్.. బాబు : హౌ ఆర్ యూ(మీరు ఎలా ఉన్నారు?). స్టీఫెన్ : ఫైన్ థాంక్యూ సార్.. బాబు : మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ ...

Read More »