Breaking News

దాశరథి రంగాచార్య కన్నుమూత

హైదరాబాద్ : అక్షర వాచస్పతి, అభినవ గోర్కీ దాశరథి రంగాచార్య కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో అనారోగ్యంతో రంగాచార్య తుది శ్వాస విడిచారు. జీవన యానంలో అలసిపోని కలం యోధుడు దాశరథి రంగాచార్య. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తుపాకిని, కలాన్ని ఎక్కుపెట్టిన యోధుడాయన. 1928 ఆగస్టు 24న వరంగల్ జిల్లాలోని చినగూడూరు గ్రామంలో దాశరథి జన్మించారు. నవలాకారుడిగా ప్రసిద్ధికెక్కిన దాశరథి రంగాచార్య స్వయంగా ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని పలికిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యకు సోదరుడు. అయితే, కృష్ణమాచార్య నీడలో ఆయన ఎన్నడూ లేరు. సొంత వ్యక్తిత్వాన్ని, సొంత ప్రవక్తతను సంతరించుకుని తనదంటూ సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు రంగాచార్య. దాశరథి రంగాచార్య నవలాకారుడిగా ప్రసిద్ధులు. ఆయన రాసిన చిల్లర దేవుళ్లు, మోదుగు పూలు, జనపదం నవలలు తెలంగాణ సమాజ చరిత్రకు అద్దం పడుతాయి. సామాజిక చరిత్రను సృజనాత్మకంగా చెప్పడంలో ఆయనది అందె వేసిన చేయి.

రంగాచార్య జీవిత విశేషాలు..

1928లో వరంగల్ జిల్లాజిల్లా చినగూడురులో జన్మించారు.
1951-57 ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
1957-58 మధ్య సికింద్రాబాద్ మునిస్పల్ కార్పొరేషన్ లో విధులు నిర్వర్తించారు.
నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.
తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు.
‘చిల్లర దేవుళ్లు’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
దేవదాసు, అమృతంగమయ, చతుర్వేద సంహిత, జీవనయానం, శ్రీ మహాభారతం, అమృత ఉపనిషత్తు తదితర రచనలు చేశారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయానుకునే వారికి శుభవార్త

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయాల‌నుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *