Breaking News

Daily Archives: June 13, 2015

‘బాహుబలి’ ఆడియో విడుదల

హైదరాబాద్‌: తిరుపతి ఎస్వీయూ మైదానంలో జరుగుతున్న ‘బాహుబలి’ ఆడియో విడుదల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, కథానాయకుడు ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ, కృష్ణంరాజు, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.మరోపక్క అభిమానులతో ఎస్వీయూ మైదానం కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా ప్రభాస్‌ వేదిక వద్దకు రాగానే అభిమానుల కేరింతతో మైదానం దద్ధరిల్లింది. ముందు వరుసలో రాజమౌళి, నాజర్‌, సత్యరాజ్‌, ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ...

Read More »

నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలు

  డిచ్‌పల్లి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటు పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సగానికిపైగా బస్సులు ఫిట్‌నెస్‌ లేకుండానే నడుపుతున్నారు. పాఠశాలల నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలు బహిరంగంగా బోర్డులపై ఉంచాల్సి ఉండగా ఏ ఒక్క పాఠశాల కూడా ఈ విషయాన్ని పాటించడం లేదు. విద్యార్తులకు కావాల్సిన అన్నిరకాల వస్తువులు పాఠశాలల్లోనే విక్రయాలు చేస్తున్నారు. కనీస వసతులు లేకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇటు ఉపాధ్యాయులను, విద్యార్థులను దోపిడి చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం పీపీఎఫ్‌ ...

Read More »

ఎమ్మెల్యేపై అసత్య ప్రకటనలుచేసిన వ్యక్తి అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు పి.శి.భోజన్న వాట్సప్‌లో ఎమ్మెల్యేపై అసత్య ప్రకటనలు, పుకార్లు పోస్టు చేస్తూ, తెరాస పార్టీ కార్యకర్తలందరిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాడని తెరాస పార్టీ జిల్లా కార్యదర్శి మేకల సురేశ్‌ ఫిర్యాదుమేరకు భోజన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు.

Read More »

ఆర్మూర్‌ పోలీసులపై చర్యలు తీసుకోవాలి

  ఆర్మూర్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఉదయం 7.30 గంటలకు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌, సంతోష్‌కుమార్‌, ఇద్దరు కానిస్టేబుళ్ళు డిఎస్పీ ఆకుల రాంరెడ్డి ఆదేశాల మేరకు మఫ్టీలో తన ఇంటికి వచ్చి అక్రమంగా తనను అరెస్టు చేశారని ఆర్మూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భోజన్న తెలిపారు. ఎలాంటి తప్పు చేయకున్నా తనను అక్రమంగా అరెస్టుచేసినందుకు ఆర్మూర్‌ పోలీసులపై నిజామాబాద్‌ డిజిపి, హైదరాబాద్‌ ఐజి, న్యూఢిల్లీ ఎస్సీ కమీషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. తాను ఎలాంటి ...

Read More »

మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభం

  బీర్కూర్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని పెద్ద చెరువులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. చెరువులో నీరు వృధా పోకుండా చెరువుకు రెండు వైపులా 350 మీటర్ల పొడవునా గోడ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అంకోల్‌ గ్రామం నుంచి సంగం గ్రామం వరకు 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించి ...

Read More »

టియస్‌టియస్‌ అత్యవసర సమావేశం….

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియస్‌.టి.యఫ్‌ జిల్లా శాఖ అత్యసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాల్‌ సింగ్‌ హజరై ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. జిల్లాలోని ఉపాధ్యాయ సంఘకార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ముత్తారం నరసింహస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలపైన ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా విమర్శించారు. పాఠశాలలు తెరిచినా పుస్తకాలు కరువు, సర్విస్సు రూల్స్‌ లేక పదోన్నతులు చేపట్టాలని, పిఆర్‌సి బాకాయిలు బుకాయింపులతో సరిపేట్టడం, ...

Read More »

ఇంట్లోకి చొరబడి.. కత్తులతో బెదిరించి

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 13నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని గౌతమ్‌నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం గౌతమ్‌నగర్‌లోని ఒక ఇంట్లో చొరబడిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వారిని కట్టేసి రూ. 80వేల నగదు, 6 తులాల బంగారం దోచుకున్నారు. అంతేకాకుండా మారుతికారుతో ఉడాయించారు. స్థానికుల సహాయంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read More »

గన్నారంలో మావోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్లు

  – గన్నారంలో కలకలం – గ్రామస్తుల ఆందోళన – ఆకతాయిల పనే అంటున్న పోలీసులు డిచ్‌పల్లి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసు సర్కిల్‌ పరిధిలోని గన్నారం గ్రామంలో మావోయిస్టు పేరుతో వాల్‌పోస్టర్లు వెలిసిన సందర్భంగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలో బస్టాండ్‌, సుభాష్‌ విగ్రహం, గాంధీ విగ్రహం మూడుచోట్ల సిర్నాపల్లి ఏరియా దళం (పీపుల్స్‌వార్‌) పేరిట హెచ్చరికలు చేసిన పోస్టర్లు శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. ఇది మావోయిస్టుల పనేనా లేదా ...

Read More »

అసంపూర్తిగా నిలిచిన డ్వాక్రా సంఘం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో మహిళా డ్వాక్రా గ్రూపు సంఘం కోసం గత ప్రభుత్వ హయాంలో ఎంపీ ల్యాడ్స్‌ కింద మంజూరైన భవనం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా నిలిచిపోయింది. గ్రామంలో డ్వాక్రా మహిళాలకు నెలవారి సమావేశాలు నిర్వహించేందుకు భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని డ్వాక్రా సంఘాల మహిళలు పేర్కొంటున్నారు. భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘ భవనం పట్టించుకున్న ...

Read More »

ఈటల రాజేందర్ కారు బోల్తా

మానకొండూరు : మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా… శనివారం సాయంత్రం మానకొండూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఓ టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేయబోతూ దాన్ని తాకడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి రాజేందర్‌కు కాలుకి, ఛాతీ భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్‌మెన్ కూడా గాయపడ్డారు. వారిని ఎస్కార్ట్ వాహనంలో కరీంనగర్‌లోని అపోలో రిచ్ ఆస్పత్రికి తరలించారు. హుజూరాబాద్ ...

Read More »