Breaking News

Daily Archives: June 17, 2015

ప్రయివేటు పాఠశాలలపై చర్యలకు వినతి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజన్‌లోని ప్రయివేటు పాఠశాలల్లో యూనిఫారం, పుస్తకాలు, షూస్‌ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఆమ్‌ఆద్మీ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆప్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ రాణా ప్రతాప్‌ మాట్లాడుతూ ప్రయివేటు స్కూళ్లలో కక్కుర్తి దందాను కొనసాగిస్తున్నారని, పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి వ్యాపారం చేయడానికి వీలులేదని తెలిసి యూనిఫాంలు, పుస్తకాలు, తదితరాలు విక్రయించడం గర్హణీయమన్నారు. ఈ వ్యాపారంపై విద్యాశాఖాధికారులు ...

Read More »

ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పోస్టుకార్డులను పంపారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బానుప్రసాద్‌ మాట్లాడుతూ 1996 తెలంగాణ ఉద్యమం నాటినుంచి నేటి ఉద్యమం వరకు సాయిబాబా కీలకపాత్ర పోషించారన్నారు. నాటి కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల పోరాటంలో మద్దతుగా నిలిచిన సాయిబాబాను జీర్ణించుకోలేక మావోయిస్టుతో సంబంధాలున్నాయని చిత్రీకరించి అరెస్టు చేయడం ...

Read More »

గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుర్తింపు లేని కార్పొరేట్‌ పాఠశాలలను మూసివేయాలని పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి పట్టణంలోని పిడిఎస్‌యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కనీస నిబందనలు పాటించకున్నా ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు విద్యాశాఖాధికారులు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం గర్హణీయమన్నారు. గుర్తింపు లేకున్నా ఆకర్షణీయమైన పేర్లతో కార్పొరేట్‌ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని మభ్యపెడుతూ వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యాసంస్థలపై విద్యాశాఖాధికారుల ...

Read More »

విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఎదుట జాతీయ రహదారిపై బుధవారం ఏబివిపి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబివిపి నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయకపోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాటిని విడుదల ...

Read More »

పేద విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలల్లో సీట్లు కేటాయించాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థికంగా వెనకబడిన పేద విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు నిేబంధనల ప్రకారం కేటాయించాలి ఎన్‌ఎస్‌యుఐ జిల్లా కార్యదర్శి సందీప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ప్రయివేటు విద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారి అధిక ఫీజులు, డొనేషన్లు, స్టేషనరీల పేరిట దోపిడి చేస్తున్నాయని ఆరోపించారు. వీటి నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం జీవో 42ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా ఆర్థికంగా ఎదగాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పరుచుకొని తద్వారా ఆర్థికంగా ఎదగాలని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఐకెపి అర్బన్‌, మెప్మాలోని బిస్మిల్లా సమాఖ్య సంఘాన్ని ఏర్పాటు చేసి బుధవారం నాటికి ఐదేళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా సమఖ్య ప్రతినిధులు మహాజనసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఛైర్‌పర్సన్‌ ప్రసంగించారు. ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ...

Read More »

ఆర్మూర్‌లో చైన్‌ స్నాచింగ్‌

  ఆర్మూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి జాతీయ రహదారి 44పై లక్ష్మి అనే మహిళ మెడ నుంచి బుధవారం గుర్తు తెలియని దుండగులు రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించినట్టు బాధితురాలు తెలిపారు. బుధవారం మెంట్రాజ్‌పల్లి నుంచి ఆర్మూర్‌ వైపు ఆటోలో వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు ఆమె మెడనుంచి బంగారు గొలుసును అపహరించినట్టు బాధితురాలు తెలిపారు.

Read More »

ప్రభుత్వ బాలికల పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ

  ఆర్మూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రిన్సిపల్‌ కవిత ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటపుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు అన్ని రంగాల్లో నైపుణ్యతను పెంపొందించేలా విద్యాబోధన చేస్తున్నట్టు ఆమె చెప్పారు.

Read More »

ఘనంగా శ్రీశ్రీ వర్ధంతి వేడుకలు

  ఆర్మూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో అరునోదయ కళాకారుల ఆధ్వర్యంలో శ్రీశ్రీ 32వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీశ్రీ రాసిన పలు రచనల గురించి వారు ప్రస్తావించారు. అనంతరం ఆయన ఔన్నత్యాన్ని, సాహిత్య సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు ఆలపించిన గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Read More »

తెవివి ఆంగ్ల విభాగాధిపతిగా డాక్టర్‌ కె.వి.రమణాచారి

  డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం అధిపతిగా డాక్టర్‌ కె.వి. రమణాచారి నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారని, ఈమేరకు నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డాక్టర్‌ రమణాచారికి అందజేశారు. మొత్తం యుజి, పిజిలో కలిపి 15 సంవత్సరాల బోధన అనుభవం కలిగిన రమణాచారి గతంలో కాకతీయ యూనివర్సిటీలో కూడా తాత్కాలిక ప్రతిపాదికన బోధించిన అనుభవం ఉంది. ఆంగ్ల భాషలో భారతీయ రచనలు, బ్రిటీష్‌ లిటరేచర్‌లో స్పెషలైజేషన్‌ ...

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  – సంయుక్త కలెక్టర్‌ రాజారాం నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెంగ్యు, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సంబంధిత అదికారులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని అదనపు సంయుక్త కలెక్టర్‌ రాజారాం ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల నియంత్రణపై బుధవారం అదనపు జేసి చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కారణాల వల్ల ఈ వ్యాధులు ప్రబలడంపై ప్రజలకు అవగాహన కల్పించి నివారించడానికి ...

Read More »

గురువారం నుంచి డిగ్రీ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం 18వ తేదీ నుంచి తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు మొదలవుతాయని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 27 వేల మంది విద్యార్థులు, 27 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు రాస్తారని తెలిపారు. జూలై 8 వరకు జరుగుతాయని విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అన్నారు. అన్ని పరీక్షా ...

Read More »

12 అడుగుల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, గోదాముల్లో కూడా మొక్కలను నాటడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు / కమీషనర్‌ శరత్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా హరితహారంపై సంబంధిత వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న స్థలాలకు అనుకూలంగా 12 అడుగుల మొక్కలను నాటడానికి ...

Read More »

సీఎం కేసీఆర్ ముక్కుసూటి తనానికి తలవంచుతున్నా-దర్శకుడు రాంగోపాల్‌వర్మ

  -ఆంధ్రా పౌరుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా! సీఎం కేసీఆర్ ముక్కుసూటి తనానికి తలవంచుతున్నా -ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తీరుపై మండిపాటు -ట్విట్టర్‌లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు ముంబై, జూన్ 16: ఓటుకు నోటు కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుతో తాను ఆంధ్రా పౌరుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమకాలీన పరిస్థితులపై సందర్భోచితంగా సోషల్ మీడియాలో కుండబద్దలు కొట్టే వర్మ తాజాగా ట్విట్టర్‌లో చంద్రబాబుపై విమర్శల పరంపరను కొనసాగించారు. జాతీయస్థాయిలో ఆంధ్రా ప్రజలను ...

Read More »